సచివాలయాన్ని కూల్చొద్దు
గవర్నర్‌ను కలసిన ఉత్తమ్, జానా, షబ్బీర్
►ప్రజాధనం వృథా చేయకుండా సీఎంను అడ్డుకోవాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యల పరిష్కారానికి నిధుల్లేవంటున్న ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోట్లాది రూపా యలను వృథా చేయకుండా తగిన చర్యలను తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ప్రతి పక్షనాయకులు కె.జానా రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి వినతిపత్రాన్ని సమర్పిం చారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, వాస్తు బాగా లేదనే సాకుతో సచి వాలయాన్ని కూల్చే యాలని సీఎం కేసీఆర్ నిర్ణరుుంచడం దుర్మార్గమన్నారు. పటిష్టంగా ఉన్న భవనాలతో రెండు రాష్ట్రాలకు సరిపోయే స్థారుులో సచివాలయం ఉందన్నారు.
వాస్తు పేరుతో కూల్చివేయడానికి, కొత్తగా నిర్మించడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో కోర్టు వివరణ కోరిందని, సచివాలయంలో అగ్ని ప్రమాదాలకు సంబంధించి సరైన జాగ్రత్తలు లేవని, అవన్నీ పాతభవనాలు అని.. ప్రభుత్వం వాదించడం వింతగా ఉందన్నారు. సచి వాలయంలోని చాలా భవనాలను ఇటీవలనే నిర్మించారని, మరో 20 ఏళ్ల వరకు వాటి మనుగడకు ఇబ్బందిలేదని అన్నారు. జెడ్‌ప్లస్ భద్రతలో ఉన్న ముఖ్యమంత్రులుగా వై.ఎస్. రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు అంతకుముందు చాలామంది ఇదే సచివాలయంలో పనిచేశారని ఉత్తమ్ గుర్తుచేశారు. రైతుల రుణమాఫీ, విద్యా ర్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ కి నిధుల్లేవంటున్న ముఖ్యమంత్రి.. సచివాలయాన్ని కూల్చడానికి వందలకోట్లు ఎందుకు వృథా చేస్తున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు.
ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే పండుగలు, వాస్తుదోషాలు అంటూ కోట్లాది రూపా యల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తు న్నారని విమర్శించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని, ఆయన ప్రజల ప్రయోజ నాలను కాపాడతారనే విశ్వాసం తమకుం దని ఉత్తమ్ చెప్పారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సచివాలయం ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉం దన్నారు. కేవలం తన కొడుకు ముఖ్యమంత్రి కాడేమోననే భయంతోనే సచివాలయాన్ని కూల్చాలని సీఎం కేసీఆర్ ప్రయత్ని స్తున్నారని ఆరోపిం చారు. ప్రజల అవసరాల కోసం కాకుండా, కేవలం తన వ్యక్తిగత విశ్వాసాలకోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మంచిదికాదని జీవన్‌రెడ్డి హితవు పలికారు.