రానాతో జతకట్టనున్న రెజీనా | Regina team up with Rana | Sakshi
Sakshi News home page

రానాతో జతకట్టనున్న రెజీనా

Published Tue, Mar 7 2017 2:14 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రానాతో జతకట్టనున్న రెజీనా - Sakshi

రానాతో జతకట్టనున్న రెజీనా

యువ నటుడు రానాతో జత కట్టేందుకు నటి రెజీనా రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. టాలీవుడ్‌ టాలెస్ట్‌ నటుడు రానా. ఈయన ఒక్క తెలుగు చిత్రసీమకే పరిమితం కాకుండా హిందీ, తమిళం అంటూ బహుభాషా నటుడిగా రాణిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ఘాజీ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషలో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. కాగా రానా తమిళంలో ఆరంభం చిత్రంతోనే పరిచయం అయ్యారు. ఆ తరువాత బెంగళూర్‌ నాట్కల్, బాహుబలి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం బాహుబలి–2తో పాటు ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నారు.

కాగా తాజాగా మరో ద్విభాషా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు కళగు అనే వైవిధ్య భరిత కథాంశంతో విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. వీరి కలయికలో  తెరకెక్కనున్న ఈ చిత్రానికి మడైతిరంద అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది స్వాతంత్య్రానికి ముందు జరిగే చారిత్రక కథాంశంతో రూపొందనుందట. చిత్ర కథ నచ్చడంతో రానా ఇందులో నటించడానికి అంగీరించారు.

ఈ విషయాన్ని ఇటీవల రానానే స్వయంగా చెన్నైలో ఘాజీ చిత్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాగా ఈ పిరియడ్‌ కథా చిత్రంలో రానాకు జంటగా నటి రెజీనా నటించనున్నారని సమాచారం. ఈ అమ్మడు నటించిన మానగరం చిత్రం ఈ నెల 10న తెరపైకి రానుందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement