
న్యూ ఇయర్ రావడానికి ఇంకా టైముంది. కానీ, హీరో రానాకు మాత్రం ఇప్పుడే స్టార్టయ్యిందంట. అయితే అందరూ అనుకున్నట్లు రాబోయే 2018 కాదండోయ్. 1945. విచిత్రంగా ఉందా? ‘వెల్‌కమ్ టు 1945’ అంటున్నారు రానా. ఎందుకంటే ఆయన హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం టైటిల్ ‘1945’ . రెజీనా కథానాయిక. సుభాష్‌చంద్రబోస్ సైన్యంలోని ఒక సైనికుడి పాత్రలో రానా నటిస్తున్నారన్నది ఫిల్మ్‌నగర్ టాక్.
స్వాతంత్య్రానికి పూర్వపు సంఘటనలతో ఈ సినిమా ఉంటుంది. ఆ కాలానికి తగ్గట్టుగా హెయిర్ కట్ చేయించుకుంటున్నారు రానా. ‘‘జరిగిపోయిన కాలాన్ని సృష్టించబోతున్నాం. ఇప్పుడు మాకు ఇది 1945వ సంవత్సరం. ఈ చిత్రంలోని మేజర్ షెడ్యూల్ షూటింగ్ శుక్రవారం స్టార్టయ్యింది. తెలుగు, తమిళ్‌లో షూట్ చేస్తున్నాం. మా టీమ్ సభ్యులు విజయ్, జైపాల్ నా గెటప్ మార్చుతున్నారు’’ అన్నారు రానా.
Comments
Please login to add a commentAdd a comment