మిషెల్ ఒబామా బట్టల బిల్లు కట్టేదెవరు?
Published Tue, Jun 3 2014 11:48 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM
మామూలుగానే అమెరికా అధ్యక్షుడి భార్యలు భలే హై ప్రొఫైల్ గా ఉంటారు. సందర్భోచిత దుస్తులతో దర్శనమిస్తారు. వాళ్ల స్టయిల్, వేసుకున్న దుస్తుల గురించి ఫాషన్ మాగజైన్ల నుంచి టాబ్లాయిడ్ల దాకా తెగ చర్చిస్తారు. ఇక ఒబామా శ్రీమతి మిషెల్ దుస్తుల గురించి చెప్పనే అక్కర్లేదు.
ఆమె 'మోస్ట్ స్టైలిష్ ఫస్ట్ లేడీ' గా ఇప్పటికే పేరొందారు. గంటకో స్కర్టు, గడియకో గౌను తో ఆమె దర్శనమిచి, కెమెరామెన్లకు బోలెడంత పనిపెట్టారు. అయితే ఆమె దుస్తుల ఖర్చు ఎవరు భరిస్తారు? ఆమెకు జీతం లేదు. వార్డ్ రోబ్ అలవెన్స్ కూడా లేదు. అయితే ఆమె దుస్తుల ఖర్చు ఆమే భరిస్తారు.
మామూలుగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫస్ట్ లేడీకి దుస్తులు గిఫ్ట్ ఇవ్వడమూ జరుగుతుంది. కానీ వాడిన తరువాత వాటిని వెంట తీసుకెళ్లడానికి వీలుండదు. అమెరికన్ జాతీయ వస్తు సంగ్రహాలయానికి పంపించాలి. అక్కడే వాటిని భద్రపరచి ఉంచుతారు.
Advertisement
Advertisement