war film
-
కలెక్షన్ల సునామీ.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా ఇది
కరోనా వల్ల థియేటర్లు మూతపడి సినీ వ్యాపారానికి భారీ నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా ఆగిపోగా, మరికొన్నింటి షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఇక బిజినెస్‌కి దెబ్బపడుతుందనే భయంతో ఇంకొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ తరుణంలో థియేటర్ల గేట్లు తెరుచుకోవడంతో.. ధైర్యంగా కొందరు సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడం ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమకు ధైర్యాన్నిస్తోంది. ఇదిలా ఉంటే గ్లోబల్ బాక్సాఫీస్‌ను శాసిస్తాయని భావించిన సినిమాలు.. పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. ఈమధ్యే టామ్ హార్డీ ‘వెనోమ్ 2’, డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైం టు డై’ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ రెండూ కాకుండా.. మరో సినిమా ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. అదే చైనీస్ వార్‌డ్రామా ‘ది బాటిల్ ఎట్ లేక్ చాన్‌గ్జిన్’. అవి అంతంతగానే.. క్యారీ జోజి ఫుకునగ డైరెక్షన్లో రీసెంట్గా రిలీజ్ అయ్యింది ‘నో టైం టు డై’. జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రెయిగ్ చివరి చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 300 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ కమ్ ఎమోషనల్ డ్రామా.. వీకెండ్ కలెక్షన్ల పరంగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం 119 మిలియన్ డాలర్లు(ఓవర్సీస్లో) వసూలు చేసింది. ఇక ‘వెనోమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’.. డొమెస్టిక్ సర్క్యూట్లో 12.9 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, రష్యా షోల ద్వారా మరో 13.8 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. 110 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన వెనోమ్-2.. ఇప్పటిదాకా 131.3 మిలియన్ డాలర్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టగలిగింది. ఇక అమెరికన్ సైఫై డ్రామా ‘డునే’ 13.7 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. 165 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. కేవలం 103 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగింది. బాక్సాఫీస్ కింగ్.. చైనా వార్ డ్రామా ‘ది బాటిల్ ఎట్ లేక్ చాన్‌గ్జిన్’(2021) కలెక్షన్ల సునామీతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కొరియన్ యుద్ధ నేపథ్యంగా చైనా వర్సెస్ అమెరికా కోణంలో ఈ సినిమా తీశారు దర్శక త్రయం చెన్ కైగె, సుయి హార్క్, డాంటే లామ్. చైనీస్ సైనికుల పోరాటాల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా బడ్జెట్ 200 మిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ‘ది బ్యాటిల్ ఎట్ లేక్ చంగ్జిన్’ కేవలం వీకెండ్ కలెక్షన్లతోనే 237 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఈ ఫీట్ సినిమా ట్రేడ్ అనలిస్టులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. మాండరిన్ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటిదాకా 405 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సందడే కొనసాగుతోంది. దీంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్కార్ సహాకారంతోనే.. ది బ్యాటిల్ ఎట్ లేక్ చాన్‌గ్జిన్.. కొరియా యుద్దం టైంలో బ్యాటిల్ ఆఫ్ చోసిన్ రిజర్వాయర్, ఆ పోరాటంలో అమెరికా ఓటమి నేపథ్యాలుగా తీసిన సినిమా. దేశభక్తి నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. అంతేకాదు నెగెటివ్ రివ్యూ ఇవ్వడంతో పాటు కొరియన్ వార్‌లో చైనా పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసినందుకుగానూ.. లూవో చాంగ్‌పింగ్(40) అనే ప్రముఖ జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేయించింది చైనా సర్కార్. ఇక బలవంతంగా ఆడించేందుకు ప్రభుత్వమే చైనాలో ఎక్కువ స్క్రీన్లను కేటాయించిందన్న విమర్శ ఒకటి వినిపిస్తోంది. కానీ, చైనా స్క్రీన్లను మినహాయించినా.. ఓవర్సీస్లో ఈ చిత్రం రాబట్టిన కలెక్షన్లు చాలాఎక్కువేనని సినిమా ట్రేడ్ అనలిస్టులు తేల్చేశారు. చైనాలో వరుస సెలవులు కావడంతో ది బాటిల్ ఎట్ లేక్ చాన్గ్జిన్కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో హాలీవుడ్‌తో పోలిస్తే.. చైనా సినిమాల డామినేషన్ విపరీతంగా కనిపించింది. ‘డిటెక్టివ్ చైనాటౌన్ 3’ 690 మిలియన్ డాలర్లు, ‘హై, మామ్’ 840 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాయి. చదవండి: ఆస్పత్రికి డబ్బుల్లేక చందాలు.. క్రికెటర్ జీవితం నేర్పే పాఠాలివే! -
మరో వార్ డ్రామాలో రానా..?
ఈ జనరేషన్ హీరోల్లో పీరియాడిక్, హిస్టారికల్ పాత్రలకు తగ్గ నటుడంటే ముందుగా గుర్తొచ్చే పేరు రానా దగ్గుబాటి. ఇప్పటికే బాహుబలి, రుద్రమదేవి, ఘాజీ లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించిన రానా.. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల్లో కూడా ఆ తరహా పాత్రల్లోనే కనిపించనున్నాడు. ప్రస్తుతం రానా.. 1945 సినిమాలో నటిస్తున్నాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో సాగే ఈ కథలో రానా సైనికుడిగా కనిపించనున్నాడట. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మరో మూవీ హాథీ మేరి సాథీలోనూ నటిస్తున్నాడు రానా. తరువాత ట్రావెన్కోర్ రాజు మార్తండ వర్మ కథతో అదే పేరుతో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత మరో వార్ డ్రామాకు రానా అంగీకరించారన్న ప్రచారం జరుగుతోంది. తనకు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సోలో హీరోగా ఘనవిజయాన్ని అందించిన తేజ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు రానా. ఈ సినిమా భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కనుందట. అయితే ఈ వార్తలపై హీరో రానా, దర్శకుడు తేజ ఇంతవరకు స్పందించలేదు. -
వార్ డ్రామాలో టైటానిక్ బ్యూటీ
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ మరో చాలెంజింగ్ రోల్ లో నటించనుంది. టైటానిక్, హెవెన్లీ క్రీచర్స్, లిటిల్ చిల్డ్రన్, స్టీవ్ జాబ్స్ వంటి చిత్రాల్లో నటించిన ఈ భామ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న వార్ డ్రామాలో నటించేందుకు అంగీకరించింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ విలేఖరి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యుద్ధ సమయంలో సాహసోపేతంగా వ్యవహరించి నాజీల కాన్నన్ ట్రేషన్ క్యాంపులు, అక్కడ వారు విధించే శిక్షలకు సంబంధించిన ఫోటోలను సాధించిన అమెరికా ఫొటోగ్రాఫర్ లీ మిల్లర్ బయోపిక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మిల్లర్ జీవితంపై రాసిన 'ద లైవ్స్ ఆఫ్ లీ మిల్లర్' నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఆపిల్ కు చైనాలో మరో షాక్
టెక్ దిగ్గజం యాపిల్ కు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఏప్రిల్ లో ఐ బుక్స్, ఐ ట్యూన్స్ మూవీస్ సర్వీసులపై నిషేధం, మేలో ఐఫోన్ 6, 6 ప్లస్ అమ్మకాలు చేపట్టొదంటూ కోర్టు ఆర్డర్ ఇవన్నీ కోలుకోలేని దెబ్బలుగా పరిణమించాయి. తాజాగా మరో కేసు యాపిల్ కు వ్యతిరేకంగా నమోదైంది. 20 ఏళ్ల క్రితం చిత్రీకరించిన చారిత్రాత్మక వీడియోను యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంచినందుకు చైనా బ్రాడ్ కాస్టింగ్ రెగ్యులేటరీ సబ్సిడరీ, యాపిల్ పై దావా వేసింది. ఈ ఫిల్మ్ ను బ్రాడ్ కాస్ట్ చేయడానికి ఎక్స్ క్లూజివ్ ఆన్ లైన్ రైట్లను యాపిల్ అతిక్రమించిందని ప్రొడక్షన్ సెంటర్ ఆరోపిస్తూ కేసు దావా వేసినట్టు బీజింగ్ కోర్టు పేర్కొంది. 1930 లో ఉత్తర చైనాలో జపనీస్ సైనికులకు వ్యతిరేకంగా జరిగిన చైనా యుద్ధాన్ని "బ్లడీ ఫైట్ విత్ ది ఫియర్స్ ఎనిమీ" పేరుతో చిత్రీకరించారు. ఈ ఫిల్మ్ ను మొదటిసారి 1994లో బ్రాడ్ కాస్ట్ చేశారు. అయితే ఈ ఫిల్మ్ ను బ్రాడ్ కాస్ట్ చేయడంలో ఆన్ లైన్ ఎక్స్ క్లూజివ్ రైట్లను అతిక్రమించి, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్న "యూకు హెచ్ డీ యాప్" ద్వారా అందుబాటులో ఉంచింది. ఈ ఫిల్మ్ బ్రాడ్ కాస్ట్ చేయడం భారీ ఆర్థిక నష్టాలకు కారణమవుతుందని ఆరోపిస్తూ యాపిల్ పై మూవీ శాటిలైట్ చానెల్ ప్రొగ్రామ్ ప్రొడక్షన్ సెంటర్ కోర్టులో దావా వేసింది. అదేవిధంగా "యూకు హెచ్ డీ యాప్" ను డెవలప్ చేసి, ఆపరేట్ చేస్తున్న హాయి ఇన్ ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ పై కూడా ఈ దావా నమోదుచేసింది. ఈ రెండు కంపెనీలు వెంటనే ఆ ఫిల్మ్ ను బ్రాడ్ కాస్ట్ చేయడం ఆపాలని, నష్టపరిహారంగా 7,500 డాలర్లు(రూ.5,03,920), సహేతుక వ్యయం కింద 3,000 డాలర్లు(రూ.2,01,568) చెల్లించాలని ప్రొడక్షన్ సెంటర్ కోరింది. ఎక్స్ క్లూజివ్ రైట్లను అతిక్రమించడం వెంటనే బంద్ చేసే ఆదేశాలు జారీచేయాలని ప్రొడక్షన్ సెంటర్ కోరినట్టు కోర్టు వెల్లడించింది. దీంతో యాపిల్ కు చైనాలో ఒక కేసు తర్వాత ఒక కేసు చిక్కులు తెచ్చి పెడుతోంది.