తక్కువ ఆదాయంతో, చాలా సాధారణంగా బతుకీడ్చే వారుంటారు. తమ ప్రతిభతో మంచి స్థాయి సంపాదనతో బతికే వారూ ఉంటారు. కానీ కొంతమంది టాలెంట్‌తో తాము బాగా బతకడంతో పాటు తమ చుట్టూ ఉన్న వారి లైఫ్‌స్టైల్‌ను కూడా మార్చేస్తూ వారి జీవితాలను తీర్చిదిద్దుతూ తాము కూడా వెలిగిపోతారు. అలాంటి వ్యక్తే లీల జనా. ఒక ఎన్‌ఆర్‌ఐ కుటుంబానికి చెందిన ఈ యువతి ప్రస్థానం ఇది...
అవకాశం ఉంటే ఆసియా, ఆఫ్రికాఖండాల్లోని అభివృది ్ధచెందుతున్న దేశాల ప్రజల స్థితిగతులను మార్చేయాలనే తపన చాలా మందిలో ఉంటుంది. అలాంటి తపననే కలిగి అవకాశం కోసం ఎదురు చూడకుండా, అవకాశాన్ని సృష్టించుకుంది లీల.
స్కాలర్‌షిప్ చదువులు...
పుట్టింది సాధారణ మధ్య తరగతి కుటుంబంలోనే అయినా... స్కాలర్‌షిప్‌ల సాయంతో మంచి మంచి విద్యాసంస్థల్లోనే చదువుతూ వచ్చింది లీల. హార్వర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక అనేక ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశాన్ని సంపాదించుకొంది. ముందుగా ఆఫ్రికాలోని ఘనా వెళ్లి అక్కడ కొన్ని రోజుల పాటు పరిస్థితులను పరిశీలించి వచ్చింది. ఆ తర్వాత ప్రపంచబ్యాంకు తరపున అనేక ఆఫ్రికా దేశాల్లో పర్యటించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షకురాలిగా పనిచేసింది. ఈ సందర్భంలో అక్కడి పరిస్థితులను చూసి చలించి పోయింది లీల. వారిని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఏదో ఒకటి చేయాలని తపించింది. తిరిగి అమెరికాకు వెళ్లిపోయాకా దీని గురించి సొంతంగా అధ్యయనం చేయసాగింది.
ఔట్‌సోర్సింగ్‌ను ఆధారం చేసింది...
ఈ క్రమంలో ఆఫ్రికాలో పేదరికం, నిరక్షరాస్యత లు తీవ్రమైన సమస్యలుగా గుర్తించింది. అయితే అక్కడ సరైన అవకాశాలు లేకపోవడంతో చదువుకున్న వారు కూడా ఉపాధి లేకుండా నిరక్షరాస్యులతో పాటే మనుగడ సాగిస్తున్నట్టు అర్థం చేసుకొంది. వారిని లక్ష్యంగా చేసుకొని, ఔట్‌సోర్సింగ్‌పద్ధతిని అమల్లో పెట్టాలని లీల ప్రణాళిక రచించింది. ‘ఆఫ్రికన్ డెవలప్‌మెంట్’ అనే సబ్జెక్ట్‌తో గ్రాడ్యుయేషన్ చేసిన నేపథ్యం, ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెకు లాభించాయి. ఆమె ప్రణాళికకు ప్రముఖ కంపెనీలు సహకరించేలా చేశాయి. ఈ క్రమంలో లీల ‘సమా సోర్స్’ అనే సంస్థను నెలకొల్పింది. అందరికీ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ‘సమ’ అనే సంస్కృత పదం స్ఫూర్తితో తన సంస్థకు ఆ పేరు పెట్టింది లీల.
సక్సెస్ సాధించింది...
ముందుగా తాను గుర్తించిన అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించి అక్కడ చదువుకొన్న యువతను సమీకరించుకొంది. వారికి కంప్యూటర్ టెక్నాలజీ మీద ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవడానికి శిక్షణా కార్యకమాలను ఏర్పాటు చేసింది. అలాంటి వారి చేత ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ప్రముఖ కంపెనీ ఉద్యోగులను చేయాలన్నదే లీల ఉద్దేశం. ఈ విషయంలో ఆమెకు గూగుల్, లింక్డిన్, ఈబే, మైక్రోసాఫ్ట్, ఈవెంట్ బ్రైట్ వంటి కంపెనీలు సహాకారం అందించాయి. తమకు కావాల్సిన పనులను లీల ద్వారా అభివృద్ధి చెందిన నిపుణుల ద్వారా చేయించుకోవడం మొదలెట్టాయి. దీంతో లీల ప్రణాళిక ఫలించింది. వేలమందికి ఉపాధి లభించింది. ప్రస్తుతానికి సబ్ సహారన్ ఆఫ్రిక దేశాల్లో, దక్షిణాసియా, కరేబియన్ దేశాల్లో ‘సమాసోర్స్’ కార్యకలాపాలను విస్తరించింది. దాదాపు ఐదువేల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తోంది. ఈ స్థాయిని మరింత విస్తరించాలన్నదే తన లక్ష్యమని లీల చెబుతోంది.
తాను గుర్తించిన అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యటించి అక్కడ చదువుకొన్న యువతను సమీకరించుకొంది. వారికి కంప్యూటర్ టెక్నాలజీ మీద ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవడానికి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాంటి వారి చేత ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ప్రముఖ కంపెనీ ఉద్యోగులను చేయాలన్నదే లీల ఉద్దేశం.