cop role
-
తగ్గేదే లే అంటూ తుపాకీ పట్టారు..
నాలుగు పాటలు.. కొన్ని కబుర్లు... ఎప్పుడూ ఇవేనా? ఇంకేదో చేయాలి. కానీ చాన్స్ రావాలి కదా! ఆ భలే చాన్స్ వస్తే.. సత్తా చూపిస్తాం అంటారు కథానాయికలు. ఇప్పుడు కొందరు తారలు గ్లామర్‌ని పక్కన పెట్టారు. అందంగా మాత్రమే కాదు.. పవర్‌ఫుల్‌గా కనిపించడానికి రెడీ అయ్యారు. తుపాకీ పట్టారు. ప్రేక్షకుల మనసులను గెలుచు కోవడానికి గురి పెట్టారు. ఇప్పటివరకూ యాభైకి పైగా సినిమాలు చేశారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. గ్లామర్ సెక్షన్లో ఉన్న అన్ని రకాల పాత్రలు పోషించారు. అయితే కాజల్ ఇప్పుడు రూట్ మార్చారు. సీరియస్ పాత్రలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. తన తాజా చిత్రంలో కాజల్ అగర్వాల్ ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా నటించనున్నారు. నాగార్జున హీరోగా నటించనున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు కాజల్. ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చేయనున్నట్లు ఓ సందర్భంలో కాజల్ వెల్లడించారు. అలాగే తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 2014లో తమిళంలో వచ్చిన విజయ్ ‘జిల్లా’లో కాజల్ పోలీసాఫీసర్‌గా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ‘విరాటపర్వం’ కోసం ఉద్యమకారులుగా అక్రమాలపై తుపాకీతో గురి పెట్టారు ప్రియమణి, నందితా దాస్. ఈ చిత్రంలో కామ్రేడ్ భారతక్క పాత్రలో కనిపించనున్నారు ప్రియమణి. నందితా దాస్ కూడా ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ ఇద్దరూ అడవుల్లో తుపాకీ పట్టుకుని తాము నమ్మిన సిద్ధాంతాల కోసం వెండితెర ‘విరాటపర్వం’లో పోరాటం చేస్తారు‡. అలాగే ఈ సినిమాలోని పాత్రలకు తగ్గట్లుగా డీ గ్లామరస్‌గా కనిపిస్తారు ప్రియమణి, నందితా దాస్. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో గ్లామరస్ హీరోయిన్గా ప్రేక్షకుల్లో పాయల్ రాజ్‌పుత్‌కు మంచి పేరు వచ్చింది. అయితే తాను గ్లామరస్ పాత్రలు మాత్రమే కాదు.. పవర్ఫుల్ రోల్స్ కూడా చేయగలనని అంటున్నారు పాయల్. అందుకు నిదర్శనంగా పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం చేస్తున్న ‘5 డబ్ల్యూస్ (హూ, వాట్, వెన్, వేర్, వై) చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఇందులో వపర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు పాయల్. ఈ పాత్ర కోసం తాను ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు పాయల్ చెబుతున్నారు. అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌ను పాయల్ డూప్ లేకుండా చేశారట. ప్రాణదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘బ్లఫ్‌మాస్టర్’, ‘కల్కి’ వంటి సినిమాల్లో గ్లామరస్ అండ్ గాళ్ నెక్ట్స్ డోర్ వంటి పాత్రలకే పరిమితమైన హీరోయిన్ నందితా శ్వేత తన తాజా చిత్రం ‘ఐపీసీ 376’ కోసం లాఠీ పట్టారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఫస్ట్ టైమ్ ఓ పవర్ఫుల్ పాత్రలో నటించనుండటంతో నందితా శ్వేత బాగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని రామ్‌కుమార్ సుబ్బరామన్ డైరెక్ట్ చేస్తున్నారు. కెరీర్లో యాభైకి పైగా సినిమాలు చేసినప్పటికీ రాయ్‌లక్ష్మీ పేరు చెప్పగానే గ్లామరస్ హీరోయిన్ అనేస్తారు చాలామంది. కానీ రాయ్‌లక్ష్మీ ఇప్పుడు గేర్ మార్చారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు యాక్షన్ మూవీస్‌కు కూడా పచ్చజెండా ఊపుతున్నారు. కన్నడ ‘ఝాన్సీ ఐపీఎస్’ చిత్రంలో రాయ్‌లక్ష్మీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఎప్పుడూ గ్లామరస్‌గా కనిపించే కథానాయికలకు ఇలాంటి పాత్రలు ఓ సవాల్. తగ్గేదే లే అంటూ తుపాకీ పట్టారు. ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
నాగచైతన్య సాహసం.. ఆ పాత్రలో తొలిసారి
హీరో నాగచైతన్య, దర్శకుడు తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ రోల్ చేయనున్నారన్నది తాజా సమాచారం. ఇంతకుముందు ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో కొద్దిసేపు పోలీస్ ఆఫీర్‌గా కనిపించారు నాగచైతన్య. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తారట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా చేస్తున్నారు నాగచైతన్య. అలాగే వీరిద్దరి కాంబినేషన్లోనే హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ వెబ్ సిరీస్ రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇక నాగచైతన్య హీరోగా నటించిన ‘లవ్‌స్టోరీ’ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. చదవండి: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య! నాకూ ఫ్యాన్స్ ఉంటారని ఊహించలేదు -
ఖాకీగా విజయ్ ఆంటోని
సాక్షి, చెన్నై : బిచ్చగాడుగా అలరించిన విజయ్ ఆంటోని ద్విభాష చిత్రం రోషగాడులో పోలీస్‌గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తమిళంలో ఈ మూవీ తిమిరుపుదిచవన్గా తెరకెక్కనుంది. నంబియార్ ఫేమ్ గణేష దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఈ మూవీకి విజయ్ ఆంటోనీ స్వయంగా స్వరాలు సమకూర్చనున్నాడు. చిత్ర మేకర్లు ఇటీవలే మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అయితే హీరోయిన్ సహా ప్రధాన తారాగణం వివరాలను ఇంకా చిత్ర బృందం ప్రకటించలేదు. కృతుంగా ఉదయనిధి డైరెక్షన్లో తెరకెక్కిన కాశీ మూవీ షూటింగ్‌ను ఇటీవలే ముగించుకున్న విజయ్ ఆంటోని రోషగాడు సెట్లో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. కాశీ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీలో విజయ్ ఆంటోని సరసన అంజలి, సునయన ఆడిపాడారు. -
పోలీసు పాత్రలో శర్వా.. ఫస్ట్ లుక్ విడుదల
గమ్యం, రన్ రాజా రన్ లాంటి సినిమాలలో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్.. ఈసారి ఓ పోలీసు పాత్ర పోషిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి బ్రేక్ సాధించిన లావణ్య త్రిపాఠీ అతడి సరసన నటిస్తోంది. ఈ సినిమాలో శర్వా ఫస్ట్ లుక్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా విడుదలైంది. విజయవంతమైన భారీ చిత్రాల నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇన్ని విశేషాలున్న ఈ సినిమాకు ఇంకా పేరు మాత్రం ప్రకటించలేదు. సినిమా తొలి షెడ్యూలు షూటింగ్ కూడా పూర్తయింది. ఈనెల 15వ తేదీ నుంచి రెండో షెడ్యూలు షూటింగ్ కొనసాగుతోంది. ఈ విషయాలను మరో అగ్ర నిర్మాత మహేష్ కోనేరు తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాతో చింతాడ చంద్రమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: రతన్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ. Sharwanand - BVSN film has completed it's first schedule..Second schedule from 15th.. Here is the superb first look pic.twitter.com/5eV8xRdZlD — Mahesh S Koneru (@smkoneru) 10 June 2016 -
మిస్టర్ పోలీస్.. యు ఆర్ అండర్ అరెస్ట్!
ఓ వ్యక్తి మళయాళం సినిమాలో పోలీసు పాత్ర పోషిస్తున్నాడు. లాఠీని చేతుల్లో పట్టుకుని.. మంచి సీరియస్‌గా డైలాగులు చెబుతున్నాడు. అంతలో అక్కడకు నిజం పోలీసులు వచ్చారు. ''మిస్టర్ పోలీస్, యు ఆర్ అండర్ అరెస్ట్'' అంటూ అతగాడి డైలాగులు తామే చెప్పి, అతడిని లాక్కెళ్లి జీపులో వేసుకుని తీసుకెళ్లిపోయారు. అదేంటని అంతా అవాక్కయ్యారు. విషయం ఏమిటంటో ఓ దాడి కేసులో ప్రధాన నిందితుడైన సంతోష్ అనే ఆ వ్యక్తి గత తొమ్మిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. 2006 సంవత్సరంలో కుమారపురం ప్రాంతంలో 15 ఏళ్ల కుర్రాడిపై అతడు దాడి చేశాడు. ఓ కత్తి, ఐరన్ రాడ్‌తో కుర్రాడిని చంపేందుకు కూడా అతడు ప్రయత్నించాడు. తర్వాత మళయాళ సినీ పరిశ్రమలో చేరిన అతడు.. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చాడు. రాష్ట్ర సచివాలయంలో సినిమా షూటింగ్ జరుగుతుండగా, అక్కడే ఉన్న పోలీసులు తమ పాత నేరస్థుడు పోలీసు దుస్తుల్లో ఉన్నా కూడా గుర్తించి.. వెంటనే వచ్చి అతగాడిని అదుపులోకి తీసుకున్నారు. -
గ్లామర్ బాట వీడి.. ఖాకీ దుస్తుల్లో నమిత
ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో దర్శనమిచ్చే దక్షిణాది నటి నమిత ఈ సారి రూట్ మార్చారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రూపొందిస్తున్న ఓ సినిమాలో తొలిసారి ఖాకీ దుస్తుల్లో కనిపించనున్నారు. ఐటం సాంగ్స్‌లోనూ చిందులేసిన నమిత తాజా చిత్రంలో ఫైట్లు కూడా చేస్తున్నారు. 'ఇలామై ఓంజాల్' అనే సినిమాలో పోలీస్ అధికారిణి పాత్రలో నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందని నమిత సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లో నటించే తనకు సుదీర్ఘ కాలం తర్వాత విభిన్న పాత్ర పోషించే అవకాశం వచ్చిందని చెప్పారు. 'ఈ సినిమాలో తొలుత ఓ హీరోయిన్ పాత్రను ఆఫర్ చేశారు. అయితే సత్తా ఉన్న పాత్రలో నటించాలనే ఉద్దేశంతో తిరస్కరించా. దీంతో ఖాకీ దుస్తులు ధరించే అవకాశం వచ్చింది. ఇక మీదట గ్లామర్ పాత్రల్లో నటించాలని భావించడం లేదు. మంచి పాత్రల కోసం అన్వేషిస్తున్నా' అని నమిత చెప్పారు.