tibetan
-
మానసిక ఆరోగ్యం కోసం 'టిబెటన్ సింగింగ్ బౌల్స్'! ఎలా ఉపయోగపడతాయంటే..
'టిబెటన్ సింగింగ్ బౌల్స్'ని ధ్వనితో అందించే ఒక విధమైన హీలింగ్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ గిన్నెలు ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యంగా బౌద్ధ ఆచారాలలో ఉపయోగిస్తారు. మంచి ఆలోచనలకి, ధ్యానానికి సహాపడతాయని నమ్ముతారు. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 'టిబెటన్ సింగింగ్ బౌల్' అనేది ధ్యానం, వైద్యం, విశ్రాంతి కోసం ఉపయోగించే ఒక సంప్రదాయ వాయిద్యం. దీన్ని లోహాల మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ గిన్నెలను మేలట్(ఒక రకమైన సాధనం)తో అంచు వెంబడి కొడితే ప్రతిధ్వనించే శబ్దాలు వస్తాయి. ఈ కంపనాలు ఓదార్పునిచ్చేలా ఒత్తిడిని దూరం చేసి, శరీరంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఈ సౌండ్ థెరపీ అనేది ఒక రకమైన హీలింగ్ థెరపీలా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇది మానసిక ఉల్లాసానికి, ధ్యానానికి సహాయపడుతుందనేది బౌద్ధుల నమ్మకం.ఈ టిబెటన్ సింగింగ్ బౌల్స్ మానసిక ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే..ఒత్తిడిని, ఆందోళనని దూరం చేస్తుంది..ఈ బౌల్స్ నుంచి వచ్చే కంపనాలు మనస్సుని, శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ శబ్దాలు వినడం వల్ల ఒత్తడి హర్మోన్ స్థాయిలు తగ్గి తద్వారా ఆందోళనను దూరం చేస్తుంది. డీప్ రిలాక్సేషన్..ఈ గిన్నెల ద్వారా వచ్చే ప్రతి ధ్వని ధ్యాన స్థితిలోకి రావడానికి సహాయపడుతుంది. తద్వారా సుదీర్ఘ విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సున్నితమైన శబ్దాలు మెదడు తరంగాలను నెమ్మదింప చేయడానికి సహాయపడతాయి. దృష్టి స్పష్టత మెరుగవుతుందిఈ శబ్దాలు దృష్టి కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది. అంతేగాదు మానసిక స్పష్టత వచ్చేలా ఏకగ్రతతో ఉండేలా చేస్తుంది.భావోద్వేగాలను అదుపులో ఉంచుతుందిఈ శబ్దాలను క్రమతప్పకుండా వినడం వల్ల భావోద్వేగ సమతుల్యత మెరుగుపడుతుంది. ఈ శబ్దాలు అంతర్గత శాంతి, భావోద్దేవగ స్థిరత్వాన్ని అందిస్తాయి. తద్వారా కోపం లేదా విచారం వంటి ప్రతికూల భావోద్వేగాలను తగ్గుతాయి,నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందిఈ కంపనాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి మంచి నిద్రపట్టేలా చేస్తుంది. నిద్రలేమితో పోరాడుతున్న వ్యక్తులకు ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఎనర్జీని బ్యాలెన్స్‌గా.. ఈ కంపనాలు శరీరంలో చక్రాలుగా పిలిచే శక్తి కేంద్రాలను సమతుల్యం చేస్తుంది. ఇలా సమస్థాయిలో ప్రసారమయ్యే శక్తి స్థాయిలు మంచి మానసిక శ్రేయస్సుని అందిస్తాయి.డిప్రెషన్ లక్షణాలు..ఈ సౌండ్ థెరపీ డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మనస్సుని ఉల్లాసంగా ఉండేలా చేసి నిరాశ నిస్ప్రుహలను దూరం చేస్తుంది. మైండ్-బాడీ కనెక్షన్..ఈ కంపనాలు మనస్సు, శరీర సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. రోజువారీ పనుల్లో ఎదురయ్యే భావోద్వేగ స్థితులకు తొందరగా ప్రతిస్పందించక బ్యాలెన్స్‌గా ఉంచడమే గాక మానసిక కల్లోలానికి తావివ్వదు. ఫలితంగా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.(చదవండి: మిల్కీ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!.. మెరిసే చర్మం కోసం..) -
పులినే చంపగల శునకం.. ఖరీదులో కనకం..
సాక్షి, అనంతపురం: టిబెటియన్ మస్టిఫ్.. టిబెట్ దేశానికి చెందిన ప్రత్యేక శునకం. ఇది చలి ప్రాంతాల్లోనే జీవించే అరుదైన జాతి కుక్క. తెలివైన, బలమైన, రక్షణ కల్పించే జాగిలంగా ప్రసిద్ధి. సాధారణంగా 15 ఏళ్లు జీవిస్తుంది. గరిష్టంగా 65 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే ఈ జాతి శునకానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. దీని కోసం శునక ప్రియులు రూ.లక్షలు వెచ్చిస్తుంటారు. మస్టిఫ్ జాతి శునకం అనంతపురం సాయి నగర్ ఒకటో క్రాస్‌లో ఉండడం విశేషం. బుక్కచెర్ల నల్లపరెడ్డి నివాసంలో ఉండే ఈ జాగిలం పలువురిని ఆకర్షిస్తోంది. అతిశీతల ప్రాంతం నుంచి వచ్చిన కుక్క అయినప్పటికీ, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడింది. రోజుకో కేజీ చికెన్ లాగించేస్తూ హాయిగా జీవిస్తోంది. పూర్తిగా ఏసీ గదుల్లోనే సేద తీరుతోంది. ఏకంగా పులినే చంపగల శక్తిశాలి అయిన మస్టిఫ్.. ఎవరి మీదా దాడి చేయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనికి పాస్‌పోర్టు కూడా ఉండడం విశేషం. వీసాపై దీన్ని ఇక్కడికి తెప్పించారు. చిన్న పిల్లగా ఉన్నప్పుడు తెచ్చుకుని పెంచుకుంటున్నారు. (చదవండి: అనంతలో ఎల్లో కుట్రలు.. ఆ ఇద్దరే 22 కేసులు వేశారు) -
Thangka Print: మగువల మనసు దోచుకుంటున్న ‘తంగ్కా’ డిజైన్
Winter Fashion: Saundh New Collection Traditional Thangka Print: జానపదుల కళారూపాల్లో ఆత్మ ఉంటుంది. బౌద్ధ కళలో ఆధ్యాత్మికత కూడా తోడవుతుంది. వేడుకలకు కాంతిమంతమైన రంగుల రంగేళీ జతగా చేరుతుంది. వీటి మేళవింపుతో చేసే పెయింటింగ్.. దారపు పోగులతో అల్లే అల్లికలు.. అద్దకం పనితనం.. ముత్యాల అలంకరణ.. గోటా ఆప్లిక్ వర్క్‌ల మెరుపుదనం అన్నీ ఈ డిజైన్లలో చూపితే అవి శీతాకాలపు ఫ్యాషన్‌గా ఇలా మన కళ్లముందు నిలుస్తాయి. జానపద కళల వేడుకకు వేదికైన ఫ్యాషన్ హౌజ్ ‘సౌంద్’ విడుదల చేసిన కలెక్షన్ ఇది. సంప్రదాయ ఎంబ్రాయిడరీలు, మోటిఫ్‌లు, చేతితో చేసిన ఇతర అలంకరణలు, డిజిటల్ ప్రింట్లు ఈ డిజైన్లకు పండగల కళను తీసుకువచ్చాయి. దుపట్టా, అనార్కలీ, లాంగ్ కుర్తా, చీర కొంగు.. బౌద్ధ కళకు కాన్వాస్‌లు అవుతున్నాయి. వీటికి దేశమంతటా గల జానపద సంస్కృతిని ప్రతిఫలింపజేసే ఎంబ్రాయిడరీ, కచ్ వర్క్, గోటా పట్టీ, టాజిల్స్.. వంటి హంగులు అమరితే ఈ సీజన్‌ని మరింత కాంతిమంతంగా మార్చేస్తాయి. ‘తంగ్కా’ అనేది టిబెటన్ బౌధ్ద కళ. ఈ నమూనాలతో కనువిందు చేసే డిజైన్లు ఇప్పుడు అంతటా మగువలను ఆకట్టుకుంటున్నాయి. -
కర్మపా.. భారత్ తిరిగి రండి!
న్యూఢిల్లీ: అమెరికాలో నివాసముంటున్న టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు కర్మపా ఓజియెన్ ట్రిన్లే డోర్జీ భారత్‌కు తిరిగిరావాలని కేంద్రం కోరింది. ఢిల్లీలో ఆశ్రమం నిర్మించుకోవడానికి స్థలం కేటాయించడానికి కూడా అంగీకరించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కర్మపా భారత్‌లోనే ఉండాలని ఆయన అనుచరులు కోరుకుంటున్నారని, ప్రభుత్వం కూడా తిరిగిరావాలని ఆయన్ని కోరిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారి ఒకరు తెలిపారు. అయితే కర్మపా భారత్ తిరిగిరావడానికి అయిష్టం వ్యక్తం చేసినట్లు చెప్పారు. దేశం లోపల, వెలుపల ఎలాంటి ఆంక్షలు లేకుండా సంచరించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కర్మపా డిమాండ్ చేస్తున్నారు. దలైలామా మాదిరిగా తనకూ స్వేచ్ఛగా సంచరించే అవకాశం కల్పించనందుకు అసంతృప్తితో కర్మపా డొమినికా పాస్పోర్టుతో అమెరికాలో నివాసముంటున్నారు. -
బ్రహ్మపుత్రపై.. చైనా దొంగబుద్ధి
బీజింగ్ : ఈశాన్యరాష్ట్రాలకు వరప్రదాయిని అయిన బ్రహ్మపుత్ర నదిని పూర్తిగా కబ్జా చేసేందుకు చైనా ప్రయత్నాలు మమ్మురం చేసింది. హిమాలయ నదుల్లో ప్రత్యేకమయిన బ్రహ్మపుత్ర నదిపై వివిధ ప్రాంతాల్లో భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను చైనా నిర్మిస్తోందని గ్లోబెల్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. చైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తే.. ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లు పూర్తిగా ఎండిపోతాయని ఆ పత్రిక పేర్కొంది. ఇదిలా ఉండగా.. బ్రహ్మపుత్ర నది (దీనిని చైనాలో యార్లుంగ్ త్సాంగ్పోగా పిలుస్తారు)కి భారీ సొరంగం తవ్వి నీటని జిన్‌జాయాంగ్ ప్రాంతానికి తరలిస్తారనే పుకార్లు గత నెల్లో వచ్చాయి. అయితే వీటిని చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవపట్టించేందుకు చైనా ఇటువంటి వ్యాఖ్యలు చేసిందని.. వాస్తవంగా టన్నెల్ నిర్మాణ పనుల గురించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆ పత్రిక స్పష్టం చేసింది. కేవలం బ్రహ్మపుత్ర లక్ష్యంగా..! టిబెట్‌లో బ్రహ్మపుత్రతో పాటూ.. జిన్షా, లాన్‌శాంగ్, నుజియాంగ్ నదులు ప్రవహిస్తున్నాయి. హైడ్రోపవర్‌కు బ్రహ్మపుత్రకన్నా ఇవి అత్యుత్తమమని నిపుణులు ఇప్పటికే తేల్చారు. అయితే ఆ నదులు భారత్‌లో ప్రవహించనందున చైనా వాటిపై దృష్టి పెట్టలేదు. కేవలం దొంగబుద్ధితో బ్రహ్మపుత్ర నదిపై విరివిగా జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జాంగ్ము..! ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించిన జాంగ్ము ప్రాజెక్టు 2014 నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టులో 86.6 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిలువచేయవచ్చు. ఇలాంటివి మరిన్ని టిబెట్ సరిహద్దుల్లో నిర్మించాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. -
ఆ పేరులోని పదాలన్నీ బుద్ధుడిని కీర్తించేవే
సాక్షి: 'ప్రపంచ మానవులందరం ప్రస్తుతం గొప్ప విపత్కర పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్నాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల మధ్య పరస్పర అవగాహన, భద్రత, సామరస్యం తప్పనిసరి. అవి లేకుండా శాంతియుత సహజీవనం సాగబోదు' అన్నారు దలైలామా. టిబెటన్ ఆధ్యాత్మిక గురువైన ఆయన ఈ ప్రసంగం చేసింది క్రైస్తవుల పుణ్యస్థలమైన వాటికన్లో. దలైలామా ప్రసంగాల్లో ఎల్లప్పుడూ శాంతి ప్రస్తావన ఉంటుంది. అందుకే ఆయనను శాంతి కపోతంగా గుర్తించింది ప్రపంచం..! అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతల్లో 14వ దలైలామా ఒకరు. ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతి, అహింసా మార్గాల్లో టిబెట్‌కు స్వాతంత్య్రం సంపాదించేందుకు చేస్తున్న కృషికి ఫలితంగా ఈ బహుమతిని ప్రదానం చేశారు. ఆయన ప్రస్తుతం హిమాచల్‌లోని ధర్మశాల నుంచి తన శాంతి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. బాల్యం.. దలైలామాను యేషేనారెబల్, లామో ధోండ్రబ్గా పిలిచేవారు. ఆయన టిబెట్ దేశ ఈశాన్య ప్రాంతంలోని ‘తక్త్ సేర్’ కుగ్రామంలో 1935 జూలై 6న జన్మించారు. రెండున్నరేళ్లకే బుద్ధుని అవతారంగా గుర్తింపుపొందారు. ‘లామో ధోండ్రబ్’ను బుద్ధుని అంశగా గుర్తించడంతో పాటు, తన వారసుడిగా కూడా ప్రకటించారు 13వ దలైలామా. జ్ఞాన సముద్రం.. టిబెటన్ భాషలో దలైలామా అంటే జ్ఞాన సముద్రం అని అర్థం. దలైలామా పూర్తి పేరు జెట్సన్ జంఫెల్ గవాంగ్ లోబ్సంగ్ యేషే టింజెన్ గ్యాట్నో. చాంతాడంత పొడవున్న ఈ పేరులోని పదాలన్నీ బుద్ధుని అవతారాన్ని కీర్తించేవే. పవ్రిత దైవం, దివ్య ప్రభ, సానుభూతి, విశ్వాస నిరూపక జ్ఞానసముద్రుడు అని అర్థం. విద్యాభ్యాసం.. దలైలామా ఆరేళ్ల వయసులో విద్యాభ్యాసం ప్రారంభించారు. 25 ఏళ్లు వచ్చేవరకు బౌద్ధ మత సంప్రదాయ విద్యను అభ్యసించారు. బౌద్ధ మత తత్వశాస్త్రంలో పీహెచ్డీ పట్టా (గేషే లారంపా) పొందారు. బౌద్ధ విశ్వవిద్యాలయాలైన డ్రెఫండ్, సెరా, గండెన్ బౌద్ధ విద్యాలయాల్లో 30 మంది పండితుల పరీక్షలను నెగ్గి, 15 మంది పండితులతో బౌద్ధమత న్యాయసూత్రాలపై వాదించి, భౌతిక ఆధ్యాత్మిక విభాగాలలో నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. దలైలామాగా.. యేషేనారెబల్.. పదహారేళ్ల ప్రాయంలోనే టిబెట్ పరిపాలనా వ్యవస్థకు అధిపతిగా నియమితులయ్యారు. అయితే, 1954లో టిబెట్ చైనీయుల ఆక్రమణకు గురైంది. చైనీయుల వలసలు పెరిగిపోయి దేశం వారి హస్తగతమైంది.ఈ దశలో దలైలామా టిబెట్ పరిరక్షణ కోసం మావోసేటుంగ్ చౌ ఎన్లై వంటి నాయకులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మన దేశం ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. టిబెట్ స్వాతంత్య్రం కోసం ధర్మశాల నుంచే ప్రయత్నాలు కొనసాగించారు దలైలామా. చైనా దుర్నీతిపై.. టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడంపై ఐక్యరాజ్య సమితిలో దలైలామా ఫిర్యాదు చేశారు. ఐక్యరాజ్య సమితి కూడా మూడుసార్లు టిబెట్‌కు అనుకూలంగా ప్రతిపాదనలు చేసింది. అయినా చైనా తన దురాక్రమణ పర్వాన్ని ఆపలేదు. దలైలామా తయారు చేసిన టిబెట్ రాజ్యాంగాన్ని చైనా గౌరవించలేదు. 1980వ దశకంలో ఆయన ఎన్నో దేశాలు పర్యటించి, మద్దతు కూడగట్టారు. తుది ప్రయత్నంలో భాగంగా టిబెట్‌లో శాంతి స్థాపనకు 1987లో ఐదు అంశాల ప్రతిపాదన చేశారు. ఇతర మతాలపై గౌరవం.. దలైలామా ఓ నిరాడంబర బౌద్ధ సన్యాసి. కచ్చితమైన నియమానుసారంగా బౌద్ధ మతాన్ని అవలంబించడంతో పాటు ప్రపంచంలోని ఇతర మతాలన్నింటినీ గౌరవిస్తారు. ఆయన 1973లో క్రైస్తవుల రోమన్ క్యాథలిక్ కేంద్రమైన వాటికన్ సిటీలో ఆరవ పోప్‌ను కలుసుకున్నారు. పోప్ రెండవ జాన్పాల్ని 1980, 82, 86, 88 సంవత్సరాలలో కలుసుకుని ప్రపంచ శాంతి గురించి చర్చించారు. గాంధీజీ స్ఫూర్తి.. దలైలామా ఓ సందర్భంలో.. శాంతియుత పోరాటానికి స్ఫూర్తి, ఆదర్శం భారత జాతిపిత గాంధీజీ అన్నారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సమయంలో దలైలామా, ‘‘ఈ పురస్కారానికి ఒక పీడిత ప్రతినిధిగా నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచంలోని పీడిత మానవులకు, స్వతంత్రంకోసం పోరాడేవారికి, అణగారిన వర్గాల వారికి, ప్రపంచ శాంతికి పాటుపడేవారికి ఈ బహుమతి అంకితం’’ అని వ్యాఖ్యానించారు. పురస్కారాలు.. 1959.. రామన్ మెగసెసె అవార్డు 1989.. నోబెల్ శాంతి బహుమతి 2012.. టెంప్లెటన్ ప్రైజ్ (ఈ అవార్డు కింద లభించిన మొత్తాన్ని మనదేశంలోని ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థకు విరాళంగా ఇచ్చారు) 2007.. అమెరికా నుంచి 'కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్' 2006.. కెనడా నుంచి గౌరవ పౌరసత్వం 2005.. యూకేలోని బుద్ధిస్ట్ సొసైటీ నుంచి క్రిస్ట్మస్ హంఫ్రీస్ అవార్డు.