Shabbir
-
గ్రానైట్ రాళ్లు క్యాబిన్‌పై పడటంతో.. ఇద్దరి విషాదం!
ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఖమ్మంరూరల్ మండలానికి చెందిన ఈగ రాజిరెడ్డి (37), మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన షేక్ షబ్బీర్ (35) కలిసి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. వారం రోజుల కిందట వీరు ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో ఓ గ్రానైట్ క్వారీ నుంచి రాయిని తీసుకుని ఖమ్మం వస్తుండగా మార్గమధ్యలో మూలమలుపు వద్ద లారీ అదుపుతప్పింది. ఈ క్రమంలో గ్రానైట్ రాళ్లు క్యాబిన్‌పై పడటంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా షబ్బీర్ ఐదేళ్లుగా వరంగల్క్రాస్ రోడ్డులో కుటుంబంతో నివాసముంటున్నాడు. రాజిరెడ్డి ఖమ్మం నగరంలోని సారధినగర్వాసి. ఇవి చదవండి: భార్యను చంపి.. చెత్త డబ్బాలో పెట్టి -
ప్రేమోన్మాదులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ప్రేమించు..లేకుంటే ప్రాణం తీస్తా’ అంటూ కిరాతకంగా వ్యవహరించిన ప్రేమోన్మాదులు యువతుల గొంతుకోసిన దారుణ సంఘటనలు వేలూరు జిల్లాలో చోటుచేసుకున్నాయి. వేలూరు జిల్లా కేదాంతపట్టి గ్రామానికి చెందిన మునిరాజ్ కుమార్తె లావణ్య (23) హాస్టల్లో ఉంటూ కడలూరు జిల్లా చిదంబరంలోని అన్నామలై యూనివర్సిటీలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. లావణ్యకు ఆమె సొంతూరికి చెందిన వ్యక్తి, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న నవీన్‌కుమార్ (27)కు మధ్య స్నేహం ఉంది. అయితే నవీన్‌కుమార్ మాత్రం ప్రేమించాల్సిందిగా వేధించేవాడు. దీంతో విసిగిపోయిన లావణ్య గత 20 రోజులుగా నవీన్‌కుమార్‌తో మాట్లాడడం మానేసింది. ఫోన్ కూడా తీయడం లేదు. దీంతో సోమవారం ఉదయం చిదంబరానికి వచ్చిన నవీన్కుమార్నేరుగా లావణ్య ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి గేటుముందే నిలబడి మాట్లాడుకోవడంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో కోపగించుకున్న నవీన్‌కుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి విచక్షణారహితంగా ముఖంపై కత్తితో దాడిచేశాడు. లావణ్య పెట్టిన కేకలకు పరిసరాల్లోని ఆటో డ్రైవర్లు ఉలిక్కిపడి ప్రేమోన్మాదిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అతడు కత్తితో బెదిరించడంతో బలమైన రాళ్లు విసిరి యువతిని రక్షించారు. తీవ్రరక్తస్రావం అవుతున్న స్థితిలో సమీపంలోని లావణ్యను ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికులు నవీన్‌కుమార్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్రగాయాలకు గురైన అన్ని ఆసుపత్రిలో చేర్పించి అన్నామలైనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాట్పాడిలో.. వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన షబ్బీర్ (23) అనే ఎంబీఏ విద్యార్థి అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధించేవాడు. మతం మార్చుకుని పెళ్లి చేసుకుందాం..లేకుంటే చంపేస్తాను అని బెదిరించేవాడు. దీంతో యువతి తల్లిదండ్రులు గత నెల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో రోడ్డుపై నడిచి వెళుతున్న యువతిని అడ్డుకుని షబ్బీర్ కత్తితో గొంతుకోశాడు. ఆమె పెట్టిన కేకలతో జనం అక్కడికి చేరడంతో అతను పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. వేలూరు పోలీసులు షబ్బీర్‌ను అరెస్ట్ చేశారు. -
మండలిలో ఇసుక దుమారం
అధికార, విపక్షాల మధ్య రచ్చ ⇒ మాఫియాకు టీఆర్ఎస్ అండ ⇒ విచారణ జరిపితే నిరూపిస్తా: పొంగులేటి ⇒ వంద ఎలుకలు తిన్న పిల్లి కాంగ్రెస్.. ⇒ ఇసుకపై భారీగా ఆదాయం: కేటీఆర్ ⇒ టియర్ గ్యాస్ దెబ్బకు పారిపోయావ్ ⇒ కేటీఆర్‌పై షబ్బీర్ వ్యాఖ్యలు.. దుమారం ⇒ విచారణకు కాంగ్రెస్ డిమాండ్.. వాకౌట్ సాక్షి, హైదరాబాద్: అధికార, విపక్ష సభ్యుల మధ్య ఇసుక మాఫియా ఆరోపణలు, ప్రత్యారోపణలతో శుక్రవారం శాసనమండలి దద్దరిల్లింది. ఇసుక మాఫియాకు అధికార సభ్యుల అండదండలున్నాయన్న విపక్ష సభ్యుల ఆరోప ణలతో గందరగోళం మొదలైంది. ఇసుక సరఫరాపై ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియాపై న్యాయ విచారణ లేదా సభా సంఘం విచారణకు డిమాండ్ చేసింది. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వాకౌట్ చేసింది. ఉమ్మడి ఏపీలో, ప్రస్తుత తెలంగాణ చరిత్రలోనే మునుపెన్నడూలేని విధంగా మిషన్ భగీరథ, కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్రూంలు, పంచాయతీరాజ్, మున్సి పల్ శాఖల పనులు జరుగుతుండడంతో ఇసు కకు బాగా డిమాండ్ పెరగడం నిజమేనని కేటీ ఆర్ అన్నారు. ‘‘ఉమ్మడి ఏపీలో 2007–13 మధ్య తెలంగాణ ప్రాంతంలో ఇసుకపై ఆదా యం రూ.10 కోట్లకు మించలేదు. తెలంగాణ ఏర్పడ్డాక అవినీతిని అరికట్టి పకడ్బందీగా వ్యవహరించడంతో 2015–16లో రూ.375 కోట్లు, 2016–17లో ఇప్పటికే రూ.440 కోట్లు వచ్చింది. ఇసుక అక్రమాలను అరికట్టి వేసిన పెనాల్టీల ద్వారానే రూ.11 కోట్లు వచ్చింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక ఆదాయం కంటే ఎక్కువన్నమాట!’’ అని చెప్పారు. ఆడలేక మద్దెల ఓడు: షబ్బీర్ కేటీఆర్ సమాధానం అస్పష్టంగా ఉందని అంతకుముందు పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్) అన్నారు. ‘‘ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్, గోదావరి పరిసర ప్రాంతాల్లో ఇసుక మాఫియా చెలరేగుతోంది. ఇందుకు అధికార పార్టీ సభ్యుల అండదండలున్నాయి. న్యాయ విచారణకు ఆదేశిస్తే నిరూపిస్తా. నిరూపించలేకపోతే ఖమ్మం ఖిల్లా దగ్గర ఏ శిక్షయినా అనుభవిస్తా’’ అని సవాలు విసిరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యులు, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విచారణకు సిద్ధమని, ఏ పార్టీ వారి ప్రమేయమున్నా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు. గత తప్పులను సరిచేసుకుంటూ వెళ్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ప్రభుత్వం టీఆర్ఎస్దే అయినా ఆడలేక మద్దెల ఓడన్నట్టు ప్రతిదానికీ గత ప్రభుత్వాలు, ఉమ్మడి ఏపీ అంటూ మంత్రులు మాట్లాడుతున్నారని షబ్బీర్ అలీ అభ్యంతరపెట్టారు. దాంతో, రాష్ట్రంలో 45 ఏళ్లు అధికారంలో ఉండి కుంభకోణాలు, అక్రమాలకు పాల్పడిందెవరో ప్రజలకు తెలుసంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. వారి తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో కూర్చుని గడ్డాలు, మీసాలు పెంచినంత మాత్రాన ఏదో అయిపోదని, ఇసుకపై తాను చెప్పింది తప్పయితే దేనికైనా సిద్ధమని కేటీఆర్ అన్నారు. విషయాన్ని ఆయన పక్కదారి పట్టిస్తున్నారంటూ షబ్బీర్ మండిపడ్డారు. ఉద్యమ సందర్భంగా హైదరాబాద్ సీతాఫల్మండిలో పోలీసులు టియర్ గ్యాస్ వదలగానే పారిపోయిన వ్యక్తి కేటీఆర్ అని విమర్శించారు. సంబంధిత పేపర్ క్లిప్పింగులు కూడా చూపుతానన్నారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో గందరగోళం ఏర్పడింది. కేటీఆర్ ఉద్యమంలో పాల్గొన్నదీ, పారిపోయిందీ ప్రజలకు తెలుసని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వాళ్ళను మాత్రం ప్రజలు పారదోలారన్నారు. -
శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు
జిల్లాకో క్రీడా పాఠశాల: పద్మారావు సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో జిల్లాకో క్రీడా పాఠశాల ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి పద్మారావు గౌడ్ తెలిపారు. ప్రస్తుతం రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో ఉన్న క్రీడా పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీలనూ క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు కృషి చేస్తానని, ఇందుకోసం విద్యా మంత్రితో మాట్లాడతానని మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ప్రభుత్వాస్పత్రులంటే ప్రజల్లో భయం ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్యం అందని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చికిత్స కోసం వెళ్తే ప్రాణం పోతుందన్న భయం పేదల్లో నెలకొందని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని అవకాశంగా చేసుకొని ప్రైవేటు ఆసుపత్రులు పేదలను దోపిడీ చేస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్‌కే ఇటీవల ఎదురైందని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి పేర్కొన్నారు. దీనిపై మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిస్తూ గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యాన్ని తమ ప్రభుత్వం సరిదిద్దుకుంటూ వస్తోందన్నారు. ఆలయ భూములపై చర్యలేవీ?: షబ్బీర్ రాష్ట్రంలో దేవాలయ భూములు స్వాహా అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. దీన్ని నియంత్రించేందుకు వెంటనే టాస్క్ఫోర్సు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు వారి నిధుల నుంచి కొంతమొత్తాన్ని విడుదల చేసినా దేవాదాయశాఖ మాత్రం కామన్‌గుడ్ ఫండ్ నుంచి చిల్లిగవ్వ కూడా ఇవ్వటం లేదన్నా. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో దేవాలయాల కింద 82 వేల ఎకరాల భూమి ఉన్నా అందులో పెద్ద మొత్తం కబ్జాలో ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కొత్త కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలు కొత్తగా ఏర్పడ్డ అన్ని పోలీసు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి నాయిని ప్రకటించారు. వీటి వల్ల నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాచకొండ కమిషనరేట్ ప్రధాన కార్యాలయాన్ని ఎల్బీనగర్లో ఏర్పా టు చేస్తున్నట్టు వెల్లడించారు. దాన్ని భువనగిరిలో ఏర్పాటు చేయాలని సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కోరారు. ఇటీవల పోలీసు ఆత్మహత్యలు పెరిగినందున వారిలో ఆత్మస్థయిర్యం నింపేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు నారదాసు, భానుప్రసాద్‌లు కోరగా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రైతు బజార్లన్నీ నగదు రహితం: హరీశ్ వచ్చే రెండు, మూడు వారాల్లో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో నగదురహిత లావాదేవీలు ప్రారంభించనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం శాసన మండలిలో ప్రకటించారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని కూకట్పల్లి రైతు బజార్లో ఈ విధానం ప్రారంభించాక కొనుగోళ్లు పెరిగాయని, రైతులు, వినియోగదారులు దీన్ని స్వాగతించడంతో ఈ విధానాన్ని అన్ని రైతు బజార్లలో ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. -
రాష్ట్రంలో సాగు సంక్షోభం
• టీఆర్ఎస్ వచ్చాక ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోరుుంది • రైతు గర్జన సభలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మండిపాటు అచ్చంపేట: రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం సంక్షోభంలో పడిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పిన సీఎం.. 9 ఎకరాల్లో కోట్లు ఖర్చుచేసి ఇల్లు కట్టుకున్నా రన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన రైతుగర్జన సభలో ఉత్తమ్ మాట్లాడారు. ‘‘2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులు ఉంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో 70 లక్షలు, 2016లో 50 లక్షల టన్నులకు పడిపోరుుంది. 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క అచ్చంపేటలో 50 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. పరిహారం ఇవ్వొదన్న ఉద్దేశంతో ఆ మర ణాలను రైతు ఆత్మహత్యలుగా ఎఫ్ఐఆర్ చేమొద్దంటూ పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖలకు ఆదేశాలు ఇచ్చారు’’ అని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రూ.3 వేల కోట్ల అప్పు వస్తుందని, వాటిని రుణమాఫీకి ఇస్తామని చెప్పినా అతీగతి లేదన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం రూ.22 వేల కోట్ల అప్పు తెచ్చిందని అరుునా రుణమాఫీకి నిధులిచ్చేందుకు మనసు రావడం లేదన్నారు. బ్యాంకుల్లో 37 లక్షల మంది రైతుల పట్టాదారు పుస్తకాలు, 3.50 లక్షల మహిళల బంగారం తాకట్టులో ఉన్నాయని పేర్కొన్నారు. 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులు చెల్లించడం లేదన్నారు. కేంద్రం అనాలోచితంగా పెద్దనోట్లు రద్దు చేసినా సీఎం కేసీఆర్ నోరుమెదపడం లేదన్నారు. రూ.60 వేల కోట్ల అప్పు: షబ్బీర్ 60 ఏళ్లలో రాష్ట్రంలో రూ.60 వేల కోట్ల అప్పులు ఉంటే టీఆర్ఎస్ రెండున్నర ఏళ్లలో రూ.60 వేల కోట్ల అప్పులు చేసిందని మండలి విపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. రుణమాఫీపై ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. సభలో ఎంపీ నంది ఎల్లయ్య, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, రంగారెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వడ్డీలకే సరిపోతుంది: భట్టి ప్రభుత్వం చేసిన రుణమాఫీ రైతుల వడ్డీలకే సరిపోతుందని టీపీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాచరిక వ్యవస్థ నడుస్తోందన్నారు. విద్యా ర్థులకు రెండు జతల బట్టలు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనానికి నిధులు ఇవ్వడం లేదన్నారు. వలంటీర్లకు ఏడునెలలుగా జీతాలు లేవని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులేవి?: డీకే పంట నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.790 కోట్లు ఇస్తే రైతులకు ఇవ్వకుండా పక్కదారి పట్టించారని మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించారు. వైఎస్ హయంలో సీఎం నివాసం, క్యాంప్ ఆఫీస్ కట్టిస్తే అది కాదని సీఎం కేసీఆర్ కొత్త బంగ్లా కట్టించుకున్నారని విమర్శించారు. వాస్తు బాగాలేదని, కొడుకు సీఎం కాడని, అల్లుడు ఎక్కడ సీఎం అవుతాడోనని ముఖ్యమంత్రి భయపడుతున్నారన్నారు. -
కేసీఆర్.. నీకెందుకీ దుర్గతి?
నల్లధనాన్ని మార్చుకునేందుకే కేంద్రంతో రాయబారాలు: షబ్బీర్ సాక్షి, హైదరాబాద్: నోట్లు మార్చుకోలేక రాష్ట్రంలో ఇప్పటికే ఏడుగురు చనిపోరుునా సీఎం కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ ప్రశ్నించారు. చనిపోరుున వారి అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేని దుస్థితిలో ప్రజలు అల్లాడుతున్నా... కేసీఆర్ మాత్రం ప్రధాని మోదీ అపారుుంట్‌మెంట్ కోసం పాకులాడాల్సిన దుర్గతి ఎందుకు పట్టిందో చెప్పాలని పేర్కొన్నారు. తన వద్ద భారీగా ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకే కేసీఆర్ మోదీ అపారుుంట్‌మెంట్ కోసం పాకులాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా హాల్లో షబ్బీర్‌అలీ విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రానికి చేసిన లాభమేమీ లేదని, పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. అరుునప్పటికీ కేంద్రం వద్ద కేసీఆర్ ఎందుకు బలహీనమయ్యారో అర్థం కావడం లేదన్నారు. నల్లధనం విషయంలో బీజేపీ మిత్రపక్షమైన శివసేన వంటి పార్టీలు సైతం జనం పక్షాన నిలిచి పోరాడుతుంటే.. కేసీఆర్ తటస్థ వైఖరి అవలంబించడం విడ్డూరమని చెప్పారు. ఇప్పటికై నా కేసీఆర్ బయటికొచ్చి మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో వేల కోట్ల ఆస్తులున్న రిలయన్స, టాటా, బిర్లా వంటి పారిశ్రామికవేత్తలంతా హారుుగా నిద్రపోతున్నారని, పేదలు మాత్రం చలిలో గంటల తరబడి బ్యాంకుల వద్ద క్యూ కడుతూ కష్టాల పాలవుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకులకు వేలాది కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోరుున విజయ్ మాల్యాకు రుణమాఫీ చేయడం సిగ్గుమాలిన చర్య అని.. దీనిపై పార్లమెంట్లో సమాధానం చెప్పకుండా మోదీ పారిపోతున్నారని విమర్శించారు. -
సచివాలయాన్ని కూల్చొద్దు
గవర్నర్‌ను కలసిన ఉత్తమ్, జానా, షబ్బీర్ ►ప్రజాధనం వృథా చేయకుండా సీఎంను అడ్డుకోవాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యల పరిష్కారానికి నిధుల్లేవంటున్న ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోట్లాది రూపా యలను వృథా చేయకుండా తగిన చర్యలను తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ప్రతి పక్షనాయకులు కె.జానా రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి వినతిపత్రాన్ని సమర్పిం చారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, వాస్తు బాగా లేదనే సాకుతో సచి వాలయాన్ని కూల్చే యాలని సీఎం కేసీఆర్ నిర్ణరుుంచడం దుర్మార్గమన్నారు. పటిష్టంగా ఉన్న భవనాలతో రెండు రాష్ట్రాలకు సరిపోయే స్థారుులో సచివాలయం ఉందన్నారు. వాస్తు పేరుతో కూల్చివేయడానికి, కొత్తగా నిర్మించడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో కోర్టు వివరణ కోరిందని, సచివాలయంలో అగ్ని ప్రమాదాలకు సంబంధించి సరైన జాగ్రత్తలు లేవని, అవన్నీ పాతభవనాలు అని.. ప్రభుత్వం వాదించడం వింతగా ఉందన్నారు. సచి వాలయంలోని చాలా భవనాలను ఇటీవలనే నిర్మించారని, మరో 20 ఏళ్ల వరకు వాటి మనుగడకు ఇబ్బందిలేదని అన్నారు. జెడ్‌ప్లస్ భద్రతలో ఉన్న ముఖ్యమంత్రులుగా వై.ఎస్. రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డితో పాటు అంతకుముందు చాలామంది ఇదే సచివాలయంలో పనిచేశారని ఉత్తమ్ గుర్తుచేశారు. రైతుల రుణమాఫీ, విద్యా ర్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ కి నిధుల్లేవంటున్న ముఖ్యమంత్రి.. సచివాలయాన్ని కూల్చడానికి వందలకోట్లు ఎందుకు వృథా చేస్తున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే పండుగలు, వాస్తుదోషాలు అంటూ కోట్లాది రూపా యల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తు న్నారని విమర్శించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని, ఆయన ప్రజల ప్రయోజ నాలను కాపాడతారనే విశ్వాసం తమకుం దని ఉత్తమ్ చెప్పారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సచివాలయం ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉం దన్నారు. కేవలం తన కొడుకు ముఖ్యమంత్రి కాడేమోననే భయంతోనే సచివాలయాన్ని కూల్చాలని సీఎం కేసీఆర్ ప్రయత్ని స్తున్నారని ఆరోపిం చారు. ప్రజల అవసరాల కోసం కాకుండా, కేవలం తన వ్యక్తిగత విశ్వాసాలకోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మంచిదికాదని జీవన్‌రెడ్డి హితవు పలికారు. -
సీబీఐతో విచారణ జరిపించాలి: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఐదు రాష్ట్రాల వారితో ఈ కేసుకు సంబంధాలు ఉన్నాయన్నారు. కేవలం తెలంగాణ అధికారులతో విచారణ సాధ్యమేనా అని ప్రశ్నించారు. నయీమ్ డైరీలో ఉన్న పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదనిప్రశ్నించారు. కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. -
ఫేస్బుక్లో పరిచయం.. ఆపై కిడ్నాప్
మంగళూరు: ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ బాలికను బుట్టలో పడేశాడు. కలుద్దామని చెప్పి పిలిపించి ఆమెను కిడ్నాప్ చేశాడు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళూరులోని స్టేట్‌బ్యాంకు సమీపంలో ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమ్మాయికి, అదే ప్రాంతానికి చెందిన షబ్బీర్(24) అనే యువకుడు ఏడాది క్రితం ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అవి నమ్మిన ఆ అమ్మాయి ఈ నెల 9 న స్కూల్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి మొదటిసారి షబ్బీర్‌ను కలవడానికి వెళ్లింది. చీకటి పడుతున్నా కుమార్తె ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విద్యార్థిని ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో ఓ ఇంటిలో బాధితురాలు నిర్బంధానికి గురైనట్లు గుర్తించారు. ఈ నెల 11న బాలికను విడిపించి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. షబ్బీర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా స్నేహితులు షాకీర్, అజార్ సహాయంతో బాలికను కిడ్నాప్ చేసినట్టు అంగీకరించాడు. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. -
‘కంగారు’ పడ్డా కొట్టేశారు
► బంగ్లాదేశ్‌పై మూడు వికెట్లతో ఆసీస్ విజయం ► సెమీస్ అవకాశాలు సజీవం బెంగళూరు: టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆశలు సజీవంగా నిలిచాయి. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి టోర్నీలో తొలి విజయం సాధించింది. అటు బంగ్లాదేశ్ వరుసగా రెండో ఓటమితో దాదాపుగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా... బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసింది. ఆరంభంలోనే సర్కార్, షబ్బీర్ల వికెట్లు కోల్పోయినా.... మిథున్ (22 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్సర్), షకీబ్ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. చివర్లో మహ్మదుల్లా (29 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సర్) సంచలన షాట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోరు లభించింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా, వాట్సన్ రెండు వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా జట్టు 18.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (45 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్సర్), వాట్సన్ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌కు 44 బంతుల్లోనే 62 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. స్మిత్ (13 బంతుల్లో 14; 1 సిక్సర్), వార్నర్ (9 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్సర్) ఎక్కువసేపు నిలబడలేదు. మధ్య ఓవర్లలో బంగ్లాదేశ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచినా... మ్యాక్స్‌వెల్ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చకచకా పరుగులు చేశాడు. రెండు సులభమైన క్యాచ్‌లను వదిలేయడం బంగ్లాదేశ్‌ను దారుణంగా దెబ్బతీసింది. షకీబ్ మూడు, ముస్తాఫిజుర్ రెండు వికెట్లు తీసుకున్నారు. జంపాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: మిథున్ (సి) వాట్సన్ (బి) జంపా 23; సౌమ్య సర్కార్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) వాట్సన్ 1; షబ్బీర్ (సి) ఫాల్క్‌నర్ (బి) వాట్సన్ 12; షకీబ్ (సి) కౌల్టర్ నైల్ (బి) జంపా 33; షువగత ఎల్బీడబ్ల్యు (బి) జంపా 13; మహ్మదుల్లా నాటౌట్ 49; ముష్ఫికర్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1-2; 2-25; 3-62; 4-78; 5-105. బౌలింగ్: కౌల్టర్ నైల్ 4-0-21-0; వాట్సన్ 4-0-31-2; హేస్టింగ్స్ 3-0-24-0; మిషెల్ మార్ష్ 1-0-12-0; మ్యాక్స్‌వెల్ 1-0-12-0; ఆడమ్ జంపా 4-0-23-3; ఫాల్క్‌నర్ 3-0-26-0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖవాజా (బి) అల్ అమిన్ 58; వాట్సన్ రనౌట్ 21; స్టీవ్ స్మిత్ (బి) ముస్తాఫిజుర్ 14; వార్నర్ (సి) అండ్ (బి) షకీబ్ 17; మ్యాక్స్‌వెల్ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) షకీబ్ 26; మిషెల్ మార్ష్ (సి) షకీబ్ (బి) ముస్తాఫిజుర్ 6; ఫాల్క్‌నర్ నాటౌట్ 5; హేస్టింగ్స్ (సి) సర్కార్ (బి) షకీబ్ 3; నెవిల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.3 ఓవర్లలో ఏడు వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-62; 2-95; 3-115; 4-119; 5-135; 6-148; 7-152. బౌలింగ్: మొర్తజా 1-0-9-0; మహ్మదుల్లా 2-0-22-0; అల్ అమిన్ 2-0-14-1; ముస్తాఫిజుర్ 4-0-30-2; షకీబ్ 4-0-27-3; సాజిబ్ 3.3-0-40-0; షువగత 2-0-13-0. -
ఫైనల్లో బంగ్లాదేశ్
తమ ఆఖరి మ్యాచ్‌లో పాక్‌పై విజయం లంక కూడా అవుట్ మిర్పూర్: సొంతగడ్డపై బంగ్లాదేశ్ మరోసారి బెబ్బులిలా గర్జించింది. ఆసియా కప్ టి20 టోర్నీలో సగర్వంగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం ఇక్కడి షేర్ ఎ బంగ్లా స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ (42 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (30 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో పాక్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం బంగ్లా 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సౌమ్య సర్కార్ (48 బంతుల్లో 48; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా, చివర్లో మహ్ముదుల్లా (15 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు. చివరి 2 ఓవర్లలో బంగ్లా విజయానికి 18 పరుగులు కావాల్సి ఉండగా, సమీ వేసిన 19వ ఓవర్లోనే బంగ్లా 15 పరుగులు రాబట్టి విజయం దిశగా దూసుకుపోయింది. టోర్నీలో మూడు మ్యాచ్‌లు నెగ్గిన బంగ్లా ఫైనల్‌కు అర్హత సాధించగా... పాకిస్తాన్, శ్రీలంక ఇంటిముఖం పట్టనున్నాయి. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది. పాక్, శ్రీలంకల నామమాత్రపు ఆఖరి లీగ్ మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఖుర్రం (సి) ముష్ఫికర్ (బి) హుస్సేన్ 1; షర్జీల్ (బి) సన్నీ 10; హఫీజ్ (ఎల్బీ) (బి) మొర్తజా 2; సర్ఫరాజ్ (నాటౌట్) 58; అక్మల్ (సి) షకీబ్ (బి) తస్కీన్ 4; మాలిక్ (సి) షబ్బీర్ (బి) సన్నీ 41; ఆఫ్రిది (సి) షబ్బీర్ (బి) హుస్సేన్ 0; అన్వర్ (సి) షబ్బీర్ (బి) హుస్సేన్ 13; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1-1; 2-12; 3-18; 4-28; 5-98; 6-102; 7-129. బౌలింగ్: తస్కీన్ 4-1-14-1; హుస్సేన్ 4-0-25-3; సన్నీ 4-0-35-2; మొర్తజా 4-0-29-1; షకీబ్ 4-0-26-0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (ఎల్బీ) (బి) ఇర్ఫాన్ 7; సర్కార్ (బి) ఆమిర్ 48; షబ్బీర్ (బి) ఆఫ్రిది 14; ముష్ఫికర్ (ఎల్బీ) (బి) మాలిక్ 12; షకీబ్ (బి) ఆమిర్ 8; మహ్ముదుల్లా (నాటౌట్) 22; మొర్తజా (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1-13; 2-46; 3-83; 4-88; 5-104. బౌలింగ్: ఆమిర్ 4-0-26-2; ఇర్ఫాన్ 4-0-23-1; సమీ 4-0-30-0; ఆఫ్రిది 4-0-20-1; అన్వర్ 2.1-0-25-0; మాలిక్ 1-0-3-1. -
బాహుబలిలా ప్రయత్నించి.. ప్రాణం కోల్పోయాడు
పెద్దపల్లి (కరీంనగర్): ఎంతో ఎత్తయిన కొండపై నుంచి జలపాతాలు ఎగసి పడుతుంటే ఆ కొండపైకి చేరుకోవాలన్న పట్టుదలతో శివుడు (ప్రభాస్) పడే కష్టాన్ని బాహుబలి సినిమాలో చూసే ఉంటారు. అది సినిమా. కానీ, వాస్తవంలో అలానే ప్రయత్నించి ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సినిమాలో అయితే సెట్టింగులు, వెనక రక్షణ కోసం వైర్లు.. అన్నీ ఉంటాయి. నిజజీవితంలో అవేవీ ఉండవని తెలియక.. పట్టుమని పాతికేళ్లు కూడా రాకుండానే ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఎలుకలపల్లి గ్రామానికి చెందిన షబ్బీర్ (23) శుక్రవారం స్నేహితులతో కలిసి పెద్దపల్లి మండలం గట్టు సింగారం జలపాతాలు చూసేందుకు వెళ్లాడు. స్నేహితుల ముందు అతడు వీరోచిత ప్రదర్శనలు చేయాలనుకున్నాడేమో! కొండ పైన ఫీట్లు చేస్తుండగా జారి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మైక్రో ఓవెన్ లో బంగారం ..
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహంచారు. ఈ సందర్భంగా మైక్రో ఓవెన్లో బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన షబ్బీర్ అనే ప్రయాణికుడి వద్ద నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షబ్బీర్ స్వస్థలం చెన్నై. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.