లక్ష్మి నుంచి మరో ప్రోమో | Another Promo From Akshay Kumar Lakshmi Cinema | Sakshi
Sakshi News home page

లక్ష్మి సినిమా నుంచి మరో ప్రోమో

Published Fri, Nov 6 2020 3:20 PM | Last Updated on Fri, Nov 6 2020 3:48 PM

Another Promo From Akshay Kumar Lakshmi Cinema - Sakshi

అక్షయ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న లక్ష్మి సినిమా మరో మూడు రోజుల్లో  (నవంబర్ 9) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో హీరో అక్షయ్‌ కుమార్‌, యూనిట్‌ సినిమా ప్రమోషన్‌లో చాలా బిజీగా ఉన్నారు. కాంచన చిత్రం లక్ష్మి పేరుతో హిందీలో తెరకెక్కింది. ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో అక్షయ్‌ సరసన కియరా అద్వానీ నటిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోను అక్షయ్‌ కుమార్‌ తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. అక్షయ్‌ ఒక మహిళను కొట్టడంతో ఈ వీడియో మొదలవుతుంది.

అనంతరం గట్టిగా అరుస్తూ ఇక్కడి నుంచి పో అంటాడు. అది చూసి అందరూ షాక్‌ అవుతారు. అప్పుడు ఆ మహిళ కొట్టావు అంటూ అక్కడి నుంచి పాకుతూ వెళుతుంది. ఈ వీడియోలో అక్షయ్‌ చూడటానికి చాలా డిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. కాంచనా సినిమా ఎంత హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్ష్మి సినిమాపై కూడా ప్రస్తుతం భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేసిన అక్షయ్‌‌ చూశారుగా ఈ విచిత్రమైన కుటుంబాన్ని మీరంతా ‌9న చూడండి అంటూ ట్వీట్‌ చేశాడు. 

చదవండి: అక్ష‌య్‌ను టార్గెట్ చేసిన నెటిజ‌న్లు..తీరు మార్చుకోరా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement