టీడీపీ దర్శి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై కేసు | Sakshi
Sakshi News home page

టీడీపీ దర్శి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై కేసు

Published Thu, May 16 2024 8:42 AM

Case Filed On TDP Gottipati Lakshmi

ఎన్నికల అల్లర్లపై ఆరు కేసులు 

ఈవీఎం పగులగొట్టిన వ్యక్తి 

పోలీసుల నుంచి తప్పించుకుని పరారీ 

దర్శి: ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి మండలంలో జరిగిన పలు ఘటనల్లో 6 కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుమన్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..బొట్లపాలెంలో ఎన్నికల కోడ్‌ ఉన్న­ప్ప­టికీ గ్రామంలో పోలింగ్‌ ఆపాలని నిబంధనలకు విరుద్ధంగా ధర్నాకు దిగిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు ధర్నా చే­సిన వారి వివరాలు తెలుసుకుని కేసు­లు నమోదు చేయనున్నారు.

 దర్శిలోని ఎంపీడీవో కార్యాలయ ఆవ­రణలోని ఎంఈవో కార్యాల­యంలోని పోలింగ్‌ బూత్‌­లో ఈవీఎం పగులకొట్టిన టీడీపీ నేత వీసీ రెడ్డి పై కేసు నమోదైంది. ఆయనను పోలీసులు అదుపు­లో­­­కి తీసుకోగా కళ్లు తిరుగుతు­న్నాయని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి పోలీసులు కళ్లుగప్పి వీసీ రెడ్డి పరారయ్యాడు. పోలీసుల వైఫ­ల్యంపై భిన్న కథనాలు వినిపిస్తు­న్నా­యి. వీసీ రెడ్డి కోసం పోలీసు­లు వెతుకుతున్నారు. పట్టణంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యా­లయం వద్ద పోలింగ్‌ బూత్‌ వద్ద అల్లర్లు సృష్టించి పోలీసులపై రాళ్లు రువ్విన కేసులో దారం సుబ్బా­రావు పై కేసు నమోదు చేశారు. 

రాళ్లు రువ్విన వారి వీడియోలు పరిశీలించి బాధ్యు­లపై కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ చెప్పారు. బొట్ల­పాలెంలో జరిగిన గొడవల్లో క్షతగా­త్రు­లు ఇచ్చిన ఫిర్యాదులపై 2 కేసులు నమోదు చేసి ఇరువర్గాలపై కలిపి 22 మంది పై కేసులు నమోదు చేశారు. దేవవరంలో వైఎస్సార్‌­సీపీకి చెందిన కిష్టి­పాటి నాగిరెడ్డిని శేషంవారిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తులు దేవవరం వచ్చి తల పగులగొట్టిన కేసులో సానె గురువయ్య, సానె వీరాంజనేయులు, ఎ.నరసింహారావు, ఎస్‌.శ్రీను, అచ్చ­య్య, ముత్యాల నరశింహంపై కేసు నమోదు చేశారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement