పోలీసు పాత్రలో శర్వా.. ఫస్ట్ లుక్ విడుదల | Sharwanand dons a cop, first look released | Sakshi
Sakshi News home page

పోలీసు పాత్రలో శర్వా.. ఫస్ట్ లుక్ విడుదల

Published Fri, Jun 10 2016 3:38 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

పోలీసు పాత్రలో శర్వా.. ఫస్ట్ లుక్ విడుదల

పోలీసు పాత్రలో శర్వా.. ఫస్ట్ లుక్ విడుదల

గమ్యం, రన్ రాజా రన్ లాంటి సినిమాలలో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్.. ఈసారి ఓ పోలీసు పాత్ర పోషిస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి బ్రేక్ సాధించిన లావణ్య త్రిపాఠీ అతడి సరసన నటిస్తోంది. ఈ సినిమాలో శర్వా ఫస్ట్‌ లుక్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా విడుదలైంది. విజయవంతమైన భారీ చిత్రాల నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇన్ని విశేషాలున్న ఈ సినిమాకు ఇంకా పేరు మాత్రం ప్రకటించలేదు.

సినిమా తొలి షెడ్యూలు షూటింగ్ కూడా పూర్తయింది. ఈనెల 15వ తేదీ నుంచి రెండో షెడ్యూలు షూటింగ్ కొనసాగుతోంది. ఈ విషయాలను మరో అగ్ర నిర్మాత మహేష్ కోనేరు తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాతో చింతాడ చంద్రమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: రతన్‌, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, లైన్‌ ప్రొడ్యూసర్‌: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, దర్శకత్వం: చంద్రమోహన్‌ చింతాడ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement