శ్రీనివాస్ భార్య, నల్గొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మిని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మి పోలీసుల తీరుపై మండిపడ్డారు. రాత్రి ఫోన్ రాగానే శ్రీనివాస్ బయటకు వెళ్లారని, కాసేపటికే హత్య జరిగిందన్న విషయం తెలిసిందన్నారు. శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు