నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
-
భద్రకాళికి కిరీటం సమర్పించనున్న సీఎం
-
ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం కడియం
వరంగల్ : సీఎం కేసీఆర్ ఆదివారం జిల్లాకు రానున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి జిల్లాకు వచ్చి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో బిజీగా ఉన్న మఖ్యమంత్రి శనివారం రాలేకపోయారు. అంతేకాకుండా ప్రభుత్వం తరఫున బంగారు కిరీటం సమర్పిం చేందుకు వెళ్తున్నందున ముందురోజు వెళ్లకుండా అమ్మవారికి ధరింపజేసే రోజున వెళ్లాలని పండితులు సూచించిన మేరకు కార్యక్రమంలో మార్పు జరిగినట్లు సమాచారం.
ఈమేరకు సీఎం కేసీఆర్ దంపతులు ఆదివారం ఉదయం 9.30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మై దానంలో ఉదయం 10.15గంటలకు దిగుతా రు. అక్కడ నుంచి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు.
అనంతరం 10.40గంటలకు భద్రకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బంగారు కిరీట ధారణ చేస్తారు. మధ్యాహ్నం 12గంటల వరకు భద్రకాళి ఆలయంలో ఉంటారు. అక్కడి నుంచి మళ్లీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుని భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2గంటలకు కెప్టెన్ ఇంటి నుంచి బయలుదేరి ఆర్ట్స్ కాలేజీకి వచ్చి 2.10గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.