దూసుకుపోతున్న ’ఘాజీ’.. వసూళ్లెంతో తెలుసా? | The Ghazi Attack Box Office Collection | Sakshi
Sakshi News home page

దూసుకుపోతున్న ’ఘాజీ’.. వసూళ్లెంతో తెలుసా?

Published Sun, Feb 19 2017 6:44 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

దూసుకుపోతున్న ’ఘాజీ’.. వసూళ్లెంతో తెలుసా? - Sakshi

దూసుకుపోతున్న ’ఘాజీ’.. వసూళ్లెంతో తెలుసా?

రానా, తాప్సీ ప్రధానపాత్రలో దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి తెరకెక్కించిన వార్‌డ్రామా ’ఘాజీ’  బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నది. తెలుగులోనూ, హిందీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తున్నది. చూసిన ప్రేక్షకులు సినిమా బాగుందని చెప్తుండటంతో మున్ముందు కలెక్షన్లు మరింత పెరగవచ్చునని భావిస్తున్నారు.

గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ’ఘాజీ’  తొలి రెండురోజుల్లో రూ. 9.5 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం 4.25 కోట్లు సాధించిన ఈ సినిమా శనివారం మరింత మెరుగైన వసూళ్లు రాబట్టింది. ’ఘాజీ’కి పాజిటివ్‌ మౌత్‌ టాక్‌ రావడంతో ఆదివారం కలెక్షన్లు మరింత మెరుగ్గా ఉండే అవకాశముందని సినీ పండితులు భావిస్తున్నారు.

’ఘాజీ ద అటాక్‌’ సినిమా తొలి రెండురోజుల్లో మొత్తం అన్ని వెర్షన్లలో కలుపుకొని రూ. 9.50 కోట్లు వసూలు చేసిందని, హిందీ వెర్షన్‌లో ఈ సినిమాకు రూ. 3.90 కోట్లు కలెక్ట్‌ చేసిందని సినీ ట్రేడ్‌ అనాలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వస్తుండటంతో మున్ముందు వసూళ్లుపెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement