
సీబీఐతో విచారణ జరిపించాలి: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఐదు రాష్ట్రాల వారితో ఈ కేసుకు సంబంధాలు ఉన్నాయన్నారు. కేవలం తెలంగాణ అధికారులతో విచారణ సాధ్యమేనా అని ప్రశ్నించారు. నయీమ్ డైరీలో ఉన్న పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదనిప్రశ్నించారు. కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.