dams
-
తుంగభద్ర జలాలకు కర్ణాటక ఎసరు!
కర్నూలు సిటీ: ఇప్పటికే తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాల్లోని అనధికార ఆనకట్టలు, చెక్ డ్యాంలతో ఆయా ప్రాంతాల్లో నీటిని అక్రమంగా వాడుకుంటున్న కర్ణాటక చర్యలతో ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా తుంగభద్ర నదిపై మరో రెండు బ్యారేజీలను నిర్మిస్తామంటూ చావు కబురు చల్లగా చెప్పడంతో ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో గుబులు మొదలయ్యింది. ఇప్పటికే టీబీ డ్యామ్ ఎగువన అనధికారికంగా నిర్మించిన సుమారు 50 ఎత్తిపోతల పథకాలతో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.వీటితో పాటు డ్యామ్ దిగువ భాగంలో నిర్మించిన వివిధ నిర్మాణాల వల్ల.. హక్కుగా రావాల్సిన వాటా నీటికి ఏటా గండి పడుతోంది. ఇలాంటి సమయంలో మరోసారి తుంగభద్ర జలాలను తాగునీటి సమస్య పేరుతో కాజేసేందుకు కర్ణాటక ఎత్తు వేసింది. ఇందులో భాగంగానే తుంగభద్ర నదిపై రెండు చోట్ల బ్రిడ్జి కమ్ బ్యారేజీ పేరుతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వీటిపై ఏపీ ఇంజనీర్లకు అవగాహన కల్పించేందుకు బుధవారం కర్నూలులోని ప్రభుత్వ అతిథిగృహంలో కర్ణాటక చిన్ననీటిపారుదల శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎన్.బోస్‌రాజు, రాయచూరు ఎంపీ బాలానాయక్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జలవనరుల శాఖ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు.కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి, సింథనూరు, శిరుగుప్ప తాలూకాలోని 40 రెవెన్యూ గ్రామాల్లో ప్రతి ఏటా వేసవిలో తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ సమస్య పరిష్కారం చేయడంతో పాటు నదికి కుడివైపు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని 19 గ్రామాలకు సైతం నీటి సమస్య లేకుండా పరిష్కారం చూపేందుకు రాయచూరు జిల్లా చికలపర్వి గ్రామం దగ్గర తుంగభద్ర నదిపై నిర్మిస్తున్న నేషనల్ హైవే బ్రిడ్జితో పాటు బ్యారేజీ నిర్మించనున్నామని కర్ణాటక మంత్రి తెలిపారు. ఇప్పటికే మంత్రాలయం దగ్గర సైతం బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించేందుకు రూ.138 కోట్లతో తమ రాష్ట్రం చేసిన ప్రతిపాదన సైతం పరిశీలనలో ఉన్నాయని, ఈ రెండు బ్రిడ్జి కం బ్యారేజీలు 0.318 సామర్థ్యంతో నిర్మించనున్నామని వివరించారు. వీటి నిర్మాణం వల్ల ఏపీ ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని, త్వరలోనే దీనిపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల స్థాయిలో ఓ సమావేశాన్ని నిర్వహించనున్నామని మంత్రి తెలియజేశారు. ఏపీ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగకుండా బ్యారేజీ నిర్మిస్తే బాగుంటుందేమోనని కొందరు ఇంజనీర్లు సమావేశంలో ప్రస్తావించారు. అయితే ముందుగా బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణమని, ఆ తర్వాత ఆ బ్యారేజీల నుంచి నీటిని తోడేందుకు లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తే తమ రాష్ట్ర ఆయకట్టు రైతుల పరిస్థితి ఏంటని కొందరు ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కర్నూలు మండల పరిధిలోని సుంకేసుల దగ్గర 1.2 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన బ్యారేజీ ఎడమ వైపు తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం వల్ల ఆయకట్టుకు సక్రమంగా నీరందని పరిస్థితి ఉందన్నారు. జలవనరుల శాఖ కర్నూలు ప్రాజెక్టు సీఈ కబీర్ బాషా, కర్నూలు సర్కిల్ ఎస్ఈ రెడ్డి శేఖర్‌రెడ్డి, ఎల్ఎల్సీ ఈఈ శైలేష్ కుమార్, కేసీ కెనాల్ డీఈ రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లిబియా మరణాలు..11 వేలకు పైనే
డెర్నా: లిబియాలోని డెర్నాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య శుక్రవారానికి 11 వేలు దాటింది. జాడ తెలియకుండా పోయిన మరో 10 వేల మంది కోసం అన్వేషణ ముమ్మరంగా సాగుతోంది. నివాస ప్రాంతాలను తుడిచిపెట్టిన మట్టి, బురద తొలగింపు పనులు సాగుతున్నాయి. సోమవారం సంభవించిన భారీ వర్షాలు, వరదలతో ఎగువనున్న రెండు జలాశయాలు బద్దలై ఒక్కసారిగా డెర్నా నగరాన్ని నీటి ప్రవాహం ముంచెత్తిన విషయం తెలిసిందే. -
డెర్నా సిటీ మేయర్ అనుమానం
డెర్నా: వరదలు, రెండు డ్యామ్‌ల నేలమట్టంతో జనావాసాలపైకి జల ఖడ్గం దూసుకొచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన లిబియాలో పరిస్థితి కుదుటపడలేదు. డేనియల్ తుపాను మిగిలి్చన విషాదం నుంచి డెర్నా నగరం తేరుకోలేదు. అక్కడ ఇంకా వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. 5,500 మందికిపైగా చనిపోయారని అధికారులు ప్రకటించగా మృతుల సంఖ్య 20,000కు చేరుకోవచ్చని సిటీ మేయర్ అబ్దెల్ మోనియమ్ అల్ ఘైతీ అనుమానం వ్యక్తంచేశారు. -
Libya Floods: లిబియాలో ఊహకందని మహా విషాదం
డెర్నా: అస్థిర ప్రభుత్వాలు, సంక్షోభం, ఎవరికీ పట్టని ప్రజా సంక్షేమంతో సమస్యల వలయంలో చిక్కిన లిబియాపై ప్రకృతి కత్తి గట్టింది. ఊహించని వరదలు, వరద నీటి ధాటికి పేకమేడల్లా కుప్పకూలిన రెండు డ్యామ్‌లు.. వరద విలయాన్ని మరింత పెంచాయి. డ్యామ్‌ల నుంచి దూసుకొచ్చిన నీటిలో కొట్టుకుపోయి జలసమాధి అయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటి గణాంకాల ప్రకారం డెర్నా సిటీలో వరద మృతుల సంఖ్య ఏకంగా 5,100 దాటింది. ఇంకా వేలాది మంది జాడ గల్లంతయిందన్న కథనాలు చూస్తుంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వరద ఉధృతికి ఇళ్లుసహా సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారు వేలాదిగా ఉన్నారు. డెర్నా సిటీ తీరప్రాంతంలోని పర్వతాలు, లోయలతో నిండిన నగరం. వరదల కారణంగా చాలా రోడ్లు దెబ్బతిని సహాయక బృందాలు వరద ముంపు ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి. దీంతో చాలా చోట్ల సహాయక చర్యలు మొదలేకాలేదు. అతికష్టం మీద కొన్ని బృందాలు చేరుకుని జలమయమైన ఇళ్లలో బాధితుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. నేలమట్టమైన భవనాలు, శిథిలాల కింద వెతికే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 30 వేలు దాటిన వలసలు వరద ధాటికి సర్వం కోల్పోవడంతో దాదాపు 30 వేల మంది స్థానికులు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్లారని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ సంఖ్య 40,000కుపైనే ఉంటుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ సొసైటీ లిబియా ప్రతినిధి తమెర్ రమదాన్ అంచనావేశారు. రెండు ప్రభుత్వాల మధ్య నలిగి.. తూర్పు ప్రాంతంలో ఒక ప్రభుత్వం, మరో దిశలో ఇంకో ప్రభుత్వాల నిర్లక్ష్య ఏలుబడిలో ఉన్న లిబియాలో మౌలిక వసతుల కల్పన అరణ్యరోదనే అయ్యింది. ‘నగరంలో ఉన్న ఏకైక శ్మశానానికి తరలించేందుకు మృతదేహాలను ఒక దగ్గరకు చేరుస్తాం. ఈ జల విలయంలో 11 మంది కుటుంబసభ్యులను కోల్పోయి గుండెలవిసేలా రోది స్తున్న ఒకాయనను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు’ అని సహాయక బృంద సభ్యుడొకరు చెప్పారు. ‘ నా కుటుంబం మొత్తాన్నీ కోల్పోయా. వరదల్లో మా వాళ్ల మృతదేహాలు సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి’ అని అబ్దల్లా అనే వ్యక్తి వాపోయారు. రోడ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు బుల్డోజర్లుతో రెండు రోజులుగా నిరంతరంగా పనిచేయిస్తున్నారు. అప్పుడుగానీ అత్యవసర సరుకుల్ని తరలించలేని దుస్థితి. వేరే పట్టణాలకు మృతదేహాల తరలింపు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించే పరిస్థితు లు డెర్నీ సిటీలో కరువవడంతో వందలాది మృతదేహా లను సమీపంలోని పట్టణాలకు తరలిస్తున్నారు. మరణించిన వారిలో 84 మంది ఈజిప్టువాసులూ ఉన్నారు. దక్షిణాన ఉన్న బెనీ సుయెఫ్ రాష్ట్రంలో ఎల్–షరీఫ్ గ్రామంలో డజన్లకొద్దీ ఈజిప్షియన్లు జలసమాధి అయ్యారు. డెర్నాలో భీతావహ దృశ్యం నగరంలో చాలా చోట్ల మృతదేహాలు కనపడుతు న్నాయి. బురదనీటిలో కూరుకుపోయి, వీధుల్లోకి కొట్టుకొచ్చి, సముద్ర తీరం వెంట.. ఇలా చాలా ప్రాంతాల్లో స్థానికులు విగతజీవులై కనిపించారు. ఒక్కసారిగా నీరు రావడంతో ఎటూ తప్పించుకోలేని నిస్సహాయక స్థితి. ‘నగరంలో ఏ ప్రాంతంలో సహాయం చేసేందుకు వెళ్లినా అక్కడ మాకు చిన్నారులు, మహిళల మృతదేహాలే కనిపిస్తున్నాయి’ అని బెంఘాజీకి చెందిన ఒక సహాయకుడు ఫోన్లో మీడియా సంస్థకు చెప్పారు. ‘సిటీ శివార్లలోని డ్యామ్ బద్దలైన శబ్దాలు మాకు వినిపించాయి. నగరం గుండా ప్రవహించే వాదీ డెర్నీ నదిలో ప్రవాహ ఉధృతి అమాంతం ఊహించనంతగా ఎగసి జనావాసాలను ముంచేసింది. ‘ డ్యామ్ బద్దలవడంతో ఏకంగా ఏడు మీటర్ల ఎత్తులో దూసుకొచ్చిన ప్రవాహం తన మార్గంలో అడ్డొచ్చిన అన్నింటినీ కూల్చేసింది’ అని లిబియాలో రెడ్ క్రాస్ కమిటీ ప్రతినిధి బృంద సారథి యాన్ ప్రైడెజ్ చెప్పారు. మధ్యధరా ప్రాంతంలో సన్నని తీరప్రాంతంలో పర్వత పాదాల చెంత ఈ నగరం ఉంది. పర్వతాల నుంచి వచ్చిన వరద నీరు నగరాన్ని ముంచేస్తూ తీరం వైపు కిందకు ఉరకలెత్తడంతో వరద తీవ్రత భయంకరంగా ఉంది. వరద ధాటికి దక్షిణం వైపు కేవలం రెండు రోడ్లు మాత్రమే మిగిలిపోయాయి. కూలిన వంతెనలు నగరం మధ్య భాగాన్ని రెండుగా చీల్చాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాయపడిన ఏడు వేలకుపైగా స్థానికులను మైదానాల్లోని తాత్కాలిక వైద్యశాలల్లో చికిత్సనందిస్తున్నారని తూర్పు లిబియాలోని అంబులెన్స్, అత్యవసర కేంద్రం అధికార ప్రతినిధి ఒసామా అలీ చెప్పారు. -
భారతదేశంలోని టాప్ 10 అతిపెద్ద ఆనకట్టలు
-
Telangana: ఇక నీటితోపాటు కరెంటు ప్రవాహం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రుణ పరిమితిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన కొత్త రుణాల సమీకరణ అసాధ్యంగా మారిన నేపథ్యంలో.. సొంత ఆదాయ వనరుల సమీకరణపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. నిరుపయోగంగా ఉన్న వాలంతరి, ఇంజనీరింగ్ ల్యాబ్ వంటి సంస్థలకి చెందిన 100 ఎకరాల భూముల్లో లేఅవుట్లు వేసి ప్లాట్లకు వేలం నిర్వహించడం ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో రాష్ట్రంలోని జలాశయాలు, సాగునీటి కాల్వలపై భారీ ఎత్తున సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 16 జలాశయాలపై 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లు, కాల్వలపై మరో 2000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు, నదులపై మరో 5 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రాలు కలిపి 13,800 మెగావాట్ల సంప్రదాయేతర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి అవకాశముందని ..తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఇటీవల నివేదిక సమర్పించింది. ఈ కేంద్రాలను సొంతంగా ఏర్పాటు చేస్తే ఏటా రూ.13 వేల కోట్ల ఆదాయం రానుందని, పీపీపీ పద్ధతిలో ఏటా రూ.431 కోట్లను రాయల్టీగా పొందవచ్చని అంచనా వేసింది. జలాశయాలతో రూ.100 కోట్ల ఆదాయం రాష్ట్రంలోని 16 జలాశయాలు 1,675 చ.కి.మీల ప్రాంతంలో విస్తరించి ఉండగా.. చ.కి.మీటర్‌కు 40 మెగావాట్ల సామర్థ్యం చొప్పున 10 శాతం విస్తీర్ణంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఒక మెగావాట్‌కి రూ.5.5 కోట్లు చొప్పున 6,700 మెగావాట్లకు రూ.36,850 కోట్ల వ్యయం కానుంది. ఏటా 10వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుండగా, రూ.3 వేల కోట్ల ఆదాయం రానుంది. జలాశయాలను అద్దెకు ఇచ్చినందుకు ప్రతి యూనిట్‌పై 10 పైసలను రాయల్టీగా పొందినా ఏటా రూ.100 కోట్లను నీటిపారుదల శాఖ పొందవచ్చు. కాల్వలతో రూ.31 కోట్లు రాష్ట్రంలో 40 వేల కి.మీ సాగునీటి కాల్వలుండగా, మరో 40 వేల కి.మీ కాల్వలు నిర్మాణంలో ఉన్నాయి. 8 వేల ఎకరాల్లోని కాల్వపై పీపీపీ పద్ధతిలో 2వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు రూ.9వేల కోట్ల వ్యయం కానుండగా, ఏటా 3,100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. యూనిట్ విద్యుత్‌ను రూ.2.5 చొప్పున విక్రయించినా కనీసం ఏడాదికి రూ.775 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రైవేటు డెవలపర్ల నుంచి యూనిట్‌కి 10 పైసలను రాయల్టీగా పొందినా ఏటా రూ.31 కోట్లను నీటిపారుదల శాఖ అర్జించవచ్చు. పంప్డ్ స్టోరేజీతో రూ.300 కోట్ల రాయల్టీ ములుగు అడవుల్లో 3,960 మెగావాట్లు, నిర్మల్ అడవుల్లో 1,200 మెగావాట్లు, ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి వీలుంది. అక్కడి జలాశయాలను ఆధారం చేసుకుని 5 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. మెగావాట్‌కి రూ.6.5 కోట్ల నుంచి రూ. 7.5 కోట్ల చొప్పున రూ.35 వేల కోట్ల వ్యయం కానుంది. ఏటా 30,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుండగా, యూనిట్‌కి రూ.3 ధరతో ఏటా రూ.9,200 కోట్ల ఆదాయం రానుంది. యూనిట్‌కు 10 పైసలను ప్రైవేటు డెవలర్ల నుంచి రాయల్టీగా పొందినా ఏటా రూ.300 కోట్లు రానున్నాయి. చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్ -
ఓ వైపు వర్షం, నిర్లక్ష్యం వహిస్తే.. కొంపలు మునుగుతాయ్ సారు
సాక్షి, హయత్‌నగర్( హైదరాబాద్): నాలుగు రోజులగా కురుస్తున్న వర్షాలకు హయత్‌నగర్‌లోని పలు కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే. శనివారం మరో మరోసారి భారీ వర్షం కురవడంతో ఫైర్‌స్టేషన్, బస్ డిపోల్లోకి నీరు చేరింది. అదే విధంగా కుమ్మరికుంట నిండి పొంగిపొర్లి దిగువనున్న బాతుల చెరువులోకి భారీగా నీరు చేరుతోంది. బాతుల చెరువు సైతం శనివారం అర్ధరాత్రి నుంచి అలుగు పారుతోంది. ఏ క్షణమైన కాలనీలను ముంచెత్తే ప్రమాదం ► నీటి ప్రవాహం పెరిగితే ఏ క్షణమైనా అలుగు నీరు కింది కాలనీలను మంచెత్తే ప్రమాదం ఉంది. అదే జరిగితే బాతుల చేరువు కట్ట కింద ఉన్న కాలనీలు మరోసారి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఎగువనున్న కాప్రాయ్ చెరువు ఏ క్షణమైనా అలుగు పారవచ్చు. అదే జరిగితే ఇప్పటికే నిండి పొంగిపొర్లుతున్న కుమ్మరికుంటలోకి ఆ నీరు వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి వరద నీరు నేరుగా బాతుల చెరువులోకి చేరుతుంది. ఈ మూడు చెరువుల నీటితో పాటు నిండు కుండలా ఉన్న మాసబ్ టాంక్ చెరువు కూడా అలుగు పారేందుకు సిద్ధంగా ఉంది. ఆ చెరువు అలుగు పారితే రెండు వైపుల నీరు మంజారా కాలనీ, అంబేడ్కర్‌నగర్‌లలోకి వస్తుంది. ఇదే జరిగితే ఆయా కాలనీల ప్రజలు పెను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ► బాతుల చెరువు అలుగు ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండటంతో దిగువనున్న వసుందర కాలనీ, కట్టమైసమ్మకాలనీ, తిరుమలకాలనీ, ఆ ర్టీసీ మజ్దూర్‌కాలనీతో పాటు అంబేడ్కర్‌నగర్, రంగనాయకుల గుట్ట, బీజేఆర్ కాలనీ, బంజారా కాలనీలలోకి నీరు చేరుతోంది. గత అక్టోబర్‌లో వర్షాలకు ప్రజలు నిరాశ్రయులైన సంఘటన మరువక ముందే మరోసారి ముంపు ప్రమా దం పొంచి ఉండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. ► చెరువులు నిండినప్పుడు అలుగు నీరు వెళ్లేందుకు గతంలో ఉన్న కాలువలు ఆక్రమణలకు గురి కావడంతో అలుగు నుంచి వచ్చే నీటికి దారి లేక కాలనీలను మంచెత్తుతోంది. గత అక్టోబర్‌లో వచ్చిన వరద సమయంలో కాలవల ఆక్రమణలను తొలగిస్తామన్నారు. కాలువలను పునరుద్ధరిస్తామని అధికారులు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఈ వర్షాకాలంలో వరదలు వస్తే గతేడాది పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► మరోసారి బాతుల చెరువు పొంగితే మా గతి ఏంటని లోతట్టు ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. వరద ప్రవాహం ఎప్పుడు తమను మంచెత్తుతుందో అని వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. రానున్న ప్రమాదాన్ని గుర్తించి అధికారులు మందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కట్టలకు మరమ్మతులు ఏవి? ► గతేడాది కురిసిన వర్షాలకు కుమ్మరికుంట కోతకు గురై కట్ట బలహీనంగా మారింది. దానికి తాత్కాలిక మరమ్మతులు చేసిన అధికారులు తిరిగి అటువైపు చూడలేదు. బాతుల చెరువు నిండి ప్రమాదకర స్థాయిలో వరద రావడంతో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ఆ చెరువుకట్ట బలహీనంగా మారింది. ► గత కొంత కాలంగా కట్టకు లీకేజీలు ఏర్పడి నీరు కిందికి వెళ్తోంది. తూములకు కూడా మరమ్మతులు చేయకపోవడంతో వాటి నుంచి కూడా నీరు దిగువకు వెళ్తోంది. ఇప్పటి వరకు కట్ట లీకేజీలను అరికట్టేందుకు, తూములకు మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. కంటిమీద కునుకు లేదు.. వర్షం వస్తుందంటే కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఏ క్షణంలో వరద ముంచెత్తుతుందోనని భయంగా ఉంది. బాతుల చెరువు అలుగు నీరు నేరుగా మా కాలనీ గుండా వెళ్తోంది. అలుగు నీరు వస్తుండటంతో ఇళ్ల నుంచి నుంచి బయటికి కూడా రాలేకపోతున్నాం. – రాములు, కట్టమైసమ్మ కాలనీ భయంగా ఉంది.. బాతులు చెరువు అలుగు పారుతుండటంతో ఏ క్షణంలో వరద నీరు మంచెత్తుతందోనని భయంగా ఉంది. గత అక్టోబర్‌లో వచ్చిన వరదకు ఇళ్లు మునగడంతో పైకప్పు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాం. అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. ఇప్పుడు ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. – బాబూలాల్, రంగనాయకుల గుట్ట -
పాత డ్యాంలతో ప్రపంచానికి ముప్పు
న్యూయార్క్: భవిష్యత్ తరాలకు జలప్రళయం పొంచి వుంది. కాలం తీరిన భారీ ఆనకట్టలతో రాబోయే మూడు దశాబ్దాల్లో ప్రజలు పెనుముప్పును ఎదుర్కోబోతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని దాదాపు వెయ్యి డ్యాంలు నిర్మించి 2025 నాటికి 50 ఏళ్లు పూర్తవుతుంది. ప్రపంèచవ్యాప్తంగా ఇలా కాలం తీరిన డ్యాంలు అత్యంత ప్రమాదకరంగా మారుతాయని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. 2050 నాటికి.. అంటే మరో 30 ఏళ్లలో ఇటువంటి పురాతన ఆనకట్టలకు దిగువనే అత్యధిక మంది జీవిస్తూ ఉండే పరిస్థితి ఉంటుందని తెలియజేసింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ‘కెనడా ఇనిస్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్’ సంకలనం చేసిన ‘ఏజింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: ఎన్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్’ అనే నివేదిక ప్రపంచవ్యాప్తంగా 1930 నుంచి 1970 మధ్య నిర్మించిన 58,700 భారీ ఆనకట్టల జీవిత కాలాన్ని 50 నుంచి 100 ఏళ్లకే రూపకల్పన చేసిన ట్టు వెల్లడించింది. 50 ఏళ్ల తరువాత నుంచి ఇటువంటి భారీ ఆనకట్టల సామర్థ్యం క్షీణిస్తూ వస్తుంది. అమెరికాలో... అమెరికాలోని 90,580 డ్యాంల సరాసరి వయస్సు 56 ఏళ్ళు. 2020 సంవత్సరంలో అమరికాలోని దాదాపు 85 శాతం ఆనకట్టలు వాటి జీవితకాలానికి మించి పనిచేస్తున్నాయి. 75 శాతం అమెరికా డ్యాంలు 50 ఏళ్ళు దాటిన తరువాత ఫెయిల్ అవడం ప్రారంభం అవుతుంది. అమెరికాలోని ఆనకట్టల పునరుద్ధరణకు 64 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. 21 అమెరికా రాష్ట్రాల్లోని గత ముప్ఫయ్యేళ్ళలో దాదాపు 1,275 డ్యాంలను తొలగించారు. కేవలం 2017లోనే 80 డ్యాంలను తొలగించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రాజెక్టుల్లోని నీటి పరిమాణం 7,000 నుంచి 8,300 క్యూబిక్ కిలో మీటర్లు అని అంచనా వేశారు. ఆసియా, యూరప్, నార్త్ అమెరికాల్లో ప్రధానంగా 20వ శతాబ్దం మధ్య కాలంలో 1960– 70 దశకంలో అత్యధికంగా భారీ ఆనకట్టల నిర్మాణం జరిగింది. ఆఫ్రికాలో 1980ల్లో అత్యధికంగా డ్యాంల నిర్మాణం జరిగింది. ఆ తరువాత కాలంలో కొత్తగా భారీ ఆనకట్టల నిర్మాణం తగ్గుతూ వచ్చిందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 20 శతాబ్దం మధ్యలో మాదిరిగా ప్రపంచంలో తిరిగి పెద్ద ఆనకట్టల నిర్మాణం జరిగే అవకాశం ఇప్పుడు లేదు. కానీ ఆ రోజుల్లో నిర్మించిన ఆనకట్టలకు అనివార్యంగా వయస్సు పెరుగుతూ వస్తుంది. నాలుగు దశాబ్దాలుగా భారీ ఆనకట్టల నిర్మాణం తగ్గుతూ వస్తోంది. దీనికి కారణం ఈ భారీ ఆనకట్టల నిర్మాణానికి అవసరమైన ప్రాంతాలు సైతం క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే 50 శాతం నదీప్రవాహ ప్రాంతం విఛ్చిన్నమైపోయినట్టు రిపోర్టు తెలిపింది. అలాగే భారీ డ్యాంల నిర్మాణాలు చూపుతోన్న ప్రభావం, పర్యావరణ సమస్యలు తదితర అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరిగిందని కూడా ఈ అధ్యయనం గుర్తించింది. అందుకే భారీ ప్రాజెక్టుల స్థానంలో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నీటిని నిల్వచేసే దృక్పథం, దృష్టీ పెరిగింది. అందుకే సహజ సిద్ధమైన పరిష్కారాలను వెతుకుతున్న విషయాన్ని ఈ అధ్యయనం తేల్చింది. తీవ్రతరమవుతోన్న పర్యావరణ పరిస్థితుల రీత్యా ఆనకట్టల రూపకల్పనలో పరిమితులను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. కాలంచెల్లిన ఆనకట్టలను తొలగించాల్సిన ఆవశ్యకతను ఈ రిపోర్టు స్పష్టం చేస్తోంది. ప్రజల భద్రత, నిర్వహణా ఖర్చులు తగ్గించేందుకు, రిజర్వాయర్ల సెడిమెంటేషన్, సహజసిద్ధమైన నదులను పరిరక్షించుకోవడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన భారీ ఆనకట్టల నిర్మాణం తగ్గడానికి ప్రధాన కారణాలని రిపోర్టు వెల్లడించింది. ఆనకట్టల నిర్మాణం ఎంత ముఖ్యమో, వాటి కాలం చెల్లిన తరువాత వాటి తొలగింపు కూడా మానవాళి మనుగడకోసం అంతే ముఖ్యమని అధ్యయనం అభిప్రాయపడింది. కాలం తీరడం అంటే.. ఆనకట్ట నిర్మాణ సామర్థ్యాన్ని బట్టి అది ఎంతకాలం ఉంటుందో నిర్ధారిస్తారు. ఆనకట్ట నిర్మించి 50 ఏళ్లు దాటిన తరువాత దాని జీవిత కాలం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఆనకట్టకి పదే పదే మరమ్మత్తుల అవసరం అవుతూ ఉంటాయి, డ్యాం సామర్థ్యం క్షీణించడం వల్ల నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. నాణ్యమైన ఆనకట్టలను రూపకల్పన చేస్తే, వాటి నిర్వహణ సమగ్రంగా ఉంటే, 100 సంవత్సరాల వరకూ చక్కగా ఉపయోగపడతాయి. కానీ, ఆర్థిక పరిమితులు, ఇతర ఆచరణాత్మక సమస్యల వల్ల వయస్సుమీరిన ఆనకట్టలు పనికిరాకుండా పోయే పరిస్థితి వస్తుంది. 20వ శతాబ్దంలో నిర్మించిన వేలకొద్దీ ఆనకట్టల దిగువన 2050 కల్లా అత్యధిక మంది ప్రజలు నివసించే పరిస్థితి ఏర్పడుతుంది. వాటిలో చాలా వరకు ఇప్పటికే కాలంతీరినట్టు ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీ అంచనా వేసింది. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, ఇండియా, జపాన్, జాంబియా, జింబాబ్వే దేశాల్లోని డ్యాంలపై ఈ అధ్యయనం చేశారు. కేరళకు పెను ముప్పు భారతదేశంలో దాదాపు 1,115 భారీ ఆనకట్టలు నిర్మాణం జరిగి 2025 నాటికి 50 ఏళ్లు పూర్తికానుంది. దేశంలోని దాదాపు 4,250కి పైగా ఆనకట్టలకు 2050 నాటికి 50 ఏళ్లు నిండుతాయి. అలాగే 2050 సంవత్సరానికల్లా దేశంలోని 64 ఆనకట్టలకు 150 ఏళ్ల పూర్తవుతాయి. 100 ఏళ్ల క్రితం నిర్మించిన కేరళలోని ముల్లపెరియార్ డ్యాం బద్దలైతే దాదాపు 35 లక్షల మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. దీన్ని భూకంపాలకు అనువైన ప్రదేశంలో కట్టారని, అలాగే కట్టడం క్రమంగా దెబ్బతింటోందని, ఈ డ్యాం పర్యవేక్షణ కేరళ తమిళనాడుల మధ్య వివాదాస్పదంగా మారిందని చెప్పింది. అత్యధిక ఆనకట్టలు నాలుగు దేశాల్లోనే... 20 శతాబ్దపు మధ్యలో ప్రపంచం అనూహ్యంగా భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చవి చూసిందని రిపోర్టు వెల్లడించింది. నాలుగు ఆసియా దేశాల్లోనే అత్యధికంగా భారీ డ్యాంలున్నాయని గుర్తుచేసింది. చైనా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియాల్లో మొత్తం 32,716 పెద్ద ఆనకట్టలు(ప్రపంచంలోనే 55 శాతం) ఉన్నాయి. ఒక్క చైనాలోనే 23,841 భారీ ఆనకట్టలు(ప్రపంచంలోని మొత్తం డ్యాంలలో 40 శాతం) ఉన్నాయి. వీటిలో చాలా వాటికి త్వరలోనే 50 ఏళ్లు పూర్తవుతాయి. వీటికి ప్రమాదం పొంచి వున్నట్టు అధ్యయనంలో తేలింది. ఇదే పరిస్థితి ఆఫ్రికా, దక్షిణ అమెరికా, తూర్పు యూరప్‌లోనూ ఉంది. కాలంతీరిన పెద్ద ఆనకట్టల సమస్య చాలా తక్కువ దేశాలెదుర్కొంటున్నాయి. ప్రపంచంలోని పెద్ద ఆనకట్టలలో 93 శాతం కేవలం 25 దేశాల్లోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆనకట్టల స్థితిగతులు ఇలా.. -
మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, హైదారాబాద్ : వాయవ్య బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆల్మట్టికి భారీగా వరద మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి డ్యామ్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టిలో నీటి మట్టం భారీగా పెరిగితే శైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టులకు పెద్దఎత్తున నీరు వచ్చే అవకాశం ఉంటుందని, నెలాఖరులోగా ఈ ప్రాజెక్టులు నిండుతాయని అధికారులు తెలిపారు. -
నిండుకుండలా కర్నూలు జిల్లాలోని జలశయాలు
-
మిచిగాన్‌ను ముంచెత్తిన వరద: అత్యవసర పరిస్థితి
వాషింగ్టన్: ఇప్పటికే కరోనా వైరస్ సంక్షోభంతో విలవిల్లాడుతున్న అమెరికాలోని మిచిగాన్ మరో తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మిచిగాన్‌ను అసాధారణమైన వరద ముంచెత్తింది. వరద ఉధృతికి ఈడెన్‌విల్లే, శాన్ఫోర్డ్ ఆనకట్టలు తెగిపోయాయి. దీంతో రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వేగంగా పెరుగుతున్న నీరు ఆనకట్టలను ముంచెత్తింది. రికార్డు స్థాయిలో వరదనీరు ముంచెత్తడంతో సమీప ప్రాంతాలన్నీ జల దిగ్భంధనంలో చిక్కుకున్నాయి. ఈడెన్ విల్లే, శాన్ఫోర్డ్, మిడ్ ల్యాండ్ నగరాలను ఖాళీ చేయించారు. సుమారు 10,000 మందిని సురక్షిత ప్రారంతాలకు తరలించారు. అటు నేషనల్ వెదర్ సర్వీస్ కూడా దీన్ని ‘ప్రాణాంతక పరిస్థితి’ గా పేర్కొంది. DAM BURST: Residents who live along two lakes and a river in Michigan urged to evacuate after dam fails following days of heavy flooding across parts of the Midwest. https://t.co/EwlVQl6Fdm pic.twitter.com/HfDKWkulDz — ABC News (@ABC) May 20, 2020 రాబోయే 12 నుండి 15 గంటలలో, మిడ్‌లాండ్ దిగువప్రాంతం సుమారు 9 అడుగుల లోతు నీటిలో చిక్కుకోవచ్చని మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్ మంగళవారం చెప్పారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎపుడూ చూడలేదనీ, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఖాళీ చేయాలని ప్రజలను ఆమె కోరారు. అటు మిడ్‌ల్యాండ్ ప్రధాన కార్యాలయం ఖాళీ చేశారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి అవసరమైన సిబ్బంది మాత్రమే అక్కడ ఉన్నారు. మరోవైపు 500 సంవత్సరాల తరువాత 1986లో ఏర్పడిన వరద పరిస్థితి రానుందని, టిట్టాబావాస్సీ నది నీటి మట్టం 38 అడుగుల రికార్డు ఎత్తుకు పెరగనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
చెక్‌డ్యామ్‌లకు నాబార్డ్ రుణం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌లకు నిధుల కొరత లేకుండా నాబార్డ్ నుంచి రుణాలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యం లో రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధుల కేటాయింపులు కష్ట సాధ్యం కావడంతో ఈ మేరకు రుణాలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తంగా రూ.1,650 కోట్ల మేర రుణాలు తీసుకునేలా నాబార్డ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1,235 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం కాగా, వీటికి రూ.4,920 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంది. తొలి విడతగా ఈ ఏడాది గోదావరి బేసిన్లో 410, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని తలపెట్టి ఇప్పటికే సాంకేతిక అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగిరం చేశారు. ఇలా 250 చెక్‌డ్యామ్‌లకు అనుమతులివ్వగా, 100 వరకు టెండర్లు పిలిచారు. మిగతా వాటికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వాటికి నిధుల కొరత లేకుండా ఈ మార్చి నెల వరకు నిర్మించే చెక్‌డ్యామ్‌ల అవసరాలకు రూ.150 కోట్లు, ఆ తర్వాత వార్షిక ఏడాదికి మరో రూ.1500 కోట్లు రుణాలు తీసుకునేలా చర్చలు జరుపుతోంది. దీనిపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఆనకట్టల భద్రతకు ఆమోదం
న్యూఢిల్లీ: డ్యాములు, నీటి రిజర్వాయర్ల రక్షణ కోసం ఉద్దేశించిన ఆనకట్టల భద్రత బిల్లు – 2018కి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఆనకట్టల భద్రతకు పాటించాల్సిన విధానాలపై పరిశోధనలు జరిపి సిఫారసులు చేసేందుకు జాతీయ స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుందని తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశంలో ఆనకట్టల భద్రతా ప్రమాణాలపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు, నిబంధనలను అమలు చేసేందుకు జాతీయ ఆనకట్టల రక్షణ సంస్థ (ఎన్డీఎస్ఏ)ను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా బిల్లులో పొందుపరిచామన్నారు. ఆనకట్టల రక్షణ కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకే రకమైన భద్రతా విధానాలను పాటించేందుకు కూడా బిల్లు తోడ్పడుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై పలు ఇతర నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ ఇతర నిర్ణయాలు ► ఉన్నత వ్యవసాయ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు 2020 వరకు మొత్తంగా 2,225.46 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్), నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (ఏన్ఏఏఆర్ఎం), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుమెన్ ఇన్ అగ్రికల్చర్ (సీఐడబ్ల్యూఏ) తదితర సంస్థలకు ఈ నిధులు అందనున్నాయి. ► ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు – 2013ను వెనక్కు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. బిల్లులోని ప్రతిపాదిత మార్పులను విశ్వవిద్యాలయ పాలక మండలితో చర్చించి తుది నిర్ణయానికి రావాలన్న కారణంతో ఈ బిల్లును ఉపసంహరించుకోనున్నారు. ► కేంద్ర జాబితాలోని ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) ఉప వర్గీకరణ అంశంపై పరిశీలన జరుపుతున్న కమిటీకి మంత్రివర్గం ఈ ఏడాది జూలై వరకు పొడిగింపునిచ్చింది. ►ఈశాన్య మండలికి అధ్యక్షుడిగా ఇకపై కేంద్ర హోం మంత్రి ఉండాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటివరకు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి ఈశాన్య మండలికి అధ్యక్షుడిగా ఉంటుండగా, ఇకపై ఆ శాఖ మంత్రి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ►ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వద్ద హోటల్‌ను నిర్మించేందుకు 3.7 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు సంస్థకు 99 ఏళ్ల పాటు అద్దెకివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ►వైద్య, ఆరోగ్య రంగాల్లో పరిశోధన కోసం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)తో ఫ్రాన్స్‌లోని ఐఎన్ఎస్ఈఆర్ఎం కుదుర్చుకున్న ఒప్పందం గురించి మంత్రివర్గం చర్చించింది. -
‘పొలాలకు నీరందకపోతే డ్యాంలు ఎందుకు?’
న్యూఢిల్లీ: పంట పొలాలకు నీరు అందకపోతే డ్యాంలు నిర్మించి ఏం లాభమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ప్రశ్నించారు. డ్యాంలలోని నీటిని 100 శాతం వినియోగించుకోవాలని, దీనికి పైపులు, డ్రిప్ తదితర పద్ధతులు పాటించాలన్నారు. మంగళవారం ఢిల్లీలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ (సీఏడీ)పై జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద రూ.78 వేల కోట్లతో 99 ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించామన్నారు. కానీ గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్టు సీఏడీ పనుల కోసం రూ.2 వేల కోట్ల ప్రతిపాదనలు, తెలంగాణ నుంచి రూ.12 కోట్ల ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయని తెలిపారు. -
బ్రహ్మపుత్రపై.. చైనా దొంగబుద్ధి
బీజింగ్ : ఈశాన్యరాష్ట్రాలకు వరప్రదాయిని అయిన బ్రహ్మపుత్ర నదిని పూర్తిగా కబ్జా చేసేందుకు చైనా ప్రయత్నాలు మమ్మురం చేసింది. హిమాలయ నదుల్లో ప్రత్యేకమయిన బ్రహ్మపుత్ర నదిపై వివిధ ప్రాంతాల్లో భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను చైనా నిర్మిస్తోందని గ్లోబెల్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. చైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తే.. ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లు పూర్తిగా ఎండిపోతాయని ఆ పత్రిక పేర్కొంది. ఇదిలా ఉండగా.. బ్రహ్మపుత్ర నది (దీనిని చైనాలో యార్లుంగ్ త్సాంగ్పోగా పిలుస్తారు)కి భారీ సొరంగం తవ్వి నీటని జిన్‌జాయాంగ్ ప్రాంతానికి తరలిస్తారనే పుకార్లు గత నెల్లో వచ్చాయి. అయితే వీటిని చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవపట్టించేందుకు చైనా ఇటువంటి వ్యాఖ్యలు చేసిందని.. వాస్తవంగా టన్నెల్ నిర్మాణ పనుల గురించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆ పత్రిక స్పష్టం చేసింది. కేవలం బ్రహ్మపుత్ర లక్ష్యంగా..! టిబెట్‌లో బ్రహ్మపుత్రతో పాటూ.. జిన్షా, లాన్‌శాంగ్, నుజియాంగ్ నదులు ప్రవహిస్తున్నాయి. హైడ్రోపవర్‌కు బ్రహ్మపుత్రకన్నా ఇవి అత్యుత్తమమని నిపుణులు ఇప్పటికే తేల్చారు. అయితే ఆ నదులు భారత్‌లో ప్రవహించనందున చైనా వాటిపై దృష్టి పెట్టలేదు. కేవలం దొంగబుద్ధితో బ్రహ్మపుత్ర నదిపై విరివిగా జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జాంగ్ము..! ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించిన జాంగ్ము ప్రాజెక్టు 2014 నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టులో 86.6 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిలువచేయవచ్చు. ఇలాంటివి మరిన్ని టిబెట్ సరిహద్దుల్లో నిర్మించాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. -
ఊరు వలసెళ్లిపోతోంది..
కార్తెలు కరిగినా.. - చెరువుల్లోకి చేరని నీరు - మత్య్సకారుల వలసబాట - పట్టించుకోని ప్రభుత్వం గుమ్మఘట్ట: కరువు ప్రాంతంలో కల్పతరువైన వేదావతి పరివాహక ప్రాంతం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటి కార్తెలన్నీ కరిగిపోతున్నా చెరువుల్లో మోకాలిలోతు నీరు చేరని దుస్థితి నెలకొంది. కర్ణాటక సరిహద్దున ఉన్న బీటీ ప్రాజెక్టులోకి సైతం చుక్కనీరు చేరక బీటలు వారింది. నీటి జాడ కనుమరుగై ఎడారిని తలపిస్తున్నాయి. నీటి నమ్ముకున్న మత్స్యకారుల బతుకుబజారుపాలైంది. ఈ దుస్థితి బీటీ ప్రాజెక్టుకే కాదు.. జిల్లాలో ఉన్న పేరూరు, చిత్రావతి, యోగివేమన, పెండేకల్లు, పీఏబీఆర్, మిడ్పెన్నర్ రిజర్వాయర్లకూ పాకింది. అలాగే 325 చెరువల్లోనూ 50 చెరువులకు సైతం అరకొర నీరు చేరలేదు. వీటిపై ప్రత్యేక్షంగా ఆధారపడిన వేలాది మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో వలసబాట పడుతున్నారు. కర్ణాటక రాష్ట్రం దాటుకుంటూ బీటీపీ రిజర్వాయర్ వద్ద తన సంతతి పెంచుకోవడానికి వచ్చిన పక్షులకు నీరు, గూడు, నీడ కరువైంది. ఆహారం దొరక్క పక్షులు అలమటిస్తున్నాయి. ఎండల తీవ్రతకు కొన్ని మృత్యువాత పడగా, మరిన్ని మారెకణం రిజర్వాయర్ వద్దకు తిరుగుముఖం పట్టాయి. ఇక్కడ కనిపిస్తున్న పక్షులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయని పలువురు మత్స్యకారులు చెపుతున్నారు. వలసలు మొదలయ్యాయ్.. : జిల్లా వ్యాప్తంగా లైసెన్సులు కలిగిన మత్స్యకారులు 10 వేల మందికి పైగా ఉండగా, ఇందులో సుమారు నాలుగు వేల మంది వలస వెళ్లి పోయారు. పీఏబీఆర్, మిడ్‌పెన్నార్, చిత్రవతి రిజర్వాయర్లకు తుంగభద్ర జలాలు, జీడిపల్లికి హంద్రీనీవా నీరు అందుతుండటంతో ఆ ప్రాంతాల్లో కొంత పరువాలేదనిపించినా మిగిలిన నాలుగ రిజర్వాయర్లతో పాటు సుమారు 280 చెరువుల పరిధిలో మత్స్య సంపద క్షీణించింది. నీరున్నచోటకెళ్లి అరకొరగా పట్టుకోవడం కన్నా కూలీ పనులు చేసుకోవడమే ఉత్తమమని భావించి హైదరాబాద్‌తో పాటు కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరు వంటి ప్రాంతాలకెళ్లిపోతున్నారు. దీనికి కారణం వర్షాభావంతో పాటు మత్స్య సంపదపై ప్రభుత్వం దృష్టి సారించక పోవడమే అని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 40 ఏళ్లలో ఇంతటి దుర్భర జీవితాలు అనుభవించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు కిలోల వరకు దిగుబడి సాధించాం జిల్లాలో మరెక్కడా లేనంతగా బీటీపీ రిజర్వాయర్‌లో ఐదు కిలోలకు పైగా చేపను ఉత్పత్తిచేసి విక్రయాలు చేపట్టాం. జిల్లా కేంద్రం నుంచి ఇక్కడి చేపల కొనుగోలుకు వ్యాపారులు క్యూ కట్టేవారు. ఇలాంటి తరుణంలో ప్రకృతి పగబడితే, ఎలాంటి రాయితీలు అందించక ప్రభుత్వం మరోలా దగా చేస్తోంది. మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకోవాలి. – వీరభద్ర, మత్స్యకారుడు, కోనాపురం వెయ్యి కుటుంబాలు వీధిన పడ్డాయి బీటీపీ రిజర్వాయర్‌ను నమ్ముకుని సుమారు వెయ్యి కుటుంబాల మత్స్యకారులు జీవనోపాధి పొందేవి. ప్రస్తుతం అడుగంటడంతో వలసలే శరణమయ్యాయి. రెండు రోజుల నుంచి 70 కుటుంబాల వారు వలసలు వెళ్లారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి రిజర్వాయర్ వద్ద చేపలు పట్టి దినకూలీగా బతకాల్సి వచ్చింది. ప్రభుత్వం తమ జీవనోపాధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తగిన ఆర్థిక సహాయంతో తమ కుటుంబాలను ఆదుకోవాలి. – రామంజనేయులు, మత్స్యకారుడు, తాళ్లకెర -
చుక్క నీటికీ చిక్కే!
-
చుక్క నీటికీ చిక్కే!
ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి లోటుతో తాగునీటి గండం * ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నివేదిక * నీటిని సంరక్షించుకునే చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖకు సూచన * శ్రీశైలం, సాగర్‌లో డిసెంబర్ తర్వాతి లభ్యత 10 టీఎంసీలు.. అవసరం 31 టీఎంసీలు * హైదరాబాద్‌కు, నల్లగొండ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నీటికి కటకటే * మంజీరా ఎండిపోవడంతో సంగారెడ్డికి, పరిసర గ్రామాలకు నీటి కరువు * శ్రీరాంసాగర్ ఎండుతుండడంతో కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లిలకూ తప్పని ఇబ్బంది * మానేరు నుంచి వరంగల్‌కు నీరు అందే పరిస్థితీ లేదు * భద్రకాళి చెరువులోనూ అడుగంటిన జలాలు * ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, నీటిని పొదుపుగా వాడాలని సూచనలు సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో ముందు ముందు తాగునీటికి కటకట తప్పదా.., వేసవిలో చుక్క నీటికోసం అల్లాడాల్సిన పరిస్థితి నెలకొననుందా.., హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాలన్నీ దాహంతో గొంతెండిపోవాల్సిందేనా.. ఈ ప్రశ్నలన్నింటికీ సాగునీటి పారుదల శాఖ నేతృత్వంలోని నీటి కేటాయింపుల కమిటీ అవుననే సమాధానమే ఇస్తోంది. వేసవి ప్రారంభం నాటికే జల వనరులన్నీ ఎండిపోయి, తాగునీటికి తీవ్ర కరువు తప్పదని తమ నివేదికలో స్పష్టం చేసింది. వెంటనే ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతోపాటు పలు సిఫారసులు చేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన జంట నగరాలు, నల్లగొండ పట్టణం, పరిసర గ్రామాల్లో తాగునీటి అవసరాలకు 31 టీఎంసీలు అవసరం కాగా... లభ్యత ఉండేది 10 టీఎంసీలేనని నీటిపారుదల శాఖ వర్గాలు వివరించాయి. కోటిన్నర మందిపై ప్రభావం.. ప్రస్తుత సీజన్లో వర్షాభావం నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు తదితర ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థితికి పడిపోయాయి. వీటన్నింటిలోనూ ఒక్క శ్రీశైలంలో మాత్రమే తాగునీటిని అందించగలిగే స్థాయిలో లభ్యత జలాలు ఉన్నాయి. ఈ ప్రభావం వచ్చే వేసవిలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సాగర్, సింగూరు జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోవడంతో హైదరాబాద్, నల్లగొండ, సంగారెడ్డి ప్రాంతాలకు కటకట తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రభావం కోటిన్నర మందిపై ఉండే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని నీటి పారుదల శాఖ ఇటీవల సమీక్షించి... తాగునీటి అవసరాలపై మున్సిపల్ శాఖను అప్రమత్తం చేసింది. ప్రస్తుత లెక్కల మేరకు శ్రీశైలంలో కనీస నీటి మట్టం (ఎండీడీఎల్) 834 అడుగులకు పైన 18.34 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఎండీడీఎల్‌కు దిగువన 796 అడుగుల దాకా మరో 26.78 టీఎంసీలున్నాయి. మొత్తంగా ఇక్కడ వినియోగించుకునే వీలున్న నీరు 45.13 టీఎంసీలని లెక్కగట్టారు. ఇక సాగర్‌లో 510 అడుగుల కనీస మట్టానికి ఎగువన 1.19 టీఎంసీలున్నాయి. రెండింటిలో కలిపి 46.32 టీఎంసీలు ఉండగా.. ఆవిరి నష్టాలు 8 టీఎంసీల మేర ఉంటాయని అంచనా. అంటే మొత్తంగా లభ్యత జలాలు 38.32 టీఎంసీలేనని లెక్కించారు. ఇందులో డిసెంబర్ వరకు ఏపీ అవసరాలకు 14 టీఎంసీలు, తెలంగాణకు 3 టీఎంసీల మేర వాడుకునేలా కృష్ణా బోర్డు అనుమతినిచ్చింది. ఈ నీరు పోతే మిగిలే జలాలు 21.32 టీఎంసీలే. ఇందులో డిసెంబర్ తర్వాత మళ్లీ ఇరు రాష్ట్రాలకు చెరో 10 టీఎంసీల వరకు కేటాయించే అవకాశముంది. కానీ రాష్ట్ర అవసరాలు మాత్రం అందుకు మూడింతలుగా 31 టీఎంసీల మేర ఉన్నాయి. అవసరాలు ఇలా.. నాగార్జున సాగర్ కింద తాగునీటి లెక్కలను నీటి పారుదల శాఖ స్పష్టంగా పేర్కొంది. ఏఎమ్మార్పీ నుంచి హైదరాబాద్‌కు 12.12 టీఎంసీలు, న ల్లగొండపట్టణానికి 2.35, జిల్లాలోని 93 చెరువులకు 1.50 టీఎంసీలు, సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న చెరువులకు 1.50 టీఎంసీలు కలిపి మొత్తం 17.47 టీఎంసీల నీరు అవసరమని లెక్కించింది. దీంతో పాటు సాగర్ ఎడమగట్టు కాలువ మిర్యాలగూడ సర్కిల్‌కు 5.40, టేకులపల్లి సర్కిల్‌కు 8.7 టీఎంసీలు కావాలని పేర్కొంది. మొత్తంగా సాగర్ కింద 31 .57 టీఎంసీలు అవసరమని స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్ అవసరాలను తీరుస్తున్న మంజీరాలో గత 45 రోజులుగా పంపింగ్ జరుగుతోంది. ఇక్కడ ప్రస్తుతం 0.2 టీఎంసీల నీరే ఉంది. నిజానికి మంజీరా ఆధారిత మంచినీటి పథకాలకు 6.9 టీఎంసీలు అవసరం. ప్రస్తుతమున్న నిల్వలు సంగారెడ్డి, హైదరాబాద్ నగరానికి కేవలం 45 రోజులకే సరిపోతాయి. ఇక సింగూరులోనూ 0.9 టీఎంసీల జలాలే ఉన్నాయి. వీటిని ఒక నెల పాటు సర్దుబాటు చేయవచ్చని... తర్వాతి అవసరాలకు గడ్డు పరిస్థితి తప్పదని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. జాగ్రత్తగా వాడుకోవాలి.. ఎస్సారెస్పీలో 7 టీఎంసీల మేర నిల్వ ఉన్నా ఇక్కడ డెడ్‌స్టోరేజీ 5 టీఎంసీలు. ఇందులో ఆవిరి నష్టాలు 1.13 టీఎంసీలుపోతే లభ్యత ఒక టీఎంసీ లోపే. కానీ ఇక్కడ సుమారు 3 టీఎంసీలు అవసరం. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల పట్టణాలకు వచ్చే జూలై వరకు ఇక్కడి నుంచే నీటిని విడుదల చే యాల్సి ఉంటుంది. జగిత్యాలకు నీటిని సరఫరా చేసే ధర్మసాగర్ చెరువులో 45 రోజుల అవసరాలకు మించి నిల్వ చేసుకునే వెసులుబాటు లేదు. దీంతో ఈ చెరువు సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. దీంతోపాటు కోరుట్ల రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం కూడా పెంచాలని, ఈనెల 15 వరకు దీనికి నీటిని విడుదల చేయకూడదని పేర్కొన్నారు. ఇక దిగువ మానేరు డ్యామ్ కింద రబీ అవసరాల నేపథ్యంలో... ఈ ప్రాజెక్టు నుంచి వరంగల్‌కు తాగునీటిని సరఫరా చేసే అవకాశం లేద ని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవాలని సూచించింది. దిగువ మానేరుపై ఆధారపడిన సిరిసిల్ల, సిద్ధిపేట, వేములవాడ పట్టణాలకు నీటి సరఫరా కోసం ప్రతి నెలా 0.25 టీఎంసీలు అవసరంకాగా.. ప్రస్తుత నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని పేర్కొంది. మానేరులో నిల్వలు డెడ్‌స్టోరేజీకి చేరితే పంపింగ్ ద్వారా నీటిని తోడి కరీంనగర్ నగర అవసరాలను తీర్చాలని సిఫార్సు చేసింది. వరంగల్‌కు నీటిని సరఫరా చేసే భద్రకాళి చెరువులో నీరు అడుగంటిన దృష్ట్యా, గోదావరిపై నెల రోజుల్లో అడ్డుకట్ట నిర్మించి నీటిని తరలించాలని సూచించింది. -
మన డ్యామ్‌లు సురక్షితమేనా?
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 600 డ్యామ్‌లు పాత ఆనకట్టలను కూల్చేయాలంటున్న నిపుణులు న్యూఢిల్లీ: దేశంలోని ఆనకట్టల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. భూకంపాలకు అత్యంత ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాల్లో 600లకు పైగా భారీ డ్యామ్‌లు ఉన్నాయని ఆ సర్వేలో తేలింది. గత యాభై ఏళ్లలో నిర్మించిన 3 వేల డ్యామ్‌లు సహా దేశవ్యాప్తంగా 5 వేల భారీ ఆనకట్టలు ఉన్నాయి. మొత్తంమీద 9 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి ఇవి సాగు వసతి కల్పిస్తున్నాయి. వీటిలో కేవలం 3% ప్రాజెక్టుల్లో జలవిద్యుదుత్పత్తి జరుగుతోంది. 2011లో జపాన్‌లో వచ్చిన భారీ భూకంపం, ఆ ప్రభావంతో వచ్చిన సునామీ అక్కడి ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రాన్ని నాశనం చేసిన ఉదంతంలో వెయ్యి మంది దుర్మరణం పాలవడంం తెలిసిందే. దీంతో భారత్‌లోని భారీ ఆనకట్టల భద్రతపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని డ్యామ్‌లన్నీ అత్యంత తీవ్రతతో వచ్చిన భూకంపాలను, సునామీలను కూడా తట్టుకోగలవని ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి. ‘ఫుకుషిమా ఘటన అనంతరం దేశంలోని అన్ని ఆనకట్టలు, అణు విద్యుత్కేంద్రాలపై భద్రతకు సంబంధించిన పరీక్షలు జరిపారు. అవన్నీ 100% సురక్షితం’ అని ఇటీవల కేంద్రం చెప్పింది. అయితే, నిపుణుల అభిప్రాయం వేరేలా ఉంది. భారత్‌లోని చాలా డ్యామ్‌లు చాలాఏళ్ల క్రితం నిర్మించినవని, అవి ఇప్పుడు సురక్షితం కావని, వాటిని కూల్చి మళ్లీ కొత్తగా నిర్మించాల్సి ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. వంద పాత డ్యామ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయని సౌత్ ఏషియా నెట్వర్క్ ఆఫ్ డ్యామ్స్ కోఆర్డినేటర్ హిమాంశు ఠక్కర్ చెప్పారు. చాలా డ్యామ్‌లు భారీ వరదలు వచ్చే ప్రాంతాల్లో, బలహీనమైన ప్రదేశాల్లో నిర్మించారని, అవి భూకంపాలకు కారణమవుతాయని రామస్వామి అయ్యర్ అనే నిపుణుడు అన్నారు. అయితే, డ్యామ్‌ల కూల్చివేతకు చాలాకాలం పడుతుందని, కొత్త ఆనకట్టల నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకొని ఉన్నదని జనవనరుల శాఖ వారి వాదన. 118 ఏళ్లనాటి ముళ్లపెరియార్ ఆనకట్టపై వ్యక్తమవుతున్న భయాందోళనలు సమంజసమేనని చాలామంది అభిప్రాయం. కేరళలో ఉన్న ఆ డ్యామ్ వల్ల తమిళనాడులోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. అయితే, భద్రతాకారణాల దృష్ట్యా ఇప్పుడు ఆ డ్యామ్‌ను కూల్చేయాలని కేరళ డిమాండ్ చేస్తుండగా.. ఆ ఆనకట్ట సురక్షితమేనని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. భారత్‌లో డ్యామ్ ప్రమాదాలు * 1979లో గుజరాత్‌లోని మొర్బి డ్యామ్ కూలడంతో 5 వేల మంది చనిపోయారు. భారీ వర్షాలతో భారీగా నీరురావడంతో గోడలు బలహీనమై డ్యామ్ కూలిపోయింది. * 2008లో భారత్- నేపాల్ సరిహద్దుల్లోని సప్తకోషి నదిపై నిర్మించిన డ్యామ్ ఒక్కసారిగా బద్ధలవడంతో భారీ వరదలు బీహార్‌ను ముంచెత్తాయి. * 1969లో మహారాష్ట్రలోని కోయినానగర్లో సంభవించిన భారీ భూకంపానికి అక్కడి రిజర్వాయర్ వల్ల ఏర్పడే భూప్రకంపనలు ఒక కారణమని భూ విజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం.