
శర్వానంద్
శర్వానంద్ కథానాయకుడిగా హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పడి పడి లేచె మనుసు’. సాయిపల్లవి కథానాయిక. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. మంగళవారం హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేశారు. ‘‘డిఫరెంట్ అండ్ క్రియేటివ్ లవ్‌స్టోరీ చిత్రమిది. మా హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. టైటిల్‌కు మంచి స్పందన లభిస్తోంది.
ప్రస్తుతం కలకత్తాలో మఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో వెంకట్ మాస్టర్ నేతృత్వంలో కొన్ని యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నాం. జయకృష్ణ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు నిర్మాతలు. ‘మహానుభావుడు’ సినిమా తర్వాత శర్వానంద్ నటిస్తున్న ఈ లవ్‌స్టోరీపై అంచనాలు ఉన్నాయి. ‘వెన్నెల’ కిషోర్, కల్యాణి నటరాజన్, ప్రియా రామన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్ర శేఖర్ రావిపాటి.
Comments
Please login to add a commentAdd a comment