Nages
-
పిడుగుపాటుకు యువకుడి మృతి
టేకులపల్లి మండలంలోని రెండు గ్రామాల శివారులో శుక్రవారం పిడుగుపడింది. బిల్లుడుతండాలో పిడుగుపాటుకుభూక్య నాగేష్(25)అనే యువకుడు మృతిచెందగా..మరొకరికి గాయాలయ్యాయి. తూర్పుగూడెంలో పిడుగుపాటుకు ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. -
భార్యపై భర్త దాష్టీకం
రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీర నాగేశ్, అనిత దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. నాగేశ్ భార్యను అనుమానించటంతోపాటు అదనంగా కట్నం తేవాలంటూ గొడవకు దిగేవాడు. ఆదివారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో నాగేశ్ భార్యను తీవ్రంగా కొట్టాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
కూతురును పరీక్షకు తీసుకువచ్చి...
- గుండెపోటుతో తనువు చాలించిన తండ్రి -పరీక్ష పూర్తయ్యాకే కుమార్తెకు విషయం చెప్పిన బంధువులు -రంగారెడ్డి జిల్లా తూంకుంట జెడ్పీ పాఠశాల వద్ద ఘటన శామీర్‌పేట్ కూతురును పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సైకిల్‌పై తీసుకువచ్చిన ఓ తండ్రి పాఠశాల వద్ద గుండెపోటుకు గురై కానరాని లోకాలకు తరలివెళ్లాడు. పరీక్ష పూర్తయ్యాకే కుమార్తెకు బంధువులు విషయం తెలిపారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ వుండలం తూంకుంట జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. మేడ్చల్ వుండలం గుండ్లపోచంపల్లి ప్రాంతానికి చెందిన దొవ్ము నాగేశ్(45), లక్ష్మి దంపతులు. వీరికి నలుగురు సంతానం. రెండో కూతురు దుర్గ ఇటీవల పది పరీక్షల్లో తప్పింది. దీంతో నాగేశ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం బుధవారం సైకిల్‌పై కూతురును శామీర్‌పేట్ వుండలం తూంకుంట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సెంటర్‌కు తీసుకొచ్చాడు. కుమార్తెను దించేసిన అనంతరం ఆయాసం అనిపించడంతో కింద కూర్చునే యత్నం చేశాడు. అంతలోనే ఛాతీలో నొప్పి వచ్చిందని అక్కడే కుప్పకూలిపోయాడు. విషయుం గవునించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నాగేశ్ మృతిచెందాడని నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రికి తీసుకొని మృతదేహాన్ని తీసుకెళ్లారు. అయితే, పరీక్ష రాసేందుకు వచ్చిన దుర్గకు తన తండ్రి గుండెపోటుతో మృతిచెందిన విషయాన్ని బంధువులు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. పరీక్ష పూర్తయ్యాక విషయం తెలుసుకున్న దుర్గ రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. -
అంబులెన్స్ ఢీకొని ఇద్దరి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాల య్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంట వద్ద గురువారం చోటుచేసుకుంది. మార్కాపురం నుంచి మృతదేహాన్ని తీసుకొని కంభం వెళ్తున్న అంబులెన్స్ వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న చింతకుంట్ల నాగేష్(24), ప్రశాంత్(22) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యతో సంబంధం పెట్టుకున్నాడని..
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.వివరాలు..స్థానికంగా నివాసముంటున్న బొంతురాజు తవేరా వాహనాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రాజు భార్య సరిత ఇంటి పక్కన నివాసముంటున్న ఉప్పుల నగేష్(28)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసన రాజు పలుమార్లు ఇద్దరిని హెచ్చరించాడు. తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పిన పెడచెవిన పెట్టడంతో.. మనస్తాపానికి గురైన రాజు తన తమ్ముడితో కలిసి బుధవారం రాత్రి నగేష్ ఇంట్లోకి వె ళ్లి నిద్రిస్తున్న అతని కళ్లలో కారం చల్లి గొడ్డలితో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారిలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
మావోయిస్టు దళ సభ్యుని అరెస్ట్
మావోస్టు శబరి ఏరియా కమిటీ దళ సభ్యుడు ముచ్చిక అడమయ్యను అరెస్టు చేసినట్టు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. గురువారం ఎటపాక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం రాత్రి ఎటపాక మండల పరిధిలోని గొల్లగుప్ప అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా అడమయ్య పట్టుబడ్డాడని తెలియజేశారు. అడమయ్య చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీలోని లంకపల్లికి చెందినవాడని, ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి వరకు చదివి వ్యవసాయం చేసుకుంటున్న అతడు శబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్ ప్రోద్బలంతో మావోయిస్టుల కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడని వివరించారు. అడమయ్యకు 2014లో ఏడాది పాటు శిక్షణ ఇచ్చి ఈ ఏడాది దళంలో చేర్చుకుని 303 వెపన్ ఇచ్చారని తెలిపారు. ఇటీవల జరిగిన లక్ష్మీపురం చర్చి పాస్టర్ తనయుడి కిడ్నాప్‌లో, మారాయిగూడెం సమీపంలో సీఆర్పీఎఫ్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కాల్పులు జరిపి ఒకరిని హత్య చేసిన ఘటనలో అడమయ్య పాల్గొన్నాడన్నారు. పోస్టర్లు వేయటం, రహదారులు తవ్వటం వంటి పనుల్లో చురుకుగా పాల్గొనే వాడని తెలిపారు. -
గీత స్మరణం
పల్లవి : ఒకే కావ్యం... ఒకే శిల్పం... ఒకే చిత్రం... అదే ప్రణయం మన తనువు మారును తరము మారును స్వరము మార్చదు ప్రేమ ప్రేమ మరణం... ప్రేమ మరణం రెండూ ఒకటే అంటే నమ్మాలి ఆ స్వర్గం అంటూ చూడాలంటే రెండూ ఉండాలి ॥మరణం॥॥కావ్యం॥ చరణం : 1 తనువులేకం కాకముందు మనసులౌను ఏకమే తనువు తనువుకి ప్రాణ ద్వారం ప్రేమే ఎదలు రె ండు దూరమైన పెదవులౌను చేరువే పెదవి ద్వారా ఎదను చేరెను ప్రేమే ముళ్లలాంటి కళ్లతోటి అంతుచూస్తుంది పువ్వులాంటి నవ్వుతోటి ఆయువిస్తుంది ॥మరణం॥ చరణం : 2 ప్రేమ పాట పాతది... పూట పూట కొత్తది గాలిలేని చోటైన మోగేనిది ప్రేమ అంటే విషములే... విషములోన విశేషమే ఇదే జన్మలో మరో జన్మకు మార్గమే బీడుభూమిలో మెట్టభూమిలో మొగ్గ ప్రేమేలే మండుటెండలో ఎండమావిలో నీడ ప్రేమేలే భళా చాంగు భళా చాంగు... భళా చాంగు భళా నా ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకళ ఫలాలన్నీ ఫలించేలా రావే పుష్పకళ నిను స్మరిస్తేనే నాలో స్వర్ణకళ తరంగంలా... తరంగంలా... రావే రావే... రావే రావే... విహంగంలా... విహంగంలా... చిత్రం : వర్ణ (2013) రచన : చంద్రబోస్ సంగీతం : హారీస్ జైరాజ్, గానం : ఎస్.పి.బాలు, బృందం నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
సాకీ: ఆమె: ఆలిండియాకే మంటపెట్టే ఐటం నేనురా నాయాంటెన్నాకే అంటుకోని సిగ్నల్లేదురా రయ్య ర య్య రయ్యా రయ్యా రయ్య రయ్య రయ్యా రయ్య ర య్య రయ్యా రయ్యా రయ్యా రయ్యా ॥ర య్య॥ పల్లవి : ఆ: మోస్టు వాంటెడు అందగత్తె నేను కంచు కత్తి నేను నా కంటిచూపుతో సునామీ పుట్టిస్తాను ॥ర య్య॥ మోస్టు వాంటెడు ఫేసుబుక్కు నేను మాసు లుక్కు నేను నా పైట చెంగులో దునియానే చుట్టేస్తాను ॥ర య్య॥ స్వీటు స్వీటుగున్న హాటు కేకు నేను చీమల్ని కోరే బెల్లం ముక్క నేను కోట్ల ఫ్యాన్సుకే డ్రీమ్ గర్ల్నయ్యాను తాడులేని ఆడ బొంగరం నేను మీసకట్టు చూసి నీకు పడ్డాను యాడికైన నన్ను ఎత్తుకెళ్లమంటాను ॥ర య్య॥ అతడు: మోస్టు వాంటెడూ ఈ అందగాడు నీకు అందనోడు నీనైసు గోకుడూ ఇష్టంలే వాట్ టూ డూ నీ కోక జారుడు ఎక్కినాది రోడ్డు అది వెరీ బ్యాడ్డూ నా ఫొటోఫ్రెములో నీ బొమ్మకు చోటేలేదు ॥ర య్య॥ చరణం : 1 ఆ: హే... మిడ్డీనా మెరిసే శారీనా ఏది నీకు ఇష్టమైన డ్రెస్సు అది కట్టుకొచ్చి ఇచ్చుకుంట కిస్సూ హే... ఇండోరా అదిరే ఔట్ డోరా ఏది నీకు ఇష్టమైన ప్లేసు చలో ఆడికెళ్లి చేసుకో రొమాన్సు అ: గ్లామరే మన బ్యాంకు బాలెన్సు ఇవ్వలేనె పోరి నీకు బ్లాంకు చెక్సూ టైము లాసు టాక్సుమాని పిండ్రాపు సెలైన్సుగుంటే బెస్టు ॥ర య్య॥॥వాంటెడు॥ చరణం : 2 ఆ: నే ఫుల్ మూను నువ్వే సన్షైను ఎంత బాగా మ్యాచయ్యిందో పెయిరు నాతో పెట్టుకోర ముద్దుగా ఎఫైరు నే ఐఫోను నువ్వే రింగుటోను ట్రింగు ట్రింగు మంది లవ్వు సీను ఎప్పుడెప్పుడెప్పుడంది హనీమూను అ: చాకొలెట్టు ఏజు చంటగాణ్ణి కాను ఐసుపెట్టి నాకు ఎయ్యమాకె లైను నాకు నేను సోలో మేను మీ ట్రిక్సు వర్కౌటు కానివ్వను ॥ర య్య॥॥వాంటెడు॥ చిత్రం : భాయ్ (2013), రచన : రామజోగయ్యశాస్త్రి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : నరేంద్ర, మమతా మోహన్‌దాస్ - నిర్వహణ: నాగేశ్ -
మరుమల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది!
తనను మోసం చేసి వెళ్లిపోయిన ప్రేయసిని గుర్తుచేసుకుంటూ ఓ భగ్న ప్రేమికుడు పాడుకునే పాట ఇది. ఎంతో లోతైన భావాన్ని అతి సరళమైన పదాలతో అల్లి... ఆ ప్రేమికుడి మనోభావాన్ని వ్యక్తపరచడంలో ఆరుద్రగారు తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు. గతం గతంలా ఉన్నప్పుడు... గడిచిపోయింది కదా అని మరచిపోవచ్చు. కాని అదే గతం నడుచుకుంటూ కళ్ళ ముందుకు వచ్చి జ్ఞాపకాలు అనే శూలాలతో గుండెల్లో పొడుస్తూంటే... ఆ ప్రేమికుడు పడే నరకయాతన ఎలా ఉంటుందో, పదాలతో కూర్చి, వాక్యాలుగా అమర్చి ఓ పాటలా మార్చినట్టుగా ఈ రచన మనకు అనిపిస్తుంది. చేయి జారిన మణిపూస చెలియ నీవు/ తిరిగి కంటికి కనబడతావు గాని చూపు చూపున తొలినాటి శోకవన్నె రేపుచున్నావు... ఎంతటి శాపమే... అనే వాక్యాలలో తనను కోరుకున్న హృదయం ఎంత విలవిలలాడుతుంద న్నది సాకీలో తన కలం ద్వారా ఆ బాధ స్వరాన్ని వినిపించారు కవి. ‘చూపు చూపున తొలినాటి శోకవన్నె రేపుచున్నావు’ అనే పద ప్రయోగమే ఆ బాధకు సాక్ష్యం. ఇక్కడ చేజారిన ప్రేయసిని మణిపూసతో పోల్చి ఆరుద్ర తన సాహిత్య బలాన్ని నిరూపించుకున్నారు. మరుమల్లియకన్నా తెల్లనిది/ మకరందం కన్నా తియ్యనిది/ మన ప్రణయం అనుకొని మురిసితిని/ అది విషమని చివరకు తెలిసినది... అనే పల్లవిలో మల్లెపువ్వు కన్నా తెల్లనైనదనుకున్న తన ప్రేమ, మకరందం కన్న తీయనైనదనుకున్న తన ప్రేమ, హలాహలం కన్నా చేదైనది అని తెలుసుకుని ఆ ప్రేమికుడు పడే వేదనేంటో ఈ పాట పల్లవిలో మనకు కనిపిస్తుంది. ప్రేమనేది తొలిచూపులో పుట్టినప్పటికీ అది ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా అందులోని మాధుర్యాన్ని ప్రేమికులకు పంచుతూ ఉత్తేజపరుస్తుంది. అలాగే అది వికటించినప్పుడు కూడా ఒక్కసారిగా కాకుండా విషంలా నెమ్మదిగా నరనరాల్లో ప్రవహించి క్షణక్షణం, ఆ హృదయాన్ని క్షీణింపజేసి మృత్యుతీరానికి తరలిస్తుంది. అందుకే ‘మన ప్రేమ విషమని చివరకు తెలిసినది’ అనే పదప్రయోగాన్ని కవి ఉపయోగించారు. ఒకసారి జతపడ్డ హృదయం ఎదుటివారు ఎంత వంచించినా, మోసం చేసినా సరే తనలోని ప్రేమని చంపుకోలేదు. ఇన్నాళ్ళ తమ సాంగత్యాన్ని ఓ తీయని జ్ఞాపకంగానో లేదా ఓ చేదు అనుభవంగానో గుర్తుచేసుకుంటూనే ఉంటుంది. అది ‘విడనాడుట నీకు సులభం/ నిను విడవదులే నా హృదయం’ అని కవి మొదటి చరణంలో రాసిన వాక్యంలో స్పష్టమౌతోంది. సిరిసంపదల మీద మోజుతో ప్రేయసి తనను మరిచిపోయి వెళ్ళిపోయినా... తన హృదయం మాత్రం... ఆమెను ఎప్పటికీ మరచిపోదు అని ప్రియుడి భావాన్ని ఆరుద్ర ఈ చరణంలో వ్యక్తపరిచారు. ఎంతో ఇష్టంగా అర్పించిన తన హృదయానికి బదులుగా ఆ ప్రేయసి కన్నీటిని బహుమానంగా ఇస్తే ఆ ప్రియుడు పడే వేదన అనంతం. అతని విరహపు హృదయానికి ఓదార్పు దొరకకపోయినా... నిట్టూర్పు మాత్రం మిగులుతుందని కవి ఈ చరణంలోనే వ్యక్తపరిచారు. మనిషికి మరణం ఉంటుంది కాబట్టి ఒక్కసారి తను మరణిస్తే అక్కడితో అతను అంతమైపోతాడు. కానీ మనసుకు మరణం ఉండదు. అందుకే అది తనువుని వీడినా, తనలోని ప్రేమను వీడదు. ఆ ప్రేమ ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. బహుశా ఈ తాత్పర్యాన్ని వివరించడానికే చెలి చేసిన గాయం మానదులే/ చెలరేగే జ్వాల ఆరదులే అనే వాక్యాన్ని ఆరుద్ర ఉపయోగించి ఉంటారని నా అభిప్రాయం. ఎన్నో కోట్ల ప్రేమ హృదయాలకు ఈ రచన ఓ కానుక... మరెన్నో కోట్ల కవి హృదయాలకు ఈ రచన ఓ స్ఫూర్తి. - సంభాషణ: నాగేశ్ భాషాశ్రీ స్వస్థలం విజయవాడ. చిన్నప్పటి నుండి సినిమా పాటలు వింటూ పెరిగారు. నీతోడుకావాలి (2002) చిత్రంలో అన్ని పాటలను రాసి తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. మీసాల గోపాల రారా రారా, నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్లను నమ్మొద్దు, ఇంతకూ నువ్వేవరూ, ప్యార్ మే పడిపోయా మై... వంటి హిట్ పాటలను రాసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. -
గీత స్మరణం
పల్లవి : ఆమె: చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ జోలపాట పాడేనూ లాలిపాట పాడేనూ చరణం : 1 అతడు: నీ ఒడిలో నిదురించీ తీయనీ కలగాంచీ పొంగి పొంగి పోయానూ పుణ్యమెంతో చేశానూ ఆ: నీ ఒడిలో నిదురించీ తీయని కలగాంచీ అ: పొంగి పొంగీ పోయానూ పుణ్యమెంతో చేశానూ ఏడేడు జన్మలకూ నాతోడు నీవమ్మా ఈనాటి ఈ బంధం ఏనాడు విడదమ్మా ఆ: అమ్మవలె రమ్మనగా పాపవలె చేరేవూ నా చెంత నీవుంటే స్వర్గమే నాదౌనూ అ: గాయత్రి మంత్రమునూ జపించే భక్తుడనే కోరుకున్న వరములనూ ఇవ్వకున్న వదలనులే చరణం : 2 ఆ: స్నానమాడి శుభవేళా కురులలో పువ్వులతో అ: దేవివలే నీవొస్తే నా మనసు నిలువదులే ఆ: అందాల కన్నులకూ కాటుకను దిద్దేనూ చెడుచూపు పడకుండా అదరు చుక్కపెట్టేనూ చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా అ: నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ ఆ: ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ అ: జోలపాట పాడేనూ ఆ: లాలిపాట పాడేనూ ఆ: జోలాలి... అ: జోలాలి... (2) ఇద్దరూ: జోజోజో... చిత్రం : భద్రకాళి (1977) రచన : దాశరథి సంగీతం : ఇళయరాజా గానం : జేసుదాస్, పి.సుశీల - నిర్వహణ: నాగేశ్ -
అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి...
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ‘బంగారు గాజులు’ చిత్రంలో డా॥సి.నారాయణరెడ్డి గారు రాసిన అన్ని పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అందులోని అన్నాచెల్లెళ్ల అనురాగానికి గీటురాయిగా నిలిచిన ‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి... కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది’ అనే పల్లవితో మొదలయ్యే గీతం... పల్లవిలోనే మన దేశంలోని గృహవ్యవస్థలోని ఆప్యాయతల్ని, అనుబంధాల్ని, అనురాగాల్ని ముఖ్యంగా మన దేశంలో అన్నాచెల్లెళ్ల బంధంలోని గొప్పతనాన్ని తెలియజేసే పాట. మన తెలుగు సినిమాల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధాలని తెలిపే పాటలు చాలా వచ్చినా ఈ పాట అప్పటికీ ఇప్పటికీ ఆ అనుబంధంలోని మాధుర్యాన్ని తెలిపే మధురగీతంగా నిలిచింది. చెల్లిని కంటికిరెప్పలా చూసుకొనే అన్న... ఆ అన్నయ్యను ఉద్దేశించి చెల్లి పాడే పాట. పల్లవిలో... నా అన్న నా వ ద్ద ఉంటే అదే గొప్ప నిధి, అదే తన సంపద... అంటుంది. ఆ తర్వాత చరణంలో ‘ఒకే తీగ పువ్వులమై ఒకే గూటి దివ్వెలమై/ చీకటిలో వేకువలో చిరునవ్వుల రేకులలో/ కన్నకడుపు చల్లగా కలసి మెలసి ఉన్నాము’ అనే వాక్యాల సారాంశం... తామిద్దరం ఒకే తల్లి కడుపులో పుట్టి, తల్లిదండ్రుల దీవెనతో సర్వకాల సర్వావస్థలయందు చల్లగా వర్థిల్లుతాం అని తెలుపుతుంది. ‘కలిమి మనకు కరువై నాకాలమెంత ఎదురైన/ ఈ బంధం విడిపోదన్న ఎన్నెన్ని యుగాలైన/ ఆపదలో ఆనందంలో నీ నీడగ ఉంటానన్న’ అంటూ సాగే ఈ రెండవ చరణంలో నేను బతికున్నంత కాలం నీ వెంట... సంపద ఉన్ననాడు కాని, లేనినాడు ఒకే రీతిగా ఉంటానంటూ... ఎన్ని కష్టాలొచ్చినా, కడగళ్లు ఎదురైనా, మన అనుబంధాన్ని ఎవ్వరూ వేరు చెయ్యలేరంటూ, నీవు నన్ను కంటికిరెప్పలా చూసుకుంటున్న విధంగానే, నేను కూడా నీకు అన్నివేళలలో నీడగానే ఉంటానంటూ.... తెలిపే ఈ గీతం ఈ నాటికీ మధురమే! ఈ చిత్రంలోని పాటలు ప్రసిద్ధి చెందడానికి కారణం ప్రముఖ సంగీత దర్శకులు కీ॥టి.చలపతిరావు అందించిన స్వరాలు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన చాలా చిత్రాలకు చలపతిరావు గారే స్వరాలందించడం విశేషం. అన్నయ్య సన్నిధి పాటకు సంబంధించి సినారె తన మనసులో ఊహించుకుని రాసిన ట్యూన్‌ని టి.చలపతిరావుగారికి వినిపిస్తే దానికి ఆయన ‘బాగానే ఉంది కాని... మనం మరోలా చేద్దాం’ అంటూ ఈ పాటను ఇప్పుడు మనం వింటున్న ట్యూన్లో చేశారట. ఆ కాలంలో హిందీ చిత్ర గీతాల్లో మకుటాయమానంగా నిలిచిన ‘చౌద్వీ కా చాంద్ హో..’ అనే పాట ట్యూన్‌ని యథాతథంగా కాకుండా, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ రాగ ఛాయలో ఈ పాటను స్వరపరిచినట్టు సినారె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ పాటలో చెల్లిగా నటించిన విజయనిర్మల, ఆ చెల్లెలిపై అంతే అనురాగం కలిగిన అన్నయ్య పాత్రలో అక్కినేని అభినయం అంతే అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూసిన వారికి తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకునే విధంగా ఉంటుంది ఇందులోని ఈ పాట. సాహిత్యం, సంగీతం చక్కగా కుదిరితే ఒక పాట ఎంత పాపులర్ అవుతుందో చెప్పడానికి ఈ పాట ఉదహరణ. ఇలాంటి విలువలు ఉన్న పాటలు ఇప్పుడు మన సినిమాలో లేకపోవడానికి మన విద్యావిధానం నుండి ‘నీతిశాస్త్ర’ పాఠ్యాంశాన్ని తీసివేయడం ఒక కారణం. నేటి మన చిత్రాల్లో కుటుంబ సంబంధాలు, వాటి విలువలకు సంబంధించిన అంశాలు మృగ్యమౌతుండడం వల్లనే నేడు ‘నిర్భయ, అభయ’ వంటి ఘోర సంఘటనలు సమాజంలో చోటుచేసుకుంటున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - మాస్టార్జీ సినీ గీతరచయిత సంభాషణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : B...H...A...I... భాయ్... చీకటి పడితే Playboy వీడు మాసు వీడు క్లాసు దొరబాబు of Dubai అటు గన్సూ ఇటు గర్ల్సూ మన కింగ్ డం డం మనదే వయొలెన్సూ రొమాన్సూ టూ ఇన్ వన్ ఫన్ మనదే ైెహ ఫైగా గాల్లో తేలే సొమ్ముందే వైఫైలో ప్రాణం తీసే దమ్ముందే సూర్యుళ్లా డేటైం బ్యూటీ షూటౌటే చంద్రుళ్లా నైట్ టైం పక్కా ఛిల్ ఛిల్ ఛిల్ ఛిల్ ఛిల్లౌటే ॥B...H...A...I...॥ చరణం : 1 చీకటి పడితే చాలు నా బుల్లెట్లన్నీ పూలు ఇది భాయీ స్టైల్ నట్టింట్లో స్విమ్మింగ్ పూలు ఫుల్ వెన్నెల్లో జలకాలు విత్ కన్నెందాలు ఎవ్రీడే ధంధా ఆఫ్ కోర్స్ మామ్మూలే నౌ ఎండ్ దెన్ కొంచెం రీఛార్జ్ క క్క క్క క్క కావాల్లే ॥B...H...A...I...॥ చరణం : 2 గాడ్ బ్లెస్ యు మై ఎనిమీసూ నాకెదురొస్తే నో చాన్సూ మీ టిక్కెట్ కన్ఫర్మ్ గురిపెట్టానో నా లెన్సూ ఇక కౌంట్ డౌనే మీ డేసూ మీ బతుకే భస్మం రివాల్వర్ మేరా ప్యారా ట్విన్ బ్రదర్ వాటెవర్ నాలో సత్తా నా నా నా నా గాడ్ ఫాదర్ ॥B...H...A...I...॥ చిత్రం: భాయ్ (2013) రచన: రామజోగయ్యశాస్త్రి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ గానం: సుచిత్ సురేశన్ నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : ఆమె: రాంసక్కనోడే చుక్కల్లో చందూరూడే లవ్ మాస్టర్లా గుండెల్లో పోస్టర్ వేసేశాడే ॥ అతడు: హే... వెనీలా పిల్లా పిల్లా టైటానిక్ హీరోయిన్లా అందాల మత్తిచ్చి హైజాక్ చేస్తే ఎల్లా ఆ: గ్లామర్‌లో బిర్లా బిర్లా రొమాంటిక్ ఏరోప్లేన్లా అమాంతం గుండెల్లో ఎటాక్ చేస్తే ఎల్లా అ: లూజ్ కంట్రోల్ అనేలా నా మనసుకు నువ్వే టకీలా ఆ: గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా నీ కన్నెదురున్నా కూకీలా అ: నీ చెంప డింపుల్లో సెటిలయిపోతా ఇవ్వాళ ॥పిల్లా పిల్లా॥॥ చరణం : 1 అ: ఏం తిని పెంచిన యవ్వనమే ఇది ఎడాపెడా అదిరిందే మక తికా మకా పెరిగిందే ఆ: కమాన్ కమాన్ పురుషా కలిసినది అమీతుమీ వరసా అ: నీ కొనచూపుల తాకిడిలో మది కసాబిసా కదిలిందే తెగ ఎగాదిగా నలిగిందే ఆ: కమాన్ కమాన్ మదనా పిలిచినది యమ్మీ యమ్మీ పులస అ: ఏం మేగ్నెట్టో ఏం టాలెంటో రెండేసి కళ్లేసి వలేసి లాగావే హంసా ॥పిల్లా పిల్లా॥ చరణం : 2 అ: న్యూటను ఎరుగని యాపిలువై నువు ఒళ్లోకిలా ఫ్రీ ఫాలింగ్ నా మనస్సుకే స్పిన్ బౌలింగ్ ఆ: హల్లో హల్లో డార్లింగ్ అందుకో జిగేల్ జిగేల్ సంథింగ్ అ: నాసా చూడని ప్లానెటువై నా చుట్టూ చెలీ నీ రోమింగ్ ఫుల్ ఘుమా ఘుమా పెర్ఫ్యూమింగ్ ఆ: చలో చలో మై కింగ్ చనువుగా చేస్తా పదా డేటింగ్ అ: నా గుడ్‌మార్నింగ్ నా గుడ్నైటింగ్ ఏదైనా నువ్వేలే ఎన్నాళ్లు నాకింక వెయిటింగ్ ॥పిల్లా పిల్లా॥॥ చిత్రం : భాయ్ (2013) రచన : రామజోగయ్యశాస్త్రి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : డే విడ్ సిమోన్, రీటా నిర్వహణ: నాగేష్ -
వేదమంత్రంలాంటి పల్లెపాట!
‘విశ్వ శ్రేయస్సే కావ్యం’ అనేది అపురూపమైన అమృతమయమైన నానుడి. ఈ ప్రపంచంలో ఏ కవిత్వమైనా ప్రజలకు... ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయాన్ని నవరసభరితంగా వివరించి సార్థకమౌతుంది. అనాదిగా ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్న లెక్కలేనన్ని సమస్యల్లో అన్నిటికన్నా అతిముఖ్యమైనది స్త్రీపురుషుల నడుమ నడుస్తున్న ‘ప్రేమ-పెళ్లి’ అని నా అభిప్రాయం. శకుంతల దుష్యంతుల కాలం నుండి, నేటి వరకు ఈ సమస్య అంతటా ఉన్నదే. స్త్రీపురుష సంబంధాలను, సక్రమమార్గంలో నడిపించే పంథాలో కొసరాజుగారు రచించిన ‘మంచిమనసులు’ చిత్రంలోని ‘మావా... మావా...’ అనే పాట ఇందుకు మంచి ఉదాహరణ. ‘తప్పు... తప్పు...’ అనే రెండక్షరాలతో ప్రారంభమయ్యే ఈ పాట, ‘ప్రేమ’ అనే రెండక్షరాలకు మార్గనిర్దేశం చేస్తూ, మంచిచెడులను తెలియజెబుతుంది. మావా! మావా! మావా!... ఏమే ఏమే భామా... అనే పల్లవిలోని పిలుపులు... పల్లె వాతావరణానికి చెందిన యువతీయువకులలో అల్లుకున్న అనురాగానికి అద్దం పడతాయి. పట్టుకుంటె కందిపోవు పండువంటి చిన్నదంటె/చుట్టు చుట్టు తిరుగుతారు మరియాదా... అనే వాక్యాలలో అలతి అలతి పదాలతో సాగిన కొసరాజుగారి రచన అమ్మచాటున ఉన్న అమ్మాయి మనసులోని భావాలను అభివ్యక్తం చేస్తుంది. అలాగే తాళి కట్టకుండ ముట్టుకుంటె తప్పుకాదా... అనే వాక్యంలో అమ్మాయికి, అబ్బాయికి మధ్య ఉండవలసిన హద్దును నిర్దేశిస్తుంది. నీవాళ్లు మావాళ్లు రాకనే/ మనకు నెత్తి మీద అక్షింతలు పడకనే/ సిగ్గుమాని ఒకరినొకరు సిగలు పూలు పెట్టుకుని/ టింగురంగమంటు ఊరు తిరగవచ్చునా/ లోకం తెలుసుకోక మగవాళ్లు మసలొచ్చునా... అనే చరణం... వైవాహిక సంబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. పడుచుపిల్ల కంటబడితె వెంటపడుదురు/ అబ్బో వలపంతా ఒలకబోసి ఆశపెడుదురు/ పువ్వు పువ్వు మీద వాలు పోతు తేనెటీగ వంటి మగవాళ్ల జిత్తులన్ని తెలుసులేవయ్యా/ మీ పుట్టు పూర్వపు కథలన్ని విన్నామయ్యా... అనే వాక్యాలలో అబ్బాయిలను తేనెటీగలుగా, అమ్మాయిలను పువ్వులుగా పోల్చడం... కవికుల గురువు కాళిదాసు కవిత్వ ప్రభావం ఉందనే విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అభినవ మధులోలుపస్త్వం తథా పరిచుంబ్యచూతమంజరీం కమల వసతిమాత్ర నిర్వృతో మధుకర విస్మృతోస్యేనాం కథం! ఈ శ్లోకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనే నాటకంలోనిది. ఓ మధుకరమా! కొత్త కొత్త తేనె కోసం అంగలార్చే నీవు అప్పుడు తియ్యమావిడి మొగ్గను అలా ఆస్వాదించి పువ్వు మోజులో పడి ఎలా మరిచిపోయావు. ఈ భావాలను ప్రతిబింబించేలా ఈ పాట సాగింది. పై చరణంలో మాటలలో ఎంత నిజం దాగి ఉందో, ఎవ్వరికీ తెలియనిది కాదు. అవి అక్షరసత్యాలు. ఈ చరణం చివరిలో వ చ్చే మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అతఃపరీక్ష్య కర్తవ్యం విశేషాత్ సంగతం రహః! అజ్ఞాత హృదయేష్వేవం వైరీభముసౌహృదం! ‘అభిజ్ఞాన శాకుంతలం’లో దుష్యంతుడు శకుంతలను గర్భవతిని చేసి, ఆ తరవాత ఆమె ఎవరో తెలియదని నిరాకరించినప్పుడు, గుండెలు పగిలేలా ఏడ్చే శకుంతలను చూచి, కణ్వముని చెప్పే మాటలవి. ‘ఏడువు... ఇంకా బాగా ఏడువు... ముందే ముందు వెనుకలు బాగా ఆలోచించి ప్రేమించాలి. అందులో స్త్రీ పురుషులు ఏకాంతంలో ఒకటయ్యే విషయాన్ని ఇంకా ఇంకా బాగా ఆలోచించాలి. హృదయాలను తెలియకుండా ప్రేమిస్తే ఆ ప్రేమే శత్రువు అవుతుంది’ అని భావం. ఎంతో హృద్యంగా, గంభీరంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో సాగే ఈ పాట, కొసరాజుగారి కవితాజ్యోత్స్న కమనీయం. కళ్యాణ రమణీయం. కొత్త కొత్త మోజుల్ని కోరువారు/ రోజూ చిత్రంగ వేషాలు మార్చువారు/ టక్కరోళ్లుంటారు టక్కులు చేస్తుంటారు/ నీవు చెప్పే మాట కూడ నిజమేనులే/ స్నేహం దూరంగా ఉన్నపుడే జోరౌనులే ... అనే మాటలు ఈ పాటలో పురుషుని అతి వేగానికి కళ్లెం వేసేవిగా పెంచి పెద్దజేసే ఒక పెద్ద దిక్కులా ఉన్నాయి. కట్టుబాటు ఉండాలి గౌరవంగ బ్రతకాలి/ఆత్రపడక కొంతకాలమాగుదామయ్యా... ఎంత గొప్పగా ఉన్నది వేదమంత్రంలా ఈ పాట. ‘భళ్లున పెళ్లయితే ఇద్దరికీ అడ్డులేదయ్యా’ అనే ఈ వాక్యం స్త్రీ పురుషులకు రెండు కళ్లుగా వందేళ్లు మంచిదారిలో నడిపే విధంగా ఉన్నాయి. ఇటువంటి పాట ఎటువంటి ప్రేమికులనైనా ఒక ఇంటి వాళ్లను చేసేదాకా విశ్రమించదు కదా! - సంభాషణ: నాగేష్ -
గీత స్మరణం
ఐ హేట్ లవ్ స్టోరీస్... అందానికి నే దీవానా వీకెండ్ ప్రేమంటే... ముందుంటానే హసీనా ఐ హేట్ లవ్ స్టోరీస్... పెయిన్ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ Oh rum and rise and shine... Wanna won and women and wine Dabadeee dabadeee dabadeee bo Everyday is mine oh mine Life is just too short Go give it all you got no matter where you touch me I am hot right at the spot డాలర్‌నే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా కలలన్నీ నే కొంటున్నా ఆశలపై విసిరేస్తున్నా ॥Oh rum॥ సంతోషం ఒళ్లో తేలేదే ఈ జమానా ప్రేయసి ప్రేమైనా రేపటికేలే పురానా లీగల్ ప్రేమంటే షాదీ అని నేనంటున్నా ॥Oh rum॥ ఆనందం అంచుల పైన తేలడమే లైఫంటున్నా వేగంలో కాలం కన్నా ముందే ఉండాలంటున్నా ॥Oh rum॥ చిత్రం : గ్రీకువీరుడు (2013) రచన : కృష్ణచైతన్య సంగీతం : ఎస్.ఎస్.థమన్ గానం : నవీన్ మాధవ్, రంజిత్ నిర్వహణ: నాగేష్ -
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా!
శ్రీకృష్ణపాండవీయం (1966) చిత్రంలో భీముడు ఒక సన్నివేశంలో నిద్రపోతూ వుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి, భీముడిని మేల్కొలిపి, కౌరవుల నుండి రాబోయే ప్రమాదాన్ని జాగ్రత్తగా ఎదుర్కోవాలని తెలియజేసే గీతం ‘మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా’... నాకు నచ్చిన పాటల్లో ఇది ఒకటి. ఈ మాటలు ఆ సందర్భంలో చెప్పించిన దర్శకుడు ఎన్టీఆర్. మహాకవి కొసరాజు... భగవద్గీత సారాన్ని, భర్తృహరి సుభాషితాల సారాన్ని కలగలిపి మనకు అందించారు. అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి/ అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి/ ముందుచూపు లేనివాడు ఎందునకూ కొరగాడు/ సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు... ఈ నాలుగు వాక్యాలూ సగటు మనిషి నుంచి ప్రధాన మంత్రి, అమెరికా అధ్యక్షుడు వరకూ అందరికీ ఉపయోగపడేవే. ఏ వివరణలూ, వ్యాఖ్యానాలూ లేకుండానే సూటిగా మనసులో నాటుకునే సుభాషితాలివి. పాటను రాసిన కొసరాజుగారి సంస్కారం, దూరదృష్టి అద్భుతం. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా/ ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా... అనే పల్లవిలో ప్రతివాడూ ఏదో ఒక మత్తులో ఉంటాడు. అది నిద్దురమత్తు కావచ్చు. డబ్బు, అధికారం, దుర్వ్యసనాలు ఏవైనా కావచ్చు. లౌకికంగా, ఆధ్యాత్మికంగా అహంకార మమకారాలు కూడా మత్తే. మూఢభక్తి, సోమరితనం కూడా ఈ కోవలోకే వస్తాయి. వీరందరూ పొద్దున్నే లేస్తూనే ఈ పాటవినాలి. మొహం కడుక్కుంటూ వినాలి. స్నానం చేశాక దేవుడి పూజకి ముందు వినాలి. ప్రయాణం చేసేటప్పుడు వినాలి. ఉద్యోగస్తులు ఆఫీసులోకి వెళ్లే ముందు విని తీరాలి. మధ్యాహ్నం ఎప్పుడు కునుకు తీయాలనిపించినా సెల్ఫోన్లో రికార్డు చేసుకుని వినాలి. లేకపోతే జీవితమంతా గమ్మత్తుగా చిత్తవుతారని కొసరాజు గారి హెచ్చరిక. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు/ మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు అనే వాక్యాలను... ఆయువు నూరు వత్సరములందు గతించు సగంబు నిద్రచే ఆ యరలో సగంబు గతమయ్యెడు బాల్యజరాప్రసక్తిచే పాయక తక్కినట్టి సగపాలు గతించు ప్రయాసవృత్తిచే... అనే భర్తృహరి పద్యంలోని భావాన్ని ఇలా మలచారు ఈ పాటలో కొసరాజు. అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు/ పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతాడు... అతి నిద్రవల్ల, మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల తనకు భగవంతుడు ఇచ్చిన శక్తిని తెలుసుకోలేక, తెలిసినా సద్వినియోగం చెయ్యలేక అనవసరంగా చెడిపోతారని హెచ్చరించారు కొసరాజు. ఇక్కడ ‘వ్యర్థంగా చెడతాడు’ అనే వాక్యం లోతు వివేకవంతుడే కొలవగలడు. తనకున్న గొప్పశక్తిని అల్పమైన విషయాలకు ఉపయోగించి వాటిల్లో విజయాలు పొందుతూ, ఆ కొద్దిపాటి విజయాలనే ఆస్వాదిస్తూ దశాబ్దాల తరబడి అలాగే జీవిస్తూ కారణజన్ములమనుకోవడమే వ్యర్థంగా చెడిపోవడం. సాగినంతకాలము నా అంతవాడు లేడందురు/ సాగకపోతే ఊరక చతికిలపడిపోదురు... ఈ వాక్యాలు ప్రముఖ రంగాలలోని పెద్దలకు, సామాన్యులకు వర్తిస్తాయి. చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా/ పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా... ఈ వాక్యాలను ప్రతి ఒక్కరూ నిత్యం మననం చేసుకోవాలి. చివరగా భగవద్గీతలోని ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’, ‘యోగక్షేమం వహామ్యహం’ వంటి శ్లోకపాదాల భావాలతో ‘కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు’ అని ధైర్యాన్ని కలిగిస్తూ... ‘చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం’ అని తన మార్కు వ్యంగ్యాన్ని కూడా చాటారు కొసరాజు. ఆ మహాకవికి, క్రాంతి దర్శియైన దర్శకుడు ఎన్టీయార్‌కి, దివ్యచైతన్యాన్ని ఈ కలిగించే గీతానికి నా నమస్కారాలు. - సంభాషణ : నాగేష్