
Winter Fashion: Saundh New Collection Traditional Thangka Print: జానపదుల కళారూపాల్లో ఆత్మ ఉంటుంది. బౌద్ధ కళలో ఆధ్యాత్మికత కూడా తోడవుతుంది. వేడుకలకు కాంతిమంతమైన రంగుల రంగేళీ జతగా చేరుతుంది. వీటి మేళవింపుతో చేసే పెయింటింగ్.. దారపు పోగులతో అల్లే అల్లికలు.. అద్దకం పనితనం.. ముత్యాల అలంకరణ.. గోటా ఆప్లిక్ వర్క్‌ల మెరుపుదనం అన్నీ ఈ డిజైన్లలో చూపితే అవి శీతాకాలపు ఫ్యాషన్‌గా ఇలా మన కళ్లముందు నిలుస్తాయి.
జానపద కళల వేడుకకు వేదికైన ఫ్యాషన్ హౌజ్ ‘సౌంద్’ విడుదల చేసిన కలెక్షన్ ఇది. సంప్రదాయ ఎంబ్రాయిడరీలు, మోటిఫ్‌లు, చేతితో చేసిన ఇతర అలంకరణలు, డిజిటల్ ప్రింట్లు ఈ డిజైన్లకు పండగల కళను తీసుకువచ్చాయి.
దుపట్టా, అనార్కలీ, లాంగ్ కుర్తా, చీర కొంగు.. బౌద్ధ కళకు కాన్వాస్‌లు అవుతున్నాయి.
వీటికి దేశమంతటా గల జానపద సంస్కృతిని ప్రతిఫలింపజేసే ఎంబ్రాయిడరీ, కచ్ వర్క్, గోటా పట్టీ, టాజిల్స్.. వంటి హంగులు అమరితే ఈ సీజన్‌ని మరింత కాంతిమంతంగా మార్చేస్తాయి.
‘తంగ్కా’ అనేది టిబెటన్ బౌధ్ద కళ. ఈ నమూనాలతో కనువిందు చేసే డిజైన్లు ఇప్పుడు అంతటా మగువలను ఆకట్టుకుంటున్నాయి.