గురుశిష్యుల కథ | C Kalyan bags Prabhudeva's 'Lakshmi' rights | Sakshi
Sakshi News home page

గురుశిష్యుల కథ

Published Sat, Aug 4 2018 1:57 AM | Last Updated on Sat, Aug 4 2018 1:57 AM

C Kalyan bags Prabhudeva's 'Lakshmi' rights - Sakshi

ప్రభుదేవా

ప్రభుదేవా, ఐశ్వర్యా రాజేష్, దిత్య బండే ముఖ్య తారలుగా దర్శకుడు ఏ.యల్‌. విజయ్‌ తెరకెక్కించిన డ్యాన్స్‌ బేస్డ్‌ మూవీ ‘లక్ష్మి’. ఓ రియాలిటీ షో విజేతగా నిలిచిన బేబి దిత్య బండే ఈ సినిమాతో నటిగా పరిచయం కానుంది. ఈ సినిమా హక్కులను నిర్మాత సి. కల్యాణ్‌ సొంతం చేసుకున్నారు. ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్‌. రవీంద్రన్‌ నిర్మాతలు.

ఈ సినిమాలో దిత్యకు డ్యాన్స్‌ గురువుగా ప్రభుదేవా కనిపిస్తారు. ‘‘రిలీజైన టీజర్స్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభుదేవా డ్యాన్సింగ్‌ ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆడియోను ఈ నెల 12న, సినిమాను  24న రిలీజ్‌ చేయబోతున్నాం. సామ్‌ సీఎస్‌ మంచి సంగీతం అందించారు’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement