![GRAFFICAL MOVIE BHADRAKALI SHOOTING COMPLETED - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/4/Bhadrakali-%282%29.jpg.webp?itok=L06KO9Zc)
సీత
సీనియర్ నటి సీత ముఖ్య పాత్రలో బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మించిన చిత్రం ‘భద్రకాళి’. కె.ఎం.ఆనంద్ దర్శకుడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నిర్మాత రాంబాబు మాట్లాడుతూ–‘‘అమ్మవారిగా సీత అద్భుతంగా నటించారు. అమ్మవారికి, భక్తుడికి, దుష్టశక్తికి మధ్య జరిగే కథ ఈ సినిమా. ఓ భక్తుడికి జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించాం. దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య వచ్చే 25 నిమిషాల గ్రాఫిక్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఆదీష్ ఉత్రిన్ సాంగ్స్‌తో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. జూన్ ఆఖర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment