కడప కార్పొరేషన్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పళంగికి చెందిన గరికపాటి లక్ష్మికి కువైట్‌లో సేఠ్ వేధింపుల నుంచి విముక్తి లభించింది. ఏపీఎన్‌ఆర్‌టీఎస్ సాయంతో ఆమె సురక్షితంగా ఇండియాకు చేరింది. గరికపాటి లక్ష్మి 8 నెలల కిందట జీవనోపాధి కోసం కువైట్ వెళ్లింది. కువైటీ ఇంట్లో పెట్టే బాధలు భరించలేక భారత రాయబార కార్యాలయానికి చేరుకుంది. అయితే అక్కడ ఎవరిని కలవాలో, ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో ఉన్న సమయంలో ఏపీఎన్ఆర్టీస్ సామాజిక కార్యకర్త రెడ్డెయ్య రెడ్డి ఆమెతో మాట్లాడి అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుసుకున్నారు.
కువైట్ ఇమ్మిగ్రేషన్, ఎంబసీ పనులు పూర్తయ్యేందుకు నెల సమయం పట్టింది. 30 రోజుల పాటు ఏపీఎన్‌ఆర్‌టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ భోజన, వసతి సౌకర్యాలు కల్పించడమేగాక విమాన టికెట్, దారి ఖర్చుల కింద రూ.13 వేలు సాయం చేశారు. 14వ తేదీ తెల్లవారుజామున 4.05 గంటలకు కువైట్ నుంచి బయలుదేరిన ఆమె మధ్యాహ్నం 2.35 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ సీఎంవైఎస్ జగన్ సారథ్యంలో గల్ఫ్‌లోని ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరిస్తున్న ఏపీఎన్‌ఆర్‌టీఎస్ వారికి రుణపడి ఉంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment