మరో వార్‌ డ్రామాలో రానా..? | Rana In Another War Based Film | Sakshi
Sakshi News home page

Published Sun, May 6 2018 12:54 PM | Last Updated on Sun, May 6 2018 12:55 PM

Rana In Another War Based Film - Sakshi

ఈ జనరేషన్ హీరోల్లో పీరియాడిక్‌, హిస్టారికల్‌ పాత్రలకు తగ్గ నటుడంటే ముందుగా గుర్తొచ్చే పేరు రానా దగ్గుబాటి. ఇప్పటికే బాహుబలి, రుద్రమదేవి, ఘాజీ లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించిన రానా.. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న సినిమాల్లో కూడా ఆ తరహా పాత్రల్లోనే కనిపించనున్నాడు. ప్రస్తుతం రానా.. 1945 సినిమాలో నటిస్తున్నాడు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రానా సైనికుడిగా కనిపించనున్నాడట. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న మరో మూవీ హాథీ మేరి సాథీలోనూ నటిస్తున్నాడు రానా.

తరువాత ట్రావెన్‌కోర్‌ రాజు మార్తండ వర్మ కథతో అదే పేరుతో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత మరో వార్‌ డ్రామాకు రానా అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. తనకు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సోలో హీరోగా ఘనవిజయాన్ని అందించిన తేజ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు రానా. ఈ సినిమా భారత్‌  - పాకిస్థాన్‌ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కనుందట. అయితే ఈ వార్తలపై హీరో రానా, దర్శకుడు తేజ ఇంతవరకు స‍్పందించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement