సోలోగా యుద్ధం చేయనున్న రానా
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా.. మరో బహుభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 1971లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన యుద్ధ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నారు.
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘాజీలో కే కే మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ ఉండటంతో ఇతర చిత్ర నిర్మాతలు తమ సినిమాల రిలీజ్‌లను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 17న కిట్టు ఉన్నాడు జాగ్రత్త, గుంటూరోడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న వార్తలు వినిపించాయి. అయితే ఘాజీకి భారీ హైప్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో ఆ రెండు చిత్రాలను వాయిదా వేశారట. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ల ఎనౌన్స్మెంట్ కు ప్లాన్ చేస్తున్నారు.