న్యూఢిల్లీ: అమెరికాలో నివాసముంటున్న టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు కర్మపా ఓజియెన్ ట్రిన్లే డోర్జీ భారత్‌కు తిరిగిరావాలని కేంద్రం కోరింది. ఢిల్లీలో ఆశ్రమం నిర్మించుకోవడానికి స్థలం కేటాయించడానికి కూడా అంగీకరించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కర్మపా భారత్‌లోనే ఉండాలని ఆయన అనుచరులు కోరుకుంటున్నారని, ప్రభుత్వం కూడా తిరిగిరావాలని ఆయన్ని కోరిందని ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారి ఒకరు తెలిపారు. అయితే కర్మపా భారత్ తిరిగిరావడానికి అయిష్టం వ్యక్తం చేసినట్లు చెప్పారు. దేశం లోపల, వెలుపల ఎలాంటి ఆంక్షలు లేకుండా సంచరించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కర్మపా డిమాండ్ చేస్తున్నారు. దలైలామా మాదిరిగా తనకూ స్వేచ్ఛగా సంచరించే అవకాశం కల్పించనందుకు అసంతృప్తితో కర్మపా డొమినికా పాస్‌పోర్టుతో అమెరికాలో నివాసముంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment