ఆమె ఎమ్మెల్యే కాదు.. కనీసం సర్పంచ్ కూడా కాదు. కానీ, ఆమె ముందు ఎంత పెద్ద అధికారి అయినా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఏ అధికారైనా తన కుర్చీ ఆమెకి ఇచ్చేసి.. మీ దయ అంటూ ఆమె ఎదురుగా సదరు అధికారి నిల్చోవాల్సిందే లేదంటే కూర్చోవాల్సిందే. దీంతో, ఈ వ్యవహారం పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు? అనుకుంటున్నారా..
ఇక్కడ.. కుర్చీలో కూర్చొని దర్జాగా ఆదేశాలు జారీ చేస్తున్న ఈమె గొట్టిపాటి లక్ష్మీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి లక్ష్మీ ఓడిపోయారు. అయితే, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు స్వయానా అన్న కూతురు. అందుకే కాబోలు మా బాబాయి మంత్రి అనుకున్నారేమో .. దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇంఛార్జీగా ఉన్న ఆమె నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తున్నారు. తానే ఎమ్మెల్యే అన్నట్టుగా అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు.
దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ చైర్‌లోనే ఆమె కూర్చుంటే ఆయన మాత్రం వినయంగా గొట్టిపాటి లక్ష్మీ ఎదురుగా ప్లాస్టిక్ చైర్‌లో కూర్చొని వినయం ప్రదర్శించాడు. ఎమ్మెల్యే లెవెల్లో అధికారులుపై పెత్తనం చేశారు. ప్రజల బాగుకోసం ఆసుపత్రిని సందర్శిస్తే తప్పులేదు. కానీ, ఏకంగా సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చుని ఆయనను అవమానించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆమె ప్రవర్తన తీరును చూసి ఆసుపత్రి సిబ్బంది కూడా విస్తుపోయారు. మరోవైపు.. కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి దర్శిలో గొట్టిపాటి లక్ష్మీ, ఆమె బంధు వర్గం చేస్తున్న ఓవరాక్షన్‌పై నియోజకవర్గంలోని ప్రజలు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment