![నయీం కేసులో నివేదికకు హైకోర్టు ఆదేశం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/81474286614_625x300_5.jpg.webp?itok=Xs3ncgDT)
నయీం కేసులో నివేదికకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీముంద్దీన్ కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మూడు వారాల్లోగా విచారణ నివేదిక సమర్పించటంతో పాటు, కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఈ సందర్భంగా సిట్ను ఆదేశించింది. తదుపరి విచారణను మూడువారాల పాటు వాయిదా వేసింది.
కాగా గ్యాంగ్‌స్టర్ నయీం కేసుపై సీపీఐ నేత నారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా సిట్ దర్యాప్తు ముందుకు సాగటం లేదని సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. ప్రతివాదులుగా కేంద్ర, తెలంగాణ హోంశాఖలు, తెలంగాణ డీజీపీ, సీబీఐలను చేర్చారు. అయితే ఇప్పటికిప్పుడు సీబీఐ విచారణకు ఆదేశించలేమని, సిట్ నివేదికతో పాటు కౌంటర్ దాఖలు అనంతరం పరిశీలన చేస్తామని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.