- గుండెపోటుతో తనువు చాలించిన తండ్రి
-పరీక్ష పూర్తయ్యాకే కుమార్తెకు విషయం చెప్పిన బంధువులు
-రంగారెడ్డి జిల్లా తూంకుంట జెడ్పీ పాఠశాల వద్ద ఘటన
శామీర్‌పేట్
కూతురును పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సైకిల్‌పై తీసుకువచ్చిన ఓ తండ్రి పాఠశాల వద్ద గుండెపోటుకు గురై కానరాని లోకాలకు తరలివెళ్లాడు. పరీక్ష పూర్తయ్యాకే కుమార్తెకు బంధువులు విషయం తెలిపారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ వుండలం తూంకుంట జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. మేడ్చల్ వుండలం గుండ్లపోచంపల్లి ప్రాంతానికి చెందిన దొవ్ము నాగేశ్(45), లక్ష్మి దంపతులు. వీరికి నలుగురు సంతానం. రెండో కూతురు దుర్గ ఇటీవల పది పరీక్షల్లో తప్పింది. దీంతో నాగేశ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం బుధవారం సైకిల్‌పై కూతురును శామీర్‌పేట్ వుండలం తూంకుంట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సెంటర్‌కు తీసుకొచ్చాడు. కుమార్తెను దించేసిన అనంతరం ఆయాసం అనిపించడంతో కింద కూర్చునే యత్నం చేశాడు.
అంతలోనే ఛాతీలో నొప్పి వచ్చిందని అక్కడే కుప్పకూలిపోయాడు. విషయుం గవునించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నాగేశ్ మృతిచెందాడని నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రికి తీసుకొని మృతదేహాన్ని తీసుకెళ్లారు. అయితే, పరీక్ష రాసేందుకు వచ్చిన దుర్గకు తన తండ్రి గుండెపోటుతో మృతిచెందిన విషయాన్ని బంధువులు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. పరీక్ష పూర్తయ్యాక విషయం తెలుసుకున్న దుర్గ రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.