
సాక్షి, హైదారాబాద్ : వాయవ్య బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆల్మట్టికి భారీగా వరద
మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి డ్యామ్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టిలో నీటి మట్టం భారీగా పెరిగితే శైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టులకు పెద్దఎత్తున నీరు వచ్చే అవకాశం ఉంటుందని, నెలాఖరులోగా ఈ ప్రాజెక్టులు నిండుతాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment