కేసీఆర్.. నీకెందుకీ దుర్గతి?
నల్లధనాన్ని మార్చుకునేందుకే కేంద్రంతో రాయబారాలు: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: నోట్లు మార్చుకోలేక రాష్ట్రంలో ఇప్పటికే ఏడుగురు చనిపోరుునా సీఎం కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ ప్రశ్నించారు. చనిపోరుున వారి అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేని దుస్థితిలో ప్రజలు అల్లాడుతున్నా... కేసీఆర్ మాత్రం ప్రధాని మోదీ అపారుుంట్‌మెంట్ కోసం పాకులాడాల్సిన దుర్గతి ఎందుకు పట్టిందో చెప్పాలని పేర్కొన్నారు. తన వద్ద భారీగా ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకే కేసీఆర్ మోదీ అపారుుంట్‌మెంట్ కోసం పాకులాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా హాల్‌లో షబ్బీర్‌అలీ విలేకరులతో మాట్లాడారు.
కేంద్రం ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రానికి చేసిన లాభమేమీ లేదని, పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. అరుునప్పటికీ కేంద్రం వద్ద కేసీఆర్ ఎందుకు బలహీనమయ్యారో అర్థం కావడం లేదన్నారు. నల్లధనం విషయంలో బీజేపీ మిత్రపక్షమైన శివసేన వంటి పార్టీలు సైతం జనం పక్షాన నిలిచి పోరాడుతుంటే.. కేసీఆర్ తటస్థ వైఖరి అవలంబించడం విడ్డూరమని చెప్పారు. ఇప్పటికై నా కేసీఆర్ బయటికొచ్చి మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నోట్ల రద్దుతో వేల కోట్ల ఆస్తులున్న రిలయన్‌స, టాటా, బిర్లా వంటి పారిశ్రామికవేత్తలంతా హారుుగా నిద్రపోతున్నారని, పేదలు మాత్రం చలిలో గంటల తరబడి బ్యాంకుల వద్ద క్యూ కడుతూ కష్టాల పాలవుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకులకు వేలాది కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోరుున విజయ్ మాల్యాకు రుణమాఫీ చేయడం సిగ్గుమాలిన చర్య అని.. దీనిపై పార్లమెంట్‌లో సమాధానం చెప్పకుండా మోదీ పారిపోతున్నారని విమర్శించారు.