ఆదివారం అచ్చంపేటలో జరిగిన సభలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్
• టీఆర్‌ఎస్ వచ్చాక ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోరుుంది
• రైతు గర్జన సభలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మండిపాటు
అచ్చంపేట: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం సంక్షోభంలో పడిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పిన సీఎం.. 9 ఎకరాల్లో కోట్లు ఖర్చుచేసి ఇల్లు కట్టుకున్నా రన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన రైతుగర్జన సభలో ఉత్తమ్ మాట్లాడారు. ‘‘2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులు ఉంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో 70 లక్షలు, 2016లో 50 లక్షల టన్నులకు పడిపోరుుంది. 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఒక్క అచ్చంపేటలో 50 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. పరిహారం ఇవ్వొదన్న ఉద్దేశంతో ఆ మర ణాలను రైతు ఆత్మహత్యలుగా ఎఫ్‌ఐఆర్ చేమొద్దంటూ పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖలకు ఆదేశాలు ఇచ్చారు’’ అని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రూ.3 వేల కోట్ల అప్పు వస్తుందని, వాటిని రుణమాఫీకి ఇస్తామని చెప్పినా అతీగతి లేదన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం రూ.22 వేల కోట్ల అప్పు తెచ్చిందని అరుునా రుణమాఫీకి నిధులిచ్చేందుకు మనసు రావడం లేదన్నారు. బ్యాంకుల్లో 37 లక్షల మంది రైతుల పట్టాదారు పుస్తకాలు, 3.50 లక్షల మహిళల బంగారం తాకట్టులో ఉన్నాయని పేర్కొన్నారు. 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులు చెల్లించడం లేదన్నారు. కేంద్రం అనాలోచితంగా పెద్దనోట్లు రద్దు చేసినా సీఎం కేసీఆర్ నోరుమెదపడం లేదన్నారు.
రూ.60 వేల కోట్ల అప్పు: షబ్బీర్
60 ఏళ్లలో రాష్ట్రంలో రూ.60 వేల కోట్ల అప్పులు ఉంటే టీఆర్‌ఎస్ రెండున్నర ఏళ్లలో రూ.60 వేల కోట్ల అప్పులు చేసిందని మండలి విపక్షనేత షబ్బీర్ అలీ విమర్శించారు. రుణమాఫీపై ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. సభలో ఎంపీ నంది ఎల్లయ్య, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, రంగారెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వడ్డీలకే సరిపోతుంది: భట్టి
ప్రభుత్వం చేసిన రుణమాఫీ రైతుల వడ్డీలకే సరిపోతుందని టీపీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాచరిక వ్యవస్థ నడుస్తోందన్నారు. విద్యా ర్థులకు రెండు జతల బట్టలు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనానికి నిధులు ఇవ్వడం లేదన్నారు. వలంటీర్లకు ఏడునెలలుగా జీతాలు లేవని పేర్కొన్నారు.
కేంద్రం ఇచ్చిన నిధులేవి?: డీకే
పంట నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.790 కోట్లు ఇస్తే రైతులకు ఇవ్వకుండా పక్కదారి పట్టించారని మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నించారు. వైఎస్ హయంలో సీఎం నివాసం, క్యాంప్ ఆఫీస్ కట్టిస్తే అది కాదని సీఎం కేసీఆర్ కొత్త బంగ్లా కట్టించుకున్నారని విమర్శించారు. వాస్తు బాగాలేదని, కొడుకు సీఎం కాడని, అల్లుడు ఎక్కడ సీఎం అవుతాడోనని ముఖ్యమంత్రి భయపడుతున్నారన్నారు.