తిరువనంతపురం : కేరళ రాష్ర్ట వ్యాప్తంగా గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఇడుక్కి, వయనాద్, కొజిక్కోడ్, కన్నూరర్‌లలో 12 -20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదుకానుందని అధికారులను హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అత్యధిక వేగంగా గాలులు వీస్తాయని తెలిపింది. దీని వల్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని. వయనాద్, కొజిక్కోడ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఇదిలా ఉండగా తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షపాతం నమోదుకావడంతో ప్రాజెక్టుల నీటిమట్టం పెరుగుతుంది. పరివాహక ప్రాంతాల్లోని నదులు పొంగిపొర్లుతున్నాయి. వయనాడ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా సమీప ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయికి చేరిందని అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో వయనాద్‌లోని మనంతవాడీలో 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో నాలుగైదు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ ఇడుక్కి, వయనాద్ జిల్లాల కలెక్టర్లను కోరింది. (మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు)
Comments
Please login to add a commentAdd a comment