Jana
-
జియోకి షాక్..‘జన’ ఉచిత డేటా ఆఫర్
ఉచిత డేటా, ఉచిత కాలింగ్ అంటూ జియో టెలికాం రంగంలో సంచలనం సృష్టించగా ఇపుడు మరో ఉచిత ఆఫర్ దూసుకొస్తోంది. అయితే ఈ సారి ఓ విదేశీ కంపెనీ కావడం విశేషం. అమెరికాలోని బోస్టన్ ఆధారిత మొబైల్ ప్రకటనల సంస్థ 'జన' ఉచిత డేటా ఆఫర్ తో ముందుకొస్తోంది. రోజుకు 10 ఎంబీ డేటాను ఉచితంగా అందించనుంది. అంతేకాదు తమ ప్లాట్ ఫాంపై ప్రకటనల ఆదాయం పెరిగే కొద్దీ ఉచిత డేటా ఆఫర్‌ను కూడా ఆమేరకు పెంచుతుందట. ముఖ్యంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఉచిత ఆఫర్ లకు స్వస్తి పలికి బిల్లింగ్ మోడ్ లోకి మారిపోయిన తరుణంలో, జన ఆండ్రాయిడ్ బ్రౌజర్ ను ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా తన ఎంసెంట్(mCent ) బ్రౌజర్ ను భారత్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో శుక్రవారం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రారంభ దశలో, వినియోగదారులకు రోజుకు ఉచిత 10ఎంబీ డేటా (వారానికి 70ఎంబీ) అందించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు భారతి ఎయిర్ టెల్, రిలియన్స్ జియో లాంటి ఇతర దేశీయ ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. బిలియన్ ప్రజలకు ఇంటర్నెట్ ఉచితంగా అందించడమే తమ తదుపరి లక్ష్యమని జన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు సహ వ్యవస్థాపకుడు నాథన్ ఈగిల్ చెప్పారు. ఎంసెంట్ బ్రౌజర్ ను ఎంసెంట్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు అధిక డేటా ఖర్చు భయంతో వినియోగదారులు మోర్ సెలెక్టివ్‌గా ఉండడం, మొబైల్ ప్రకటనకర్తలకు సవాలుగా మారిందని అయితే, ఎంసెంట్ ఎంట్రీ ఇది మొత్తం మారిపోనుందని జన మేనేజర్, సహ వ్యవస్థాపకుడు జోనాథన్ డిసౌజా తెలిపారు. ఇది వినియోగదారుల ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్ సదుపాయం అందించడంతోపాటు, ప్రకటనకర్తలకు మంచి అవకాశాన్ని కల్పించనుందని చెప్పారు. కాగా దాదాపు గూగుల్ ప్లే స్టోర్‌ను పోలిన ఎంసెంట్ బ్రౌజర్ ను ఎంసెంట్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. భారతదేశం లో 2014 లో ప్రారంభించిన ఈ యాప్ ప్రతి డౌన్ లోడ్ పై ఉచిత డేటాను ఆఫర్ చేసి 30 మిలియన్ల యూజర్లను ఆకర్షించింది. -
ఏంచేశారని జనచైతన్య యాత్రలు?
ఇళ్లు, ఇళ్ల స్థలాలకోసం ఎమ్మెల్యే అనంతలక్షి్మని నిలదీసిన మహిళలు ∙చేసింది తక్కువ–చెప్పేది ఎక్కువ ∙వేములవాడవాసుల అసంతృప్తి వేములవాడ (కరప) : మండలంలోని వేములవాడలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పార్టీనాయకులు, కార్యకర్తలతో కల్సి నిర్వహించిన జన చైతన్యయాత్రలో మహిళల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. గురువారం వేములవాడలో జరిగిన జన చైతన్యయాత్రలో గ్యాస్ కనెక్షన్లు, పెట్టుబడి నిధి చెక్కులు పంపిణీచేసున్నారని చెపితే మహిళాశక్తి సంఘ సభ్యులు తరలివచ్చారు. ఎమ్మెల్యే అనంతలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు బుంగా సింహాద్రి తదితరులు కాలనీవద్ద ఈ మేరకు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులతో పాటు పలువురు నాయకులు ఊకదంపుడు ప్రసంగాలిచ్చారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాకా ఏం చేశారని చైతన్య యాత్రలు నిర్వహిసున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపించినందుకు మీరుణం తీర్చుకునేందుకు ఏపనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పగా కొంతమంది మహిళలు ఏదో అడగడానికి ప్రయత్నించగా స్థానిక నాయకులు వారిని అడ్డుకున్నారు. పంపిణీకార్యక్రమం అయినతర్వాత మహిళలు ఎమ్మెల్యే చుట్టుముట్టి తమ సమస్యలను ఏకరువుపెట్టారు. రెండేళ్లుగా తిరుగుతున్నా హౌసింగ్‌లోన్ ఇవ్వలేదని, మరుగుదొడ్డి బిల్లులు ఇవ్వడంలేదని, ఇంటి స్థలం ఇవ్వలేదని అడుగుతుండగా స్థానికనాయకులు అక్కడనుంచి జారుకున్నారు. ఇప్పటికే కొంతమందికి ఇచ్చామని, రానున్నరోజుల్లో అర్హులందరికీ గృహరుణాలు ఇస్తామన్నారు. ఇవ్వడంజరుగుతుందని సద్దిచెప్పి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రచురించిన కరపత్రంలో అవాస్తవాలు ఉన్నాయని వారు వివరిచారు. ఈ సందర్భంగా హైస్కూలులో మూడేళ్లుగా గదుల నిర్మాణం పూర్తికాక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కాపుకార్పొరేషన్ ద్వారా 14 మందికి ఇచ్చామన్న రుణాలు ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతామని ప్రజలు తెలిపారు. -
సమస్యలు చెబుతుంటే పోలీసులను ఉపయోగిస్తున్నారు..!
వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కూనవరం (సీతానగరం) : టీడీపీ చేపట్టిన జన చైతన్య యాత్రలో ప్రజలు తమ సమస్యలను చెబుతుంటే పోలీసులతో వారిని అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. బుధవారం కూనవరంలో చౌటిపల్లి లాల్‌బాబు ఇంటివద్ద జరిగిన విందు కార్యక్రమంలో రాజా పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుప మేరకు చేపట్టిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా జనచైతన్య యాత్రలు టీడీపీ చేపట్టిందన్నారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 650 హామీలలో ఒకటి అమలు జరపలేదని ప్రజలు తమ వద్ద వాపోతున్నారని, ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జనచైతన్య యాత్రలో ప్రజలు స్పందించి, ఎక్కడకక్కడ ఖండిస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులో 90 ఇల్లు కాలిపోతే అక్కడకు వెళ్లిన ఎమ్మెల్యే బుచ్చియ్యచౌదరి వారే ఇళ్ల కాల్చుకున్నారని అనడం అధికారం అహంకారంతో ఉన్నారని రుజువైందన్నారు. రెండేళ్ళ క్రితం ఇళ్లను వేరే ప్రాంతంలో ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన బుచ్చియ్య చౌదరి దానిని మర్చారన్నారు. దేశంలో గత ప్రభుత్వంలో 47 లక్షల గృహాలు కడితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాష్ట్రంలో 48 లక్షల ఇల్లు కట్టారని గుర్తు చేశారు. రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టిన దాఖలాలు లేవన్నారు. మోదీ ప్రకటనతో ప్రజల ఇబ్బందులు ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జక్కంపూడి రాజా అన్నారు. చంద్రబాబు పట్టిసీమ, దేవుడు భూములు అమ్ముకున్న డబ్బు, అమరావతి ద్వారా సంపాదించిన నల్లదనాన్ని ఏవిధంగా మారుస్తావని ప్రశ్నించారు. పెద్దనోట్లు రద్దు చేయమని మేమే చెప్పామని టీడీపీ నాయకులు చంద్రబాబును తెగపొగుడుతుంటే, చంద్రబాబు మాత్రం ఇంటిలో కూర్చుని డబ్బులు ఏవిధంగా మార్చాల అని మదనపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వేల కోట్లు రూపాయల అవినీతి జరుగుతుందని, ప్రజలే త్వరలో గట్టిగా బుద్ధిచెబుతారని రాజా హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అద్యక్షుడు పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చళ్లమళ్ల సుజీరాజు, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు, మండల సేవాదళ్ అద్యక్షుడు ఆళ్ళ కోటేశ్వరావు, బంక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయాన్ని కూల్చొద్దు
గవర్నర్‌ను కలసిన ఉత్తమ్, జానా, షబ్బీర్ ►ప్రజాధనం వృథా చేయకుండా సీఎంను అడ్డుకోవాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యల పరిష్కారానికి నిధుల్లేవంటున్న ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోట్లాది రూపా యలను వృథా చేయకుండా తగిన చర్యలను తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ప్రతి పక్షనాయకులు కె.జానా రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి వినతిపత్రాన్ని సమర్పిం చారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, వాస్తు బాగా లేదనే సాకుతో సచి వాలయాన్ని కూల్చే యాలని సీఎం కేసీఆర్ నిర్ణరుుంచడం దుర్మార్గమన్నారు. పటిష్టంగా ఉన్న భవనాలతో రెండు రాష్ట్రాలకు సరిపోయే స్థారుులో సచివాలయం ఉందన్నారు. వాస్తు పేరుతో కూల్చివేయడానికి, కొత్తగా నిర్మించడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో కోర్టు వివరణ కోరిందని, సచివాలయంలో అగ్ని ప్రమాదాలకు సంబంధించి సరైన జాగ్రత్తలు లేవని, అవన్నీ పాతభవనాలు అని.. ప్రభుత్వం వాదించడం వింతగా ఉందన్నారు. సచి వాలయంలోని చాలా భవనాలను ఇటీవలనే నిర్మించారని, మరో 20 ఏళ్ల వరకు వాటి మనుగడకు ఇబ్బందిలేదని అన్నారు. జెడ్‌ప్లస్ భద్రతలో ఉన్న ముఖ్యమంత్రులుగా వై.ఎస్. రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు అంతకుముందు చాలామంది ఇదే సచివాలయంలో పనిచేశారని ఉత్తమ్ గుర్తుచేశారు. రైతుల రుణమాఫీ, విద్యా ర్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ కి నిధుల్లేవంటున్న ముఖ్యమంత్రి.. సచివాలయాన్ని కూల్చడానికి వందలకోట్లు ఎందుకు వృథా చేస్తున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే పండుగలు, వాస్తుదోషాలు అంటూ కోట్లాది రూపా యల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తు న్నారని విమర్శించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని, ఆయన ప్రజల ప్రయోజ నాలను కాపాడతారనే విశ్వాసం తమకుం దని ఉత్తమ్ చెప్పారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సచివాలయం ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉం దన్నారు. కేవలం తన కొడుకు ముఖ్యమంత్రి కాడేమోననే భయంతోనే సచివాలయాన్ని కూల్చాలని సీఎం కేసీఆర్ ప్రయత్ని స్తున్నారని ఆరోపిం చారు. ప్రజల అవసరాల కోసం కాకుండా, కేవలం తన వ్యక్తిగత విశ్వాసాలకోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మంచిదికాదని జీవన్‌రెడ్డి హితవు పలికారు. -
అలరిస్తున్న 'జాతీయ' గీతాలాపనలు
-
నేడు వికారాబాద్‌కు పొన్నాల
- సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టనున్న కాంగ్రెస్ - హాజరుకానున్న జానా, డీఎస్, ఉత్తమ్ సహా పలువురు నేతలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలోనే అత్యధికంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఓటమి భారంతో కుంగిపోకుండా.. శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఆదివారం వికారాబాద్‌లో జరిగే నియోజకవర్గ స్థాయి కార్యకర్తలసమావేశంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యే ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డి సహా అగ్రనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొంటారని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు గౌలికార్ ఫంక్షన్లో సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించ నున్నట్లు ఆయన పేర్కొన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. తనపై నమ్మకంతో రెండోసారి డీసీసీ పదవి కట్టబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం నమ్మకాన్ని నిలబెడతానని క్యామ మల్లేశ్ స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో క్యామ మాట్లాడారు. సీనియర్లతో ఏలాంటి బేధాభిప్రాయాలకు తావివ్వకుండా సమన్వయంతో వ్యవహరిస్తానని చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా ఉద్యమాలు సాగిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో 109 హామీలిచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. గద్దెనెక్కిన తర్వాత కేవలం రెండు, మూడు హామీలను మాత్రమే అమలు చేసిందని, మిగతావాటిని బుట్టదాఖలు చేసే యత్నం చేస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచైనా హామీలు అమలు చేసేలా ఒత్తిడి చేస్తామని మల్లేశ్ స్సష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 48డివిజన్లలో పార్టీని పటిష్టంచేసేందుకు త్వరలోనే డివిజన్లవారీగా సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ సత్తాచాటేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు స్వీకరిస్తూ పార్టీ బలోపేతానికి పాటుపడతానని క్యామ మల్లేశ్ అన్నారు. -
‘సమ’భావనమూ, సమతావాదము...
తక్కువ ఆదాయంతో, చాలా సాధారణంగా బతుకీడ్చే వారుంటారు. తమ ప్రతిభతో మంచి స్థాయి సంపాదనతో బతికే వారూ ఉంటారు. కానీ కొంతమంది టాలెంట్‌తో తాము బాగా బతకడంతో పాటు తమ చుట్టూ ఉన్న వారి లైఫ్‌స్టైల్‌ను కూడా మార్చేస్తూ వారి జీవితాలను తీర్చిదిద్దుతూ తాము కూడా వెలిగిపోతారు. అలాంటి వ్యక్తే లీల జనా. ఒక ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన ఈ యువతి ప్రస్థానం ఇది... అవకాశం ఉంటే ఆసియా, ఆఫ్రికాఖండాల్లోని అభివృది ్ధచెందుతున్న దేశాల ప్రజల స్థితిగతులను మార్చేయాలనే తపన చాలా మందిలో ఉంటుంది. అలాంటి తపననే కలిగి అవకాశం కోసం ఎదురు చూడకుండా, అవకాశాన్ని సృష్టించుకుంది లీల. స్కాలర్షిప్ చదువులు... పుట్టింది సాధారణ మధ్య తరగతి కుటుంబంలోనే అయినా... స్కాలర్‌షిప్‌ల సాయంతో మంచి మంచి విద్యాసంస్థల్లోనే చదువుతూ వచ్చింది లీల. హార్వర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక అనేక ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశాన్ని సంపాదించుకొంది. ముందుగా ఆఫ్రికాలోని ఘనా వెళ్లి అక్కడ కొన్ని రోజుల పాటు పరిస్థితులను పరిశీలించి వచ్చింది. ఆ తర్వాత ప్రపంచబ్యాంకు తరపున అనేక ఆఫ్రికా దేశాల్లో పర్యటించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షకురాలిగా పనిచేసింది. ఈ సందర్భంలో అక్కడి పరిస్థితులను చూసి చలించి పోయింది లీల. వారిని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఏదో ఒకటి చేయాలని తపించింది. తిరిగి అమెరికాకు వెళ్లిపోయాకా దీని గురించి సొంతంగా అధ్యయనం చేయసాగింది. ఔట్‌సోర్సింగ్‌ను ఆధారం చేసింది... ఈ క్రమంలో ఆఫ్రికాలో పేదరికం, నిరక్షరాస్యత లు తీవ్రమైన సమస్యలుగా గుర్తించింది. అయితే అక్కడ సరైన అవకాశాలు లేకపోవడంతో చదువుకున్న వారు కూడా ఉపాధి లేకుండా నిరక్షరాస్యులతో పాటే మనుగడ సాగిస్తున్నట్టు అర్థం చేసుకొంది. వారిని లక్ష్యంగా చేసుకొని, ఔట్సోర్సింగ్పద్ధతిని అమల్లో పెట్టాలని లీల ప్రణాళిక రచించింది. ‘ఆఫ్రికన్ డెవలప్మెంట్’ అనే సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేషన్ చేసిన నేపథ్యం, ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెకు లాభించాయి. ఆమె ప్రణాళికకు ప్రముఖ కంపెనీలు సహకరించేలా చేశాయి. ఈ క్రమంలో లీల ‘సమా సోర్స్’ అనే సంస్థను నెలకొల్పింది. అందరికీ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘సమ’ అనే సంస్కృత పదం స్ఫూర్తితో తన సంస్థకు ఆ పేరు పెట్టింది లీల. సక్సెస్ సాధించింది... ముందుగా తాను గుర్తించిన అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించి అక్కడ చదువుకొన్న యువతను సమీకరించుకొంది. వారికి కంప్యూటర్ టెక్నాలజీ మీద ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవడానికి శిక్షణా కార్యకమాలను ఏర్పాటు చేసింది. అలాంటి వారి చేత ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రముఖ కంపెనీ ఉద్యోగులను చేయాలన్నదే లీల ఉద్దేశం. ఈ విషయంలో ఆమెకు గూగుల్, లింక్డిన్, ఈబే, మైక్రోసాఫ్ట్, ఈవెంట్ బ్రైట్ వంటి కంపెనీలు సహాకారం అందించాయి. తమకు కావాల్సిన పనులను లీల ద్వారా అభివృద్ధి చెందిన నిపుణుల ద్వారా చేయించుకోవడం మొదలెట్టాయి. దీంతో లీల ప్రణాళిక ఫలించింది. వేలమందికి ఉపాధి లభించింది. ప్రస్తుతానికి సబ్ సహారన్ ఆఫ్రిక దేశాల్లో, దక్షిణాసియా, కరేబియన్ దేశాల్లో ‘సమాసోర్స్’ కార్యకలాపాలను విస్తరించింది. దాదాపు ఐదువేల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తోంది. ఈ స్థాయిని మరింత విస్తరించాలన్నదే తన లక్ష్యమని లీల చెబుతోంది. తాను గుర్తించిన అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించి అక్కడ చదువుకొన్న యువతను సమీకరించుకొంది. వారికి కంప్యూటర్ టెక్నాలజీ మీద ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవడానికి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాంటి వారి చేత ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రముఖ కంపెనీ ఉద్యోగులను చేయాలన్నదే లీల ఉద్దేశం.