metrological center
-
రెడ్ అలర్ట్: భారీ నుంచి అతి భారీ వర్షాలు
తిరువనంతపురం : కేరళ రాష్ర్ట వ్యాప్తంగా గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఇడుక్కి, వయనాద్, కొజిక్కోడ్, కన్నూరర్లలో 12 -20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదుకానుందని అధికారులను హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అత్యధిక వేగంగా గాలులు వీస్తాయని తెలిపింది. దీని వల్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని. వయనాద్, కొజిక్కోడ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇదిలా ఉండగా తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షపాతం నమోదుకావడంతో ప్రాజెక్టుల నీటిమట్టం పెరుగుతుంది. పరివాహక ప్రాంతాల్లోని నదులు పొంగిపొర్లుతున్నాయి. వయనాడ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా సమీప ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయికి చేరిందని అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో వయనాద్‌లోని మనంతవాడీలో 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో నాలుగైదు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ ఇడుక్కి, వయనాద్ జిల్లాల కలెక్టర్లను కోరింది. (మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు) -
మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, హైదారాబాద్ : వాయవ్య బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆల్మట్టికి భారీగా వరద మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి డ్యామ్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టిలో నీటి మట్టం భారీగా పెరిగితే శైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టులకు పెద్దఎత్తున నీరు వచ్చే అవకాశం ఉంటుందని, నెలాఖరులోగా ఈ ప్రాజెక్టులు నిండుతాయని అధికారులు తెలిపారు. -
తమిళనాడు తీరప్రాంతంలో భారీ వర్షాలు
చెన్నై: తమిళనాడు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు మంగళవారం వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. చెన్నైకి 240 కిలోమీటర్ల దూరంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమైంది. దాంతో రానున్న 48 గంటల్లో అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీన్ని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో చెన్నై, తిరువళ్లుర్, క్రాంతిపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. చిత్తూరు, నెల్లూరులో కూడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
బంగ్లాదేశ్ వైపు తరలిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనం బంగ్లాదేశ్ వైపు తరలిపోయింది. ఇంకోవైపు, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడనుంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి తుపానుగా మారనుంది. ఈ నెల 12 నుంచి బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘చపల’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండబోదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బిహార్ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉపరితల ద్రోణి, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.