ఏంచేశారని జనచైతన్య యాత్రలు?
ఏంచేశారని జనచైతన్య యాత్రలు?
Published Thu, Nov 24 2016 11:40 PM | Last Updated on Tue, Jun 4 2019 5:58 PM
ఇళ్లు, ఇళ్ల స్థలాలకోసం ఎమ్మెల్యే
అనంతలక్షి్మని నిలదీసిన మహిళలు
∙చేసింది తక్కువ–చెప్పేది ఎక్కువ
∙వేములవాడవాసుల అసంతృప్తి
వేములవాడ (కరప) : మండలంలోని వేములవాడలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పార్టీనాయకులు, కార్యకర్తలతో కల్సి నిర్వహించిన జన చైతన్యయాత్రలో మహిళల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. గురువారం వేములవాడలో జరిగిన జన చైతన్యయాత్రలో గ్యాస్ కనెక్షన్లు, పెట్టుబడి నిధి చెక్కులు పంపిణీచేసున్నారని చెపితే మహిళాశక్తి సంఘ సభ్యులు తరలివచ్చారు. ఎమ్మెల్యే అనంతలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు బుంగా సింహాద్రి తదితరులు కాలనీవద్ద ఈ మేరకు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులతో పాటు పలువురు నాయకులు ఊకదంపుడు ప్రసంగాలిచ్చారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాకా ఏం చేశారని చైతన్య యాత్రలు నిర్వహిసున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపించినందుకు మీరుణం తీర్చుకునేందుకు ఏపనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పగా కొంతమంది మహిళలు ఏదో అడగడానికి ప్రయత్నించగా స్థానిక నాయకులు వారిని అడ్డుకున్నారు. పంపిణీకార్యక్రమం అయినతర్వాత మహిళలు ఎమ్మెల్యే చుట్టుముట్టి తమ సమస్యలను ఏకరువుపెట్టారు. రెండేళ్లుగా తిరుగుతున్నా హౌసింగ్‌లోన్ ఇవ్వలేదని, మరుగుదొడ్డి బిల్లులు ఇవ్వడంలేదని, ఇంటి స్థలం ఇవ్వలేదని అడుగుతుండగా స్థానికనాయకులు అక్కడనుంచి జారుకున్నారు. ఇప్పటికే కొంతమందికి ఇచ్చామని, రానున్నరోజుల్లో అర్హులందరికీ గృహరుణాలు ఇస్తామన్నారు. ఇవ్వడంజరుగుతుందని సద్దిచెప్పి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రచురించిన కరపత్రంలో అవాస్తవాలు ఉన్నాయని వారు వివరిచారు. ఈ సందర్భంగా హైస్కూలులో మూడేళ్లుగా గదుల నిర్మాణం పూర్తికాక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కాపుకార్పొరేషన్ ద్వారా 14 మందికి ఇచ్చామన్న రుణాలు ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతామని ప్రజలు తెలిపారు.
Advertisement
Advertisement