టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే..మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు. అయితే ఈ టాలెంటెడ్ హీరో ఖాతాలో మాత్రం ఇటీవల ఒక్క హిట్ కూడా పడలేదు. బాహుబలి తర్వాత పలు సినిమాల్లో నటించినా.. ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు.
నేడు(డిసెంబర్ 14)రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా రానా-తేజ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు‘రాక్షస రాజా’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. పోస్టర్‌లో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు.
పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాక్షసరాజా సినిమాలో హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్నది త్వరలోనే ప్రకటించబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment