గీత స్మరణం | The Song lyrics by dasaradhi | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Mon, Nov 4 2013 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

The Song lyrics by dasaradhi

 పల్లవి :

ఆమె: చిన్ని చిన్ని కన్నయ్యా   కన్నులలో నీవయ్యా
 నిన్ను చూసి మురిసేనూ  నేను మేను మరిచేనూ
 ఎత్తుకొని ముద్దాడీ  ఉయ్యాలలూపేనూ
 జోలపాట పాడేనూ లాలిపాట పాడేనూ
 
 చరణం : 1
 
 అతడు: నీ ఒడిలో నిదురించీ తీయనీ కలగాంచీ
 పొంగి పొంగి పోయానూ పుణ్యమెంతో చేశానూ
 ఆ: నీ ఒడిలో నిదురించీ తీయని కలగాంచీ
 అ: పొంగి పొంగీ పోయానూ పుణ్యమెంతో చేశానూ
 ఏడేడు జన్మలకూ నాతోడు నీవమ్మా
 ఈనాటి ఈ బంధం ఏనాడు విడదమ్మా
 ఆ: అమ్మవలె రమ్మనగా పాపవలె చేరేవూ
 నా చెంత నీవుంటే స్వర్గమే నాదౌనూ
 అ: గాయత్రి మంత్రమునూ జపించే భక్తుడనే
 కోరుకున్న వరములనూ ఇవ్వకున్న వదలనులే
 
 చరణం : 2
 
 ఆ: స్నానమాడి శుభవేళా కురులలో పువ్వులతో
 అ: దేవివలే నీవొస్తే నా మనసు నిలువదులే
 ఆ: అందాల కన్నులకూ కాటుకను దిద్దేనూ
 చెడుచూపు పడకుండా అదరు చుక్కపెట్టేనూ
 చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
 అ: నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ
 ఆ: ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ
 అ: జోలపాట పాడేనూ
 ఆ: లాలిపాట పాడేనూ
 ఆ: జోలాలి... అ: జోలాలి...     (2)
 ఇద్దరూ: జోజోజో...
 
 చిత్రం : భద్రకాళి (1977)
 రచన : దాశరథి
 సంగీతం : ఇళయరాజా
 గానం : జేసుదాస్, పి.సుశీల

 
 - నిర్వహణ: నాగేశ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement