
మొండిమొగుడు పెంకి పెళ్లాం, వజ్రం, రావణ బ్రహ్మ.. ఇలా ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసింది నటి సీత (Actress Seetha). తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కలిపి దాదాపు 60 సినిమాలు చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లో అమ్మ, అత్త పాత్రలు పోషిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. సీత మాట్లాడుతూ.. మూడేళ్ల వయసు నుంచే యాక్టింగ్ చేస్తున్నాను. బాల్యంలో చాలా సినిమాలు చేశాను. పెద్దయ్యాక తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ సినిమాలు చేశాను. ఇప్పుడు సీరియల్స్‌లో బిజీ అవడంతో సినిమాలు చేయట్లేదు.
చిన్నప్పుడే నాన్న మరణం..
నా వ్యక్తిగత విషయానికి వస్తే చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ నాతోపాటు షూటింగ్స్‌కు వచ్చేది. ఒకసారి విపరీతంగా దగ్గుతుంటే హాస్పిటల్‌కు తీసుకెళ్లాను. అప్పుడు తనకు క్యాన్సర్ నాలుగో స్టేజీ అని తెలిసింది. రెండు నెలలకంటే ఎక్కువ బతకదని చెప్పారు. ఆమెను బతికించమని దేవుళ్లను వేడుకున్నా.. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటినుంచి నాకు దేవుడంటేనే నమ్మకం పోయింది.
(చదవండి: రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్ రంభ.. ఈసారైనా..?)
మొదటి భర్తతో విడాకులు
నాకు గతంలో పెళ్లయి విడాకులు కూడా అయిపోయాయి. వేరే మతానికి చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నా.. ఆయనక్కూడా ఇది రెండోదే! మొదటి వైవాహిక బంధంలో భర్తతో ఎక్కువగా కలిసుండలేదు. ఎప్పుడూ పుట్టింట్లోనే ఉండేదాన్ని. ఏదైనా తప్పు జరిగుంటే విడాకులవుతాయి. కానీ నేను ఏ తప్పూ చేయలేదు. అయినా అలాంటి పరిస్థితి వచ్చింది. 2013లో విడాకులయ్యాయి. తర్వాత నా స్కూల్‌మేట్ పరిచయమయ్యాడు. 2018లో అతడిని పెళ్లి చేసుకున్నాను.
గర్భాశయం తీసేశారు
పిల్లలు ఎందుకు లేరంటే నాకు గర్భాశయంలో కణతులు (ఫైబ్రాయిడ్స్) ఏర్పడ్డాయి. మొదటి భర్తతో ఉన్నప్పుడే ఈ సమస్య తెలిసింది. టాబ్లెట్స్ వేసుకుంటే కరిగిపోతుందన్నారు. కానీ అప్పటి గొడవల వల్ల పెద్దగా పట్టించుకోలేదు. తీరా రెండో పెళ్లయ్యాక ఆ కణతుల పరిమాణం పెరిగిపోయింది. ఆ గడ్డ వల్ల వేరే సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరించారు. అప్పటికే రెండుసార్లు అబార్షన్ అయింది. దాంతో నేను గర్భాశయాన్నే తొలగించుకోవాల్సి వచ్చింది. అందుకే మాకు పిల్లలు లేరు. అని నటి సీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్‌లో యాక్ట్ చేస్తోంది.
చదవండి: తండ్రితో పోటీపడిన బుడ్డోడు.. ఇప్పుడెలా మారిపోయాడో చూశారా?!
Comments
Please login to add a commentAdd a comment