ఐకానిక్ లాల్‌బాగ్చా రాజా వినాయకుడికి, అనంత్‌ అంబానీ బంగారు కానుక | Vinayaka Chavithi 2024: Anant Ambani Donates 20kg Gold Crown To Mumbai Lalbaugcha Raja, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఐకానిక్ లాల్‌బాగ్చా రాజా వినాయకుడికి, అనంత్‌ అంబానీ బంగారు కానుక

Published Fri, Sep 6 2024 4:32 PM | Last Updated on Fri, Sep 6 2024 5:46 PM

  Vinayaka Chavithi 2024 Anant Ambani donates Gold Crown To Lalbaugcha Raja

గణేష్‌ ఉత్సవాలకు మహారాష్ట్రలోని ముంబై నగరం పెట్టింది పేరు. అందులోనూ ముంబైలోని ఐకానిక్ లాల్‌బాగ్చా రాజా వినాయక ఉత్సవం మరింత స్పెషల్‌గా  ఉంటుంది. ఇప్పటికే లాల్‌బాగ్చా రాజా వినాయకుడి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తాజాగా  పారిశ్రామిక వేత్త ముఖేష్‌ అంబానీ, గణనాథునిపై తమ భక్తిని, గౌరవాన్ని మరోసారి ఘనంగా చాటుకున్నారు. ముఖ్యంగా అనంత అంబానీ, రాధిక వివాహం తర్వాత తొలి వినాయక చవితి కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

నవ వరుడు అనంత్‌ అంబానీ ముంబైలోని వినాయకుడికి ఘనమైన కానుకను బహూకరించారు.  20 కేజీల బంగారు కిరీటాన్ని గణేషుడికి బహుమతిగా ఇచ్చారు. దీని  విలువ  రూ.15 కోట్లు. ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు కమిటీ వెల్లడించింది.  సంప్రదాయ మెరూన్  కలర్‌ దుస్తుల్లో విలువైన ఆభరణాలకు తోడు ఈ  ఏడాది బంగారు కిరీటంతో భక్తుల పూజలందుకోనున్నాడు గణేశుడు.

కాగా 'కింగ్ ఆఫ్ లాల్‌బాగ్' అని పిలిచే లాల్‌బాగ్చా రాజా ముంబైలో అత్యధికంగా సందర్శించే గణేష్ మంటపం. ప్రతీ సంవత్సరం  వేలాది మంది భక్తులు  తరలివస్తారు.  గత  పదిహేనేళ్లుగా అనంత్ అంబానీ లాల్‌బాగ్చా రాజా కమిటీకి మద్దతుగా నిలుస్తున్నారు అనంత్‌ అంబానీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement