ఆత్మీయ క్షణాలు...
బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒకసారి ఆఫ్రికన్‌దేశం ఉగాండాలో పర్యటించాడు. ఆ సమయంలో అక్కడ ఒక గ్రామాన్ని సందర్శించాడు. ఆ వేళా విశేషంలో తనకు పుట్టిన పిల్లాడిని అమెరికా అధ్యక్షుడి చేతిలో పెడుతూ అతడి చేత నామరణం చేయించి, క్లింటన్ పేరే తన కొడుకుకూ పెట్టుకొంది ఒక తల్లి.
కొంతకాలానికి క్లింటన్ అధ్యక్ష పదవీ కాలం ముగిసింది. క్లింటన్ యూనెస్కోతో కలిసి పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా మరోసారి ఉగాండా వెళ్లాడు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకొంది. క్లింటన్ వస్తున్న విషయం తెలుసుకొన్న ఒక 14 యేళ్ల కుర్రాడు విమానాశ్రయంలోనే ఆయనను కలిసేందుకు అనుమతి తీసుకొన్నాడు.
విమానం దిగిన క్లింటన్‌కు తనను తను పరిచయం చేసుకొంటూ, తన పేరు కూడా క్లింటన్ అని చెప్పి ‘నాకు పేరు పెట్టింది మీరే..’ అంటూ ఒకప్పటి ఫోటోలను చూపించాడు. ఆ విషయం గుర్తుకు తెచ్చుకొన్న క్లింటన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ ఆత్మీయ క్షణంలో ఆ ఇద్దరూ భావోద్వేగానికి లోన య్యారు.. క్లింటన్ పొత్తిళ్లలో చిన్నారి ఒదిగి ఉన్న ఫొటో 1998లో తీసింది, రెండో ఫొటో 2012లో తీసింది.