గ్లామర్ బాట వీడి.. ఖాకీ దుస్తుల్లో నమిత | Southern actress Namitha plays cop role | Sakshi
Sakshi News home page

గ్లామర్ బాట వీడి.. ఖాకీ దుస్తుల్లో నమిత

Published Wed, Oct 30 2013 3:31 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

గ్లామర్ బాట వీడి.. ఖాకీ దుస్తుల్లో నమిత - Sakshi

గ్లామర్ బాట వీడి.. ఖాకీ దుస్తుల్లో నమిత

ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో దర్శనమిచ్చే దక్షిణాది నటి నమిత ఈ సారి రూట్ మార్చారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రూపొందిస్తున్న ఓ సినిమాలో తొలిసారి ఖాకీ దుస్తుల్లో కనిపించనున్నారు. ఐటం సాంగ్స్లోనూ చిందులేసిన నమిత తాజా చిత్రంలో ఫైట్లు కూడా చేస్తున్నారు. 'ఇలామై ఓంజాల్' అనే సినిమాలో పోలీస్ అధికారిణి పాత్రలో నటిస్తున్నారు.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందని నమిత సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లో నటించే తనకు సుదీర్ఘ కాలం తర్వాత విభిన్న పాత్ర పోషించే అవకాశం వచ్చిందని చెప్పారు. 'ఈ సినిమాలో తొలుత ఓ హీరోయిన్ పాత్రను ఆఫర్ చేశారు. అయితే సత్తా ఉన్న పాత్రలో నటించాలనే ఉద్దేశంతో తిరస్కరించా. దీంతో ఖాకీ దుస్తులు ధరించే అవకాశం వచ్చింది. ఇక మీదట గ్లామర్ పాత్రల్లో నటించాలని భావించడం లేదు. మంచి పాత్రల కోసం అన్వేషిస్తున్నా' అని నమిత చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement