బీజింగ్ : ఈశాన్యరాష్ట్రాలకు వరప్రదాయిని అయిన బ్రహ్మపుత్ర నదిని పూర్తిగా కబ్జా చేసేందుకు చైనా ప్రయత్నాలు మమ్మురం చేసింది. హిమాలయ నదుల్లో ప్రత్యేకమయిన బ్రహ్మపుత్ర నదిపై వివిధ ప్రాంతాల్లో భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను చైనా నిర్మిస్తోందని గ్లోబెల్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. చైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తే.. ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లు పూర్తిగా ఎండిపోతాయని ఆ పత్రిక పేర్కొంది. ఇదిలా ఉండగా.. బ్రహ్మపుత్ర నది (దీనిని చైనాలో యార్లుంగ్ త్సాంగ్‌పోగా పిలుస్తారు)కి భారీ సొరంగం తవ్వి నీటని జిన్‌జాయాంగ్ ప్రాంతానికి తరలిస్తారనే పుకార్లు గత నెల్లో వచ్చాయి. అయితే వీటిని చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవపట్టించేందుకు చైనా ఇటువంటి వ్యాఖ్యలు చేసిందని.. వాస్తవంగా టన్నెల్ నిర్మాణ పనుల గురించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆ పత్రిక స్పష్టం చేసింది.
కేవలం బ్రహ్మపుత్ర లక్ష్యంగా..!
టిబెట్‌లో బ్రహ్మపుత్రతో పాటూ.. జిన్షా, లాన్‌శాంగ్, నుజియాంగ్ నదులు ప్రవహిస్తున్నాయి. హైడ్రోపవర్‌కు బ్రహ్మపుత్రకన్నా ఇవి అత్యుత్తమమని నిపుణులు ఇప్పటికే తేల్చారు. అయితే ఆ నదులు భారత్‌లో ప్రవహించనందున చైనా వాటిపై దృష్టి పెట్టలేదు. కేవలం దొంగబుద్ధితో బ్రహ్మపుత్ర నదిపై విరివిగా జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
జాంగ్ము..!
ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించిన జాంగ్ము ప్రాజెక్టు 2014 నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టులో 86.6 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిలువచేయవచ్చు. ఇలాంటివి మరిన్ని టిబెట్ సరిహద్దుల్లో నిర్మించాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment