యువత చూసి గర్వపడాల్సిన చిత్రం 'ఘాజీ' | Venkaiah Naidu Salutes Ghazi | Sakshi
Sakshi News home page

యువత చూసి గర్వపడాల్సిన చిత్రం 'ఘాజీ'

Feb 26 2017 4:01 PM | Updated on Aug 11 2019 12:52 PM

యువత చూసి గర్వపడాల్సిన చిత్రం 'ఘాజీ' - Sakshi

యువత చూసి గర్వపడాల్సిన చిత్రం 'ఘాజీ'

పీవీపీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'ఘాజీ' చిత్రం విడుదలైనప్పట్నుంచి విమర్శకుల

పీవీపీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'ఘాజీ' చిత్రం విడుదలైనప్పట్నుంచి విమర్శకుల ప్రశంసలతోపాటు.. ప్రేక్షకుల రివార్డులు కూడా అందుకుంటూ విజయ పధంలో నడుస్తోంది. రానా, తాప్సీ, కేకే.మీనన్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని  సంకల్ప్ అత్యద్భుతంగా తెరకెకెక్కించిన విధానాన్ని చూసినవారందరూ అభినందనలతో చిత్ర బృందాన్ని ముంచెత్తుతున్నారు. "ఘాజీ" చిత్ర స్పెషల్ షో చూసిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు యూనిట్ సభ్యులను అభినందించారు.

'నేటితరం యువతకు ఘాజీ చిత్రం దేశభక్తిని సరికొత్త రూపంలో పరిచయం చేసింది. 1971లో జరిగిన ఇండోపాకిస్తాన్ యుద్ధం గురించి చాలా మందికి తెలియని నిజాల్ని తెలియజెప్పిన చిత్రమిది. ప్రజలు తెలుసుకొని గర్వపడాల్సిన చరిత్ర ఇది. కథానాయకుడు రానా మొదలుకొని ప్రతి ఒక్కరూ తమ అద్భుతమైన నటనతో సన్నివేశాలను పండించారు. జాతి సమగ్రతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. సబ్ మెరైన్ గురించి కానీ సబ్ మెరైన్ ఎలా పనిచేస్తుంది వంటి విషయాలను ఆకట్టుకొనే విధంగా చూపించిన దర్శకుడు సంకల్ప్ను మెచ్చుకొని తీరాలి. ముఖ్యంగా యుద్ధం నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హింసాత్మకమైన సన్నివేశాలు ఏవీ లేకుండా ఘాజీ చిత్రాన్ని రూపొందించిన విధానం ప్రశంసనీయం. అవార్డులు, రివార్డులు ఆశించకుండా ఒక మంచి సినిమాను నిర్మించినందుకు నిర్మాతలకు అభినందనలు' తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement