Winter Wear
-
వింటర్ సీజన్‌కి ప్రత్యేకంగా స్టైలింగ్.. వివాహ వేడుకల్లో అట్రాక్షన్
వివాహ వేడుకలలో కట్టే చీరలే దివ్యంగా వెలిగిపోతుంటాయి. ఇక వాటికి అదనంగా మరో స్టయిల్‌ను కూడా జోడిస్తే.. ఆ వెలుగులు రెట్టింపు అవుతాయి. పట్టు, వెల్వెట్, ఎంబ్రాయిడరీ దుపట్టా చీర మీదకు ధరించినా, డ్రేపింగ్‌లో జత చేసినా ఆ స్టైల్ హుందాగా కనిపిస్తుంది. ఈ వింటర్ సీజన్‌కి ప్రత్యేకంగా ఉండటమే కాదు చలి నుంచి రక్షణను కూడా ఇస్తుంది. ఎవర్‌గ్రీన్‌గా ఉండే శారీ కట్టుకి మహారాణి కళను లె చ్చే దుపట్టా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. కాంట్రాస్ట్ శారీ కలర్, దుపట్టా కలరా పూర్తి కాంట్రాస్ట్ ఉన్నది ఎంచుకోవాలి. దీనివల్ల రెండూ భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. శాలువా స్టైల్ చీర మీదకు దుపట్టాను శాలువా మాదిరి కప్పుకున్నా ఈ సీజన్‌కి వెచ్చగా, బ్రైట్‌గా ఉంటుంది. అయితే, దుపట్టా గ్రాండ్‌గా ఉన్నది ఎంచుకోవాలి. ఇందుకు పట్టు, బ్రొకేడ్, ఎంబ్రాయిడరీ దుపట్టాలను చీరలను ఎంపికను బట్టి తీసుకోవాలి. డ్రేపింగ్ దుపట్టా చీరకట్టులో భాగంగా దుపట్టాను జత చేర్చి కట్టడం ఒక స్టైల్. ఈ కట్టును నిపుణుల ఆధ్యర్యంలో సెట్ చేయించుకోవాలి. ఈ కట్టుకు కూడా కాంట్రాస్ట్ కలర్స్ ఉండేలా చూసుకోవాలి. రంగు ఒకటే... డిజైన్ వేరు సేమ్ కలర్ శారీ దుపట్టాను ఎంచుకున్నా ఎంబ్రాయిడరీ డిజైన్‌లో కాంబినేషన్స్ చూసుకోవాలి. చీర డిజైన్ హెవీగా ఉంటే, దుపట్టా డిజైన్ బ్రైట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. పట్టు శారీ మీదకు డిజైనర్ దుపట్టాను ఎంచుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. -
Fashion: స్టైల్‌తో పాటు వింటర్పై ఈజీగా విన్ అయ్యేలా.. డెనిమ్ వేర్
చలిగాలుల సందడి పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న డ్రెస్సింగ్ స్టైల్‌కి కొత్త మార్పు రాబోతోంది. అది స్వెటర్ కావచ్చు లేదంటే శాలువా అవ్వచ్చు. కానీ, డెనిమ్ ఎంచుకుంటే.. స్టైల్‌తో పాటు వింటర్పై ఈజీగా విన్ అవ్వచ్చు. అందుకే, డెనిమ్ క్యాజువల్ వేర్ నుంచి కంఫర్ట్ వేర్‌గా ఆఫీస్ వేర్ నుంచి పార్టీవేర్‌గా సీజన్‌కి తగిన లుక్‌తో అట్రాక్ట్ చేసేస్తోంది. ఇండోవెస్ట్రన్ స్టైల్‌ను డెనిమ్ సూట్స్‌తో ఇట్టే తీసుకురావచ్చు. డెనిమ్ జాకెట్స్ చీరల మీదకూ ధరించవచ్చు. ఈ కాంబినేషన్‌కు ప్యాచ్‌వర్క్, ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్స్‌ను ఎంచుకోవచ్చు. ఫంకీ జ్యువెలరీ ఈ స్టైల్‌కి బెస్ట్ ఎంపిక అవుతుంది. -
Thangka Print: మగువల మనసు దోచుకుంటున్న ‘తంగ్కా’ డిజైన్
Winter Fashion: Saundh New Collection Traditional Thangka Print: జానపదుల కళారూపాల్లో ఆత్మ ఉంటుంది. బౌద్ధ కళలో ఆధ్యాత్మికత కూడా తోడవుతుంది. వేడుకలకు కాంతిమంతమైన రంగుల రంగేళీ జతగా చేరుతుంది. వీటి మేళవింపుతో చేసే పెయింటింగ్.. దారపు పోగులతో అల్లే అల్లికలు.. అద్దకం పనితనం.. ముత్యాల అలంకరణ.. గోటా ఆప్లిక్ వర్క్‌ల మెరుపుదనం అన్నీ ఈ డిజైన్లలో చూపితే అవి శీతాకాలపు ఫ్యాషన్‌గా ఇలా మన కళ్లముందు నిలుస్తాయి. జానపద కళల వేడుకకు వేదికైన ఫ్యాషన్ హౌజ్ ‘సౌంద్’ విడుదల చేసిన కలెక్షన్ ఇది. సంప్రదాయ ఎంబ్రాయిడరీలు, మోటిఫ్‌లు, చేతితో చేసిన ఇతర అలంకరణలు, డిజిటల్ ప్రింట్లు ఈ డిజైన్లకు పండగల కళను తీసుకువచ్చాయి. దుపట్టా, అనార్కలీ, లాంగ్ కుర్తా, చీర కొంగు.. బౌద్ధ కళకు కాన్వాస్‌లు అవుతున్నాయి. వీటికి దేశమంతటా గల జానపద సంస్కృతిని ప్రతిఫలింపజేసే ఎంబ్రాయిడరీ, కచ్ వర్క్, గోటా పట్టీ, టాజిల్స్.. వంటి హంగులు అమరితే ఈ సీజన్‌ని మరింత కాంతిమంతంగా మార్చేస్తాయి. ‘తంగ్కా’ అనేది టిబెటన్ బౌధ్ద కళ. ఈ నమూనాలతో కనువిందు చేసే డిజైన్లు ఇప్పుడు అంతటా మగువలను ఆకట్టుకుంటున్నాయి. -
ఆమెను కొత్త స్వెటర్ కొనుక్కోనిద్దాం..
చలికాలం పిల్లలు నిద్ర లేవరు. వారికి ఆ హక్కు ఉందట. భర్త గారు ‘కాసేపు నిద్రపోనీ’ అంటుంటారు. ఆయనగారిని ఏం అనగలం. కాని స్త్రీలు లేవాల్సిందే. వంట చేయాల్సిందే. అన్నీ సిద్ధం చేయాల్సిందే. వారెప్పుడు రుతువులను ఎంజాయ్ చేయాలి? భార్యకు కొత్త స్వెటర్ కొనివ్వాలంటే టైమ్ ఉండదు. పోనీ ఆమెను కొనుక్కోనివ్వము. అమ్మకు చెవులకు స్కార్ఫ్ ఎప్పుడూ పాతదే. చలికి ఆడవాళ్ల పాదాలకు సాక్సులు అవసరం అని కూడా అనుకోము. ఈ కాలంలో స్త్రీలకు ఏం కావాలో వారిని తెచ్చుకోనివ్వండి. పని ఒత్తిడి తగ్గించండి. టీ తాగుతూ చలిని వారినీ ఆస్వాదించనివ్వండి. చలికాలం బద్దకం కాలం. వెచ్చగా ముసుగుతన్నమని చెప్పేకాలం. కాని ఆ లగ్జరీ ఇంటి మగవారికి, పిల్లలకి ఉన్నట్టుగా ఆడవారికి ఉండదు. బయట ఎంత చలి ఉన్నా తెల్లారే ఆరుకు వాళ్లు లేవాల్సిందే. బయట ఎంత మంచు కురుస్తున్నా తొంగి చూడక వంట గదిలో దూరాల్సిందే. వరండాలోనో, బాల్కనీలోనో, ముంగిలి లోనో కుర్చీ వేసుకుని కాఫీ తాగుతూ మంచుతో తడిసిన బంతిపూల మొక్కను చూడాలని వారికీ ఉంటుంది. కాని వారికి కాఫీ తెచ్చిచ్చేవారు ఎవరూ ఉండరు. వారి కాఫీ వాళ్లే పెట్టుకోవాలి. చలికాలమైనా హిమ ఉదయమైనా. ఇంకా ద్వితీయశ్రేణి పౌరులేనా? చలికాలం వస్తే భర్త బజారు నుంచి వస్తూ వస్తూ రోడ్డు మీద అమ్మే ఒక జర్కిన్నో, స్వెటర్నో కొనుక్కుంటాడు. బండి నడుపుతాడు కదా మంకీ క్యాప్ కొనుక్కుంటాడు. పిల్లలు చలికి ఎక్స్పోజ్ అయితే ఎలా? వారి కోసం తప్పక స్వెటర్లు కొంటాడు. కాని భార్యకు ఎందుకనో వెంటనే కొనడు. కొనాలన్నా ఉంది కదా అనిపిస్తుంది. ఆమే కొనుక్కుంటుందిలే మన సెలక్షన్ నచ్చదు అనుకుంటాడు. ఆమె కొనుక్కునేది లేదు. ఆమెకు ఆ వీలూ చిక్కదు. చాలా ఇళ్లల్లో స్త్రీలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. స్త్రీలకు రకరకాల స్వెటర్లు అమ్ముతారు. హాఫ్ స్వెటర్లు ఇంట్లో వేసుకోవచ్చు. ఫుల్స్వెటర్లు బయటకు వెళ్లేప్పుడు. కొనే స్తోమత ఉన్నా ‘ఇన్ని ఎందుకు’ అనే ప్రశ్న ఆమెకు ఎదురవుతుంది. స్త్రీలు సౌందర్య ప్రియులు అని తెలుసు. ఈ శీతాకాలం రెండు మూడు నెలలు ఒకే ఒక్క స్వెటర్‌తో వాళ్లు ఎందుకు గడిపేయాలి. అక్కర్లేదు అని వారూ అనుకోరు. ఇంటి మగవారూ చెప్పరు. అమ్మ సంగతి ఏమిటి? ఇంట్లో అమ్మ ఉంటే శీతాకాలం ఆమెకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆమెకు బడ్జెట్ కేటాయించాలి. ఒక మంచి షాల్ కప్పుకుని ఆమె కూచుంటే ఎంత బాగుంటుంది. ఆమెకు నచ్చిన రంగుల్లో రెండు మూడు స్కార్ఫులు ఉంటే ఎంత బాగుంటుంది. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు, సాక్సులు ఆమెకు తప్పనిసరి. ఒక కొత్త రగ్గు కొని ఇస్తే ఆ ఉత్సాహమే వేరు. అమ్మ ఆ ఇంట్లో కొడుకు, కోడలు మీద ఆధారితమైతే ఆమెను చిన్నబుచ్చకుండా ఇవన్నీ లేదా వీటిలో కొన్నయినా ఈ శీతాకాలపు ప్రారంభంలోనే ఆమెకు కొనిస్తే నోరు తెరిచి అడగాల్సిన అవస్థ తప్పుతుంది. ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి. ఆ డబ్బును చాలా ఇళ్లల్లో ఆ అమ్మలు, అత్తలు కొడుకు చేతుల్లోనో కోడలు చేతుల్లోనో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ‘ఈ నెల డబ్బు మీ కోసం మీ చలికాలపు అవసరాల కోసం ఉంచుకోండి’ అని చెప్పలేమా? వంట బాధ రోజూ ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నా ఒక్కపూట బజారు నుంచి తెచ్చుకోండి అంటే ‘బజారు టిఫినా’ అని విసుక్కుని రోజు మూడ్‌ని పాడు చేసే భర్తలు ఉంటారు. రోజూ టిఫిన్ చేసే బాధ వేరే ఏ కాలంలో అయినా ఓకే కాని చలికాలం చాలా కష్టం. చలికి పని చేయబుద్ధి కాదు. ఎవరైనా చేసిపెడితే బాగుండు అని భర్తలకు సదా అనిపించినట్టే భార్యలకు అప్పుడప్పుడైనా అనిపిస్తుంది. భోజనం తిప్పలు ఎలాగూ తప్పవు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ఎలా ఆ శ్రమ కాస్తంత తగ్గించవచ్చో ప్రతి ఇంటి పురుషులు, పిల్లలు ఆలోచించాలి. ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్స్టంట్ టిఫిన్లు, ఆమె చేయకపోయినా మనం చేసుకు తినగలిగే అల్పాహారాలు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. యూట్యూబ్‌లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. మనం ఇల్లు కదలకపోయినా తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. వారంలో ఒకటి రెండు రోజులైనా ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి ఆమెను విముక్తి చేస్తే ఆమెకు కలిగే సంతోషం ఆలోచించారా ఎవరైనా? ఆమె సౌందర్యం అవును. చక్కగా ఉండే హక్కు, సౌందర్యాన్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మగవాళ్లు దీనిని లెక్క చేయొచ్చు చేయకపోవచ్చు. కాని శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... అదనపు ఖర్చే. ఆ ఖర్చు వారు సంపాదించే దాని నుంచైనా భర్త సంపాదన నుంచైనా చేసే వాతావరణం ఇంట్లో ఉండాలి. చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధపడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి. ఈ కాలంలో జలుబు, త్రోట్ ఇన్ఫెక్షన్లు సహజం. వాటి నుంచి కాపాడేలా ఆమెను వెచ్చని వాతావరణంలో విశ్రాంతంగా ఉంచడం కోసం ఏం చేయొచ్చో ఆలోచించాలి. నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్ చేసేలా చూద్దాం. హ్యాపీ వింటర్. నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. -
చలిని చంపెయ్... స్టైల్‌ని పుట్టించెయ్
సాయంత్రం ఆరు దాటిందంటే చల్లగాలి మెలిపెడుతోంది. చేతులు, కాళ్లు పొడిబారి రంగు మారుతున్నాయి. అమ్మమ్మా తాతయ్యల్లా షాల్స్, స్వెటర్స్ వేసుకుని వెళ్లాలనే ఆలోచనకి ఇప్పుడు అవకాశమే లేదు. పైగా వెచ్చదనం వంకతో ఎన్నో స్టైలిష్ యాక్ససరీస్ ధరించే అవకాశం ఉన్న సీజన్ ఇది అంటున్నారు సిటీ స్టైలిస్ట్‌లు. మీ స్టైల్‌కి అనుగుణంగా స్టోల్స్, షాల్స్, ర్యాప్స్లతో చలిని చుట్టెయ్యమంటున్నారు. అప్పుడిక వింటర్ ‘వేర్’ అనడం మాత్రమే కాదు స్టైల్ ఈజ్ హియర్ అని కూడా అంటారిక. షాల్స్‌ను దేవదాస్ తరహాలో వేసుకుని పాత కాలం హీరోల లుక్‌ని అబ్బాయిలు, అమ్మమ్మలను పోలిన లుక్‌ని అమ్మాయిలు క్యారీ చేయాల్సిన పనిలేదు. ముఖ్యంగా అమ్మాయిలకు నచ్చే విధంగా వివిధ రకాల షాల్స్, ర్యాప్స్ విరివిగా ఈ సీజన్లో సిటీలో లభ్యం. మాల్స్‌కి వెళ్లే పనెందుకు అనుకుంటే ఆన్లైన్లో టైప్ చేస్తే చాలు ఎన్నో వింటర్ వేర్ దుస్తులు ప్రత్యక్షం. మామూలు సీజన్లో కంటే వింటర్లో వులెన్, నెటెడ్ స్కార్ఫ్లకు ఎక్కువ గిరాకీ అని చెప్పారు ఆ యాక్సెసరీస్ విక్రయించే షోరూమ్ యజమాని వినోద్. చలికి ‘టోపీ’పెట్టు... ఈ సీజన్లో బయటికి వెళ్లి వస్తే చల్లగాలుల ధాటికి జుట్టు ఫుల్‌గా డ్రై అయిపోతుంది, సిటీలో కాంక్రీట్ నిర్మాణాల దుమ్ము ధూళితో స్కిన్, హెయిర్ మరీ పెళుసుగా మారుతాయి. అందుకని బయటకి వెళ్లినప్పుడు జుట్టు పూర్తిగా కవర్ చేసుకోవటం తప్పనిసరి. దీని కోసం టోపీలుండే జాకెట్లు వాడటం చాలా మందికి తెలిసిందే. అయితే ఇదే తరహాలో టోపీలుండే షాల్స్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. షాల్స్‌తో పాటు క్లాక్ కేప్స్కి, స్కార్ఫ్స్కి టోపీలు అటాచ్ చేసి తయారు చేస్తున్నారు. విడివిడిగా వేసుకునే పనిలేదు. ప్రయాణాల్లోను ఎంతో కంఫర్ట్‌గా ఉంటాయి ఈ దుస్తులు. ఆన్లైన్లో హుడెడ్ షాల్స్, స్కార్ఫ్స్కి ఇప్పుడు గిరాకీ విపరీతం. ఆకట్టుకునేలా చుట్టేసెయ్... క్రోషే, వులెన్తో అల్లిన ర్యాప్స్, షాల్స్ ప్రతి వింటర్లో లేటెస్ట్గా అనిపించే ఫ్యాషన్ యాక్ససరీస్. క్రోషే అల్లికలో నగరంలో పలు చోట్ల శిక్షణ కూడా ఇస్తుండటంతో అమ్మాయిలు స్వయంగా తయారు చేసుకుని మరీ వీటిని ధరిస్తున్నారు. మన్నికతో పాటు లుక్స్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కానివ్వవు నిట్టింగ్ దుస్తులు. స్టోల్స్, షగ్స్,్ర ర్యాప్స్, షాల్స్ ఇవే కాకుండా ఫర్ స్కార్ఫ్, క్రోషియా నిట్టింగ్ షాల్స్, స్లీవ్ ర్యాప్స్, వులన్ పాంచో, హుడెడ్ ర్యాప్, లేస్ ర్యాప్స్... ఇలా ఎన్నో రకాల చలిని చంపేస్తూ స్టైల్‌ని పుట్టించే యాక్సెసరీస్ వంటి మీద ఫ్యాషనబుల్‌గా ఉంటాయి. కాకపోతే కావలసిందల్లా వీటికి మీ స్టైల్, క్రియేటివిటీ కాస్త జోడించడమే.