భద్రకాళి చెరువు మరమ్మతుకు అదనపు నిధులు మంజూరు
Published Sun, Sep 25 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
వరంగల్: భద్రకాళి చెరువు మరమ్మతు పనులకు అదనపు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిషన్ కాకతీయ ఫేజ్- 2లో చెరువు మరమ్మతులకు రూ405.10 లక్షలు కేటాయించింది. కాగా అదనంగా పనుల కోసం ఇంజినీర్లు ప్రతిపాదించడంతో రూ.57.70 లక్షలను కేటాయించింది. దీంతో ఈచెరువుకు ఇప్పటిదాకా మొత్తం రూ.4.62 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే చేపట్టిన పనుల్లో ఎలాంటి పూడికతీతలు చేపట్టలేదు. ఈ అదనపు నిధులతో ఏయే పనులు చేపడతారనేది వేచి చూడాలి.
Advertisement
Advertisement