darshi
-
‘ఆమె ముందు చేతులు కట్టుకోవాలి.. చైర్లో కూర్చోకూడదు’
ఆమె ఎమ్మెల్యే కాదు.. కనీసం సర్పంచ్ కూడా కాదు. కానీ, ఆమె ముందు ఎంత పెద్ద అధికారి అయినా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఏ అధికారైనా తన కుర్చీ ఆమెకి ఇచ్చేసి.. మీ దయ అంటూ ఆమె ఎదురుగా సదరు అధికారి నిల్చోవాల్సిందే లేదంటే కూర్చోవాల్సిందే. దీంతో, ఈ వ్యవహారం పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు? అనుకుంటున్నారా..ఇక్కడ.. కుర్చీలో కూర్చొని దర్జాగా ఆదేశాలు జారీ చేస్తున్న ఈమె గొట్టిపాటి లక్ష్మీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి లక్ష్మీ ఓడిపోయారు. అయితే, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు స్వయానా అన్న కూతురు. అందుకే కాబోలు మా బాబాయి మంత్రి అనుకున్నారేమో .. దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇంఛార్జీగా ఉన్న ఆమె నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నారు. తానే ఎమ్మెల్యే అన్నట్టుగా అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు.దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ చైర్లోనే ఆమె కూర్చుంటే ఆయన మాత్రం వినయంగా గొట్టిపాటి లక్ష్మీ ఎదురుగా ప్లాస్టిక్ చైర్లో కూర్చొని వినయం ప్రదర్శించాడు. ఎమ్మెల్యే లెవెల్లో అధికారులుపై పెత్తనం చేశారు. ప్రజల బాగుకోసం ఆసుపత్రిని సందర్శిస్తే తప్పులేదు. కానీ, ఏకంగా సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చుని ఆయనను అవమానించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆమె ప్రవర్తన తీరును చూసి ఆసుపత్రి సిబ్బంది కూడా విస్తుపోయారు. మరోవైపు.. కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి దర్శిలో గొట్టిపాటి లక్ష్మీ, ఆమె బంధు వర్గం చేస్తున్న ఓవరాక్షన్‌పై నియోజకవర్గంలోని ప్రజలు మండిపడుతున్నారు. -
దర్శిలో బార్‌కు తాళం వేసిన టీడీపీ నేతలు
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో నూతన సంస్కృతికి తెరలేచింది. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే నరసరావుపేటకు చెందిన కొందరు వ్యక్తులు దర్శి వచ్చి ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు తాళాలు వేశారు. మూడు రోజులుగా బార్ అండ్ రెస్టారెంట్ తాళాలు ఇవ్వకుండా నిర్వాహకులను ఇబ్బందిపెడుతున్నారు. దీంతో ఎన్నడూ లేనివిధంగా ఈ కొత్తసంస్కృతి ఏమిటని జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు... ఎన్నికల కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు నరసరావుపేటకు చెందిన కొందరు టీడీపీ నాయకులు దర్శి వచ్చి పట్టణంలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్‌కు తాళాలు వేశారు. ఆ తర్వాత ‘పోలీస్ స్టేషన్లో తేల్చుకుందాం రండి..’ అని చెప్పి వెళ్లారని బార్లో పని చేసేవారు చెబుతున్నారు. నిర్వాహకులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. వారు తమకు సంబంధంలేదని, ఎక్సైజ్వారిని సంప్రదించండని చేతులు దులిపేసుకున్నారు. అనంతరం ఎక్సైజ్ అధికారులను నిర్వాహకులు కలవగా.. ‘బార్ మూసేస్తే పోలీసులను కలవండి. మాకు ఎలాంటి సంబంధం ఉండదు’ అని బదులిచ్చారు. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు.దీంతో మూడు రోజులుగా కేబీ బార్ అండ్ రెస్టారెంట్ తెరవలేదు. ఈ విషయంపై బార్ నిర్వాహకులు మాట్లాడుతూ ‘నరసరావుపేటకు చెందిన కొందరు టీడీపీ నాయకులు తమ బార్ అండ్ రెస్టారెంట్‌కు తాళాలు వేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళతాం’ అని చెప్పారు. -
దర్శి టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
దర్శి: టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గోరంట్ల రవికుమార్‌కు తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులు, వివిధ హోదాల్లోని నాయకులతో ఆ పార్టీ కార్యాలయంలో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. దర్శి మండల టీడీపీ కన్వీనర్ వెంకటేశ్వర్లు, పార్టీ పట్టణ అధ్యక్షుడు వాసు, ముండ్లమూరు మాజీ ఎంపీపీ వెంకట్రావు, కురిచేడు మండల మాజీ అధ్యక్షుడు నాగరాజు, దొనకొండ మండల అధ్యక్షుడు శివకోటేశ్వరరావు, తాళ్లూరు మండల అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. ఎవరినడిగి రవికుమార్‌ను ఇన్చార్జిగా రవికుమార్‌కు ఇచ్చారంటూ అధిష్టానంపై మండిపడ్డారు. అధిష్టానానికి అనుకూలంగా ఉండే రియల్టర్లు, డబ్బున్న వాళ్లను తెచ్చుకుంటున్నారని, వాళ్లు ఇక్కడ ఓడిపోగానే వెళ్లిపోతున్నారని, దీంతో ఇక్కడ పార్టీకి దిక్కు లేకుండాపోతోందన్నారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్లందరికీ దర్శి కనబడుతుందని, బయట నుంచి వచ్ఛిన మన్నెం వెంకటరమణ, కదిరి బాబూరావు, శిద్ధా రాఘవరావు, పమిడి రమేష్, వేమా సుబ్బారావు వంటివారు ఎన్నికలప్పుడు వచ్చి తర్వాత వెళ్లిపోయారని, అలాంటి నాయకులకు టికెట్లు ఇవ్వవద్దని కోరారు. స్థానికులు కాకపోవడం వల్ల ఓడిన వెంటనే వెళ్లిపోయి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామూహిక రాజీనామాలకు సిద్ధం దర్శి సీటును జనసేనకు ఇచ్చినా తమకు ఇబ్బంది లేదని.. ఇక్కడ నివాసం ఉండే వారికే టికెట్ వ్వాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. స్థానికులకు టికెట్ ఇవ్వకపోతే నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, మండల టీడీపీ అధ్యక్షులు, అన్ని హోదాల్లో ఉన్న నాయకులు రాజీనామాలకు సైతం సిద్ధమని ప్రకటించారు. ఇప్పటివరకు దర్శిలో టీడీపీ ఇన్చార్జ్ లేకపోయినా పార్టీ ఆదేశానుసారం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను తాము నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికిప్పుడు టీడీపీ ఇన్చార్జిని ప్రకటించడం బాధాకరమన్నారు. మూడేళ్లుగా టీడీపీకి నియోజకవర్గ ఇన్చార్జి లేకపోవడం, స్థానిక నాయకులతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా టీడీపీ ఇన్చార్జిని ప్రకటించడం చాలా బాధాకరమన్నారు. దీంతో సమావేశం ఆద్యంతం రసాభాసగా మారింది. గతంలో ఇన్చార్జిలను ప్రకటించినప్పుడు ఏం చేశారని రవికుమార్‌కు మద్దతుగా కొందరు మాట్లాడారు. దీంతో పారీ్టలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. -
ప్రకాశం: షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం.. 2కోట్ల నష్టం!
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దర్శి పట్టణంలోని అభి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాల ప్రకారం.. నగరంలోని అభి షాపింగ్ మాల్లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చేలరేగి ఎగిసిపడుతున్నాయి. ఇక, అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజిన్లు అక్కడకి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. ఫైర్ సిబ్బంది గంటకు పైగా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా షాపింగ్ మాల్లోని బట్టలు దగ్దమయ్యాయి. దీంతో, దాదాపు 2కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఏలూరు జిల్లా టీడీపీ బహిరంగ సభలో అపశ్రుతి -
దర్శి దాహార్తి తీరేలా.. ప్రత్యేక దృష్టి సారించిన సీఎం జగన్
దర్శి పట్టణవాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు పడుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రూ.121 కోట్లు మంజూరు చేశారు. రానున్న 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక టెండర్లు పిలవడమే తరువాయి. దీనిపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శి(ప్రకాశం జిల్లా): దర్శి పట్టణంలో 33,500 మంది జనాభా నివశిస్తున్నారు. అధికారికంగా పన్ను చెల్లిస్తున్న నివాసాలు 8,800 ఉండగా అనధికారికంగా 10 వేలకు పైగానే ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఉన్న నిమ్మలబావి కనెక్షన్లు 600, ఆర్డబ్ల్యూఎస్ కనెక్షన్లు 60, వీధి కుళాయిలు మరో 960 ఉన్నాయి. ప్రస్తుతం మూడు రోజులకు ఒక సారి నీరు అందుతోంది. 50 ఏళ్లు నీటి ఇబ్బందులు అధిగమించేలా: మరో 50 ఏళ్లు ఇంటింటికీ కుళాయి నీరు ఇచ్చి నీటి ఇబ్బందులు అధిగమించేలా సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. ఈ ఎస్ఎస్ ట్యాంక్‌లో 1600 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. రోజుకు 9 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి సరఫరా చేసేలా ప్రణాళికలు చేశారు. రోజుకు ఒక వ్యక్తికి 135 లీటర్ల నీరు సరఫరా చేస్తారు. కేటాయింపు ప్రణాళికలు ఇలా.. ఈ ప్రాజెక్ట్‌కు రూ.121 కోట్లు మంజూరు చేస్తూ జీఓ విడుదల చేశారు. నాలుగు విభాగాలుగా పనులకు ప్రణాళికలు రూపొందించారు. సాగర్ కాలువ నుంచి ఎస్ఎస్ ట్యాంక్ (సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్)కు నీరు రావడానికి, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్, ఫుట్ బ్రిడ్జి, ఇంటేక్ వెల్ ల నిర్మాణానికి, నీటి సరఫరా లైన్లకు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణాలకు రూ.8938.67 లక్షలు కేటాయించారు. రెండో విభాగంలో 7 సంవత్సరాల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు రూ.660.85 లక్షలు కేటాయించారు. మూడో విభాగంలో జీఎస్టీ ఇతర చార్జీలు రూ.1752.64 లక్షలు కేటాయించగా నాలుగో విభాగంలో ఏపీఎస్పీ డీసీఎల్, ప్రైజ్ వేరియేషన్స్, కన్సల్టెన్సీ చార్జెస్, ల్యాండ్ కేటాయింపునకు, ఇతర అవసరాలకు రూ.747.84 లక్షలు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను దర్శి పట్టణాన్ని ఆనుకుని ఉన్న ముండ్లమూరు మండలం పులిపాడు చెరువు వద్ద నిర్మిస్తారు. ఆ చెరువుకు మొత్తం 250 ఎకరాలు భూమి ఉంది. చెరువు నిండితే 120 నుంచి 150 ఎకరాల భూమిలో నీరు నిల్వ ఉంటుంది. 100 ఎకరాల నుంచి 130 ఎకరాల వరకు చెరువుకు మిగులు భూమి ఉంది. అందులో 96 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్‌కు సేకరించారు. ప్రత్యేకంగా రావాటర్ స్టోరేజ్ ట్యాంక్, నీటి శుద్ది కర్మాగారాలు, స్టాఫ్ క్వార్టర్స్ వంటి సౌకర్యాలకు భూమిని ఉపయోగిస్తారు. సాగర్ కుడి కాలువ నుంచి నేరుగా చెరువులోకి నీరు వచ్చేలా పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆ నీటిని శుద్ధి ప్లాంట్‌లో శుద్ధి చేసి పైప్లైన్ల ద్వారా పట్టణంలోని ఇంటింటికీ నీటి సరఫరా చేస్తారు. వీధి పంపులకు చెక్: ప్రస్తుతం మంజూరైన ప్రాజెక్ట్ పూర్తయితే మహిళలు వీధి కుళాయిల వద్ద లైన్లో నిలబడి నీరు పట్టుకోవాల్సిన పని లేదు. నేరుగా ఇంట్లోకే తాగు నీరు పైప్ లైనుల ద్వారా చేరేలా ప్రణాళికలు చేశారు. వారి సమయం కూడా వృథా కాదు. పాత పైప్ లైనులు బాగున్న చోట అవే లైన్లు ఉంచి, నీరు అందని ఎత్తు పల్లాల వద్ద నూతన పైప్ లైన్లు వేస్తారు. దీంతో ప్రతి ఇంటికి నీరు కచ్చితంగా చేరుతుంది. పరోక్షంగా పట్టణ అభివృద్ధి: తాగునీటి ఇబ్బందులు అధిగమిస్తే నివాసాలు ఉండేవారు ఎక్కువ చొరవ చూపుతారు. దీంతో దర్శిలో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. తద్వారా పట్టణం కూడా వ్యాప్తి చెందుతుంది. శిథిలావస్థలో నెదర్లాండ్ చెరువు 35 సంవత్సరాల క్రితం సాగర్ కాలువ నిర్మించినప్పుడు ఏర్పాటు చేసిన తాగునీటి రిజర్వాయర్ మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉంది. అప్పటి జనాభా ప్రకారం ప్రణాళికలతో నిర్మించిన నిర్మాణాలు, పైపులైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పట్టణం తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ప్రాజెక్ట్ పూర్తయితే ఇబ్బందులను అధిగమించవచ్చు. -
నెల క్రితమే ప్రేమ పెళ్లి.. ఏమైందో తెలియదు.. భార్యపై కత్తితో దాడి
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం పోతవరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. భార్య కొత్తా పావని పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం పావనిని ఒంగోలు హాస్పిటల్‌కు తరలించారు. దాడి చేసిన భర్త సాయికుమార్ పరారీలో ఉన్నాడు. పావని దంపతులు గత నెల 18న ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త వేధిస్తున్నాడని పావని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త సాయికుమార్.. పావనిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లయి నెలకూడా తిరక్కుండానే ఈ దారుణం చోటుచేసుకోవడంతో భార్యభర్తల మధ్య గొడవకు మరేదైన కారణం ఉందేమోనని స్థానికులు అనుమానిస్తున్నారు. -
నిండు గర్భిణిని కాళ్లతో తొక్కి చంపేశారు..
దర్శి టౌన్(ప్రకాశం జిల్లా): పిల్లనిచ్చే వారు లేక కులాంతర వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానం పెంచుకొని గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ముండ్లమూరు మండలం ఉల్లగల్లులో ఈ నెల 21న గర్భిణి అనుమానాస్పద కేసులో భర్త, మామలను నిందితులుగా తేల్చి పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. కేసు పూర్వాపరాలను దర్శి డీఎస్పీ ప్రకాశరావు గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఉల్లగల్లు గ్రామానికి చెందిన కొండవీటి గురులింగం కుమారుడు శ్రీనివాసరావు..చిలకలూరి పేటకు చెందిన తన్నీరు వెంకాయమ్మ కుమార్తె శైలజను నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి మూడేళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం శైలజ మూడు నెలల గర్భిణి. ఈ క్రమంలో నెల రోజులు క్రితం శ్రీనివాసరావు పొలం నుంచి ఇంటికి వచ్చే సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు శ్రీనివాసరావు నివాసంలో నుంచి పారిపోవడం గమనించాడు. నాటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చిత్ర హింసలకు గురిచేస్తూ ఉండటంతో ఈ నెల 16న పెద్దల సమక్షంలో భార్య భర్తలకు సర్ది చెప్పారు. అయితే అకస్మాత్తుగా ఈనెల 21న శైలజ పశువుల పాకలో శవమై కనిపించింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమె శరీరంపై ఉన్న గాయాలు, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారించారు. భర్త శ్రీనివాసరావు తహసీల్దార్ ఎదుట లొంగిపోయి నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తన భార్య అక్రమ సంబంధం కారణంగా గ్రామంలో తమ పరువు పోతుందని భావించి నిద్రపోతున్న సమయంలో కాలుతో తొక్కి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చాటిన వారిని డీఎస్పీ అభినందించారు. చదవండి: ఎందుకిలా చేశావు తల్లీ... ! దారుణం: అమ్మానాన్నలే అమ్మేశారు.. -
భార్య కాళ్లు పట్టుకుంది.. ప్రియుడు పీకనొక్కాడు
సాక్షి, దర్శి టౌన్ (ప్రకాశం జిల్లా): ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి, ఉరేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందో మహిళ. విచారణలో అసలు విషయం వెల్లడవడంతో నిందితురాలు నేరం అంగీకరించింది. దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మండల కేంద్రం సంతమాగులూరుకు చెందిన దంపతులు చెన్నుపల్లి శ్రీనివాసరావు (45), సైదాలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సైదాలక్ష్మి కూలి పనులకు వెళ్తోంది. 18 నెలల క్రితం గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నల్లగంగుల వెంకటరెడ్డితో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది కాస్తాత అక్రమ సంబంధంగా మారింది. విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. తీరు మార్చుకోవాలని పలుమార్లు ఆమెను భర్త మందలించాడు. దీంతో ఆమె ప్రియుడితో కలిసి భర్తను అంతమెందించాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ రాత్రి శ్రీనివాసరావు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఇంట్లో నిద్రించాడు. ఆ తర్వాత పథకం ప్రకారం ఆమె భర్త కాళ్లు పట్టుకొని కదలకుండా చేయగా ప్రియుడు పీక నొక్కి శ్రీనివాసరావును హతమార్చారు. తర్వాత ఆమె భర్తే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. మృతుడి తమ్ముడు చెన్నుపల్లి వీరయ్య ఫిర్యాదు మేరకు సంతమాగులూరు ఎస్ఐ కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శ్రీనివాసరావుది హత్యగా నిర్థారించారు. వీఆర్వో వద్ద నిందితురాలు సైదాలక్ష్మి నేరం అంగీకరించింది. దీంతో మంగళవారం నిందితురాలిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. కేసు పరిష్కారంలో ప్రతిభ కనబర్చిన దర్యాప్తు అధికారి, అద్దంకి సీఐ ఐ.ఆంజనేయరెడ్డి, ఎస్ఐ టి.శివన్నారాయణ, హెచ్‌సీలు సురేష్‌రెడ్డి, మస్తాన్‌రెడ్డిలను ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అభినందించినట్లు డీఎస్పీ ప్రకాశరావు వివరించారు. (చదవండి: ఆన్లైన్ గేమ్స్‌కు సీఏ విద్యార్థి బలి) -
దర్శిలో కిడ్నాపైన పసికందు క్షేమం
సాక్షి, ప్రకాశం: నెల రోజుల వయసున్న శిశువు కిడ్నాప్‌కు గురై, ఆ వెంటనే తల్లి ఒడిని చేరిన ఘటన ప్రకాశం జిల్లాలోని దర్శిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దొనకొండ మండలం పోలేపల్లికి చెందిన మరియమ్మకు నెల రోజుల వయసున్న బిడ్డ ఉంది. ఆ పాపపై కన్నేసిన ఓ గుర్తు తెలియని మహిళ తనను అంగన్వాడీ టీచర్‌గా మరియమ్మకు పరిచయం చేసుకుంది. ప్రభుత్వం నుంచి మహిళలకు డబ్బు వస్తుందని నమ్మించి, ఫొటోలు దిగేందుకు దర్శి రావాలని ఆమెను నమ్మించింది. (చదవండి: చిన్నారి అంజి కిడ్నాప్ కథ విషాదాంతం!) ఓ నలుగురు మహిళలను దర్శికి తీసుకొచ్చింది. అనంతరం ఫొటో స్టూడియో దగ్గర మహిళలను ఉంచి బిడ్డను తీసుకుని పరారైంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు మరియమ్మ పోలీసులను ఆశ్రయించింది. కిలాడీ మహిళ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు నూజెండ్ల మండలం ఉప్పలపాడులో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు. (చదవండి: తల్లి చూస్తుండగానే.. కూతురి కిడ్నాప్) -
అలా ప్రయత్నిస్తే పచ్చతోరణమే..!
బిర బిరా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వందల..వేల కిలోమీటర్ల ప్రయాణించి జిల్లాలో లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ ఎంతో మంది దాహం తీరుస్తోంది. నీటి విడుదల సమయంలో సాగర్ కాలువ ద్వారా కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు రెండు కళ్లు చాలవు. అంతటి ప్రాధాన్యం ఉన్న సాగర్ కాలువల వెంబడి మొక్కలు నాటితే పచ్చదనం పరిఢవిల్లే అవకాశాలు ఉన్నాయి. సాక్షి, దర్శి టౌన్: జిల్లాలో నాగార్జున సాగర్ కాలువ 200 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. కాలువ కరకట్టలు పోను ఇరువైపులా సుమారు 60 అడుగుల చొప్పున ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలాలు కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు గురి కాగా..మరికొన్ని ప్రాంతాల్లో చిల్లచెట్లు పెరిగి వృథాగా ఉన్నాయి. ఈ స్థలాలను సద్వినియోగం చేసుకుంటే పెద్ద ఎత్తున మొక్కలు పెంచే అవకాశం ఉంది. మొక్కలు కాలువ పక్కనే ఉన్నందున తేమతోనే మొక్కలు బతికే అవకాశం ఉంది. మామిడి, ఉసిరి, నేరేడు వంటి పండ్ల మొక్కలు లేదంటే టేకు, ఎర్రచందనం, కొబ్బరి వంటివి నాటితే మంచి ప్రయోజనం ఉంటుంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ప్రక్రియ చేపడితే మరి కొందరికి ఉపాధి సైతం లభించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: పలమనేరులో నువ్వా- నేనా..? కిలో మీటర్ల మేర .... జిల్లాలో సాగర్ ప్రధాన కాలువ 65 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. అద్దంకి బ్రాంచ్ కాలువ 30.5 కి.మీలు, దర్శి బ్రాంచ్ కాలువ 23 కి.మీలు, ఒంగోలు బ్రాంచ్ కాలువ 54 కి.మీలు, పమిడిపాడు బ్రాంచి కాలువ 36 కి.మీలు, మోదేపల్లి మేజర్ 27 కి.మీలు, రజానగరం మేజర్ 30 కి.మీల మేర సాగుతున్నాయి. వీటిలో వాగులపై, రహదారుల వద్ద నిర్మించిన వంతెనలు ఇతరత్రా అడ్డంకులు ఉన్నా ఇవి 15శాతానికి మించి ఉండవు. మొక్కకు మొక్కకు 8 మీటర్ల ఖాళీతో మొక్కలు నాటవచ్చు. ఈ లెక్కన కాలువ కట్టకు ఒక వైపు ఎటువంటి అవరోధం లేని ప్రాంతంలో మూడు వరుసలు చొప్పున మొక్కలు పెంపకం చేపట్టవచ్చు. ఒక్కో లబ్ధిదారునికి 150 మొక్కల చొప్పున అప్పగించినా ఏడు వేల మంది వరకు లబ్ధి చేకూర్చవచ్చు. మరో వైపు కాలువకు ఇరువైపులా పచ్చని వాతావరణం ఏర్పడుతుంది. పర్యావరణానికి సైతం మేలు చేకూరుతుంది. ఎంతో మందికి ఉపాధి.. భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇందిరమ్మ పచ్చతోరణం పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా భూమి లేని నిరుపేదలను ఎంపిక చేసి ప్రభుత్వ భూమిలో చెట్టుపట్టాలు ఇస్తారు. ఆ భూమిలో పండ్ల జాతి, కలప జాతి మొక్కలు పెంచుకోవచ్చు. ఒక్కో లబ్ధిదారుడు 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. వాటి పెంపకానికి ఉపాధి హామీ పథకం నుంచి ఐదేళ్ల పాటు నిధులు మంజూరు చేస్తారు. రైతులు ఫలసాయం కూడా పొంది ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందవచ్చు. భూమి విక్రయించే హక్కు మాత్రం లబ్ధిదారుడికి ఉండదు. ప్రస్తుతం కూడా సాగర్ కాలువకు ఇరువైపులా మొక్కల పెంపకానికి అప్పగిస్తే మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. రెవెన్యూ, ఎన్ఎస్పీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటే హారితహారం అవుతుందని ప్రజలంటున్నారు. -
తల్లి పేరున ఇన్సూరెన్స్ కట్టి హత్య...
సాక్షి, దర్శి: మద్యానికి బానిసై..చేసిన అప్పులు తీర్చలేక చివరకు నవమాసాలు మోసి కని పెంచి సర్వస్వాన్ని ధారపోసిన తల్లిదండ్రులనే అతి కిరాతకంగా కడతేర్చిన కుమారుడి ఉదంతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. కుమారుడన్న పదానికి మాయని మచ్చ తీసుకొచ్చిన హంతకుడిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. డీఎస్పీ ప్రకాశ్‌రావు కథనం ప్రకారం.. పట్టణంలో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి అన్నపురెడ్డి వెంకటరెడ్డి (80), ఆయన భార్య (52) ఆదెమ్మలు హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటరెడ్డి, ఆదెమ్మ దంపతుల కుమారుడు అన్నపురెడ్డి నారాయణరెడ్డి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. అప్పులు తీర్చమని తల్లిదండ్రులను వేధిస్తూ ఉండేవాడు. పనులు చేసుకుని జీవనం సాగించే తల్లిదండ్రులు ఉన్న ఆస్తిని కూడా అమ్మి నారాయణరెడ్డి అప్పులే తీర్చారు. అయినా నారాయణరెడ్డి తన ప్రవర్తన మార్చుకోకుండా భార్యను కూడా వేధించడంతో ఏడాది క్రితం ఆమె తన ఇద్దరి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. నారాయణరెడ్డి ప్రస్తుతం దర్శిలోని ముద్ర అగ్రికల్చర్ సొసైటీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తూ ఖాతాదారుల నుంచి రికవరీ చేసిన డబ్బులో సుమారు రూ.3 లక్షల వరకు సొంతఅ వసరాలు, వ్యసనాలకు వాడుకున్నాడు. డబ్బులు చెల్లించాలని సొసైటీ నిర్వాహకులు నారాయణరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆ నగదు ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగినా ప్రయోజనం లేక పోవడంతో అప్పు తీర్చేందుకు ఆ వృద్ధ దంపతులకు కుమారుడు దుర్మార్గపు ఆలోచనకు తెరలేపాడు. తన తల్లి పేరున మూడు నెలల క్రితం బజాజ్ అలియాంజ్‌లో రూ.15 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని నామినీగా తన పేరు పెట్టుకున్నాడు. గతంలో మెడికల్ రిప్రజెంటేటీవ్‌గా చేసిన అనుభవంతో పది రోజుల క్రితం నిద్రమాత్రలు కొనుగోలు చేసి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నెల 21వ తేదీ రాత్రి మజ్జిగలో అధికంగా నిద్రమాత్రలు వేసి పెట్టాడు. ఆ మజ్జిగ తాగిన తల్లిదండ్రులు ఇంటి వెనుక వైపు పడుకున్నారు. తెల్లవారు జాము వరకు వారిని గమనిస్తున్న కుమారుడు ఎంతకూ వారు మరణించక పోవడంతో ముందు తల్లిని ఇంట్లోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టి నోట్లో గుడ్డలు కుక్కి గొంతు నులిమి చంపేశాడు. తండ్రిని కూడా చంపేదుకు ప్రయత్నించాడు. తండ్రి నిద్ర లేచేందుకు ప్రయత్నించగా కత్తితో ఆయన గొంతు, మణికట్టు కోసి అతి కిరాతకంగా చంపాడు. అనంతరం అట్ల కాడతో తల్లిదండ్రులు డబ్బు దాచుకునే డబ్బు పెట్టెను పగలగొట్టి డబ్బులున్నాయేమోనని పరిశీలించాడు. అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. లోతైన దర్యాప్తు చేసి నిందితుడు మృతుల కన్న కుమారుడిగా గుర్తించి శుక్రవారం నారాయణరెడ్డిని అరెస్టు చేశారు. వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించిన సీఐ మహ్మద్ మొయిన్, ఎస్ఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బందిని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అభినందించారని డీఎస్పీ ప్రకాశ్‌రావు వెల్లడించారు. -
ఆరూష్ ఎక్కడ?
సాక్షి, దర్శి టౌన్: రెడ్డినగర్ బాలుడి అదృశ్యం కేసు మిస్టరీ వీడటం లేదు. నెల రోజులుగా ఆచూకీ లేని రెండేళ్ల బాలుడి వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఆ బిడ్డ తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్చుతోంది. కిడ్నాప్‌నకు గురైన తూర్పుగోదావరి జిల్లా మండపేట బాలుడు ఆచూకీ లభించిన నేపథ్యంలో ఆరూష్ కేసు విషయంలో జిల్లా పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో శుక్రవారం ఆరూష్‌ను ఏలూరులో గుర్తించారనే వార్తలు గుప్పుమనడంతో కన్నవారి ప్రాణం లేచి వచ్చినట్టయింది. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అంతలోనే అవన్నీ వదంతులేనంటూ పోలీసులు స్పష్టం చేశారు. ముండ్లమూరు మండలం ఉల్లగల్లు పంచాయతీ పరిధిలో రెడ్డినగర్‌కు చెందిన అశోక్‌రెడ్డి, జ్యోతి దంపతుల రెండేళ్ల కుమారుడు ఆరూష్‌రెడ్డి 33 రోజుల కిందట ఇంటి ముంగిట ఆడుకుంటూ అదృశ్యం కాగా ఇంత వరకు అతడి ఆచూకీ లభించలేదు. అతడి తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నతాధికారులను కలిసి, న్యాయం చేయాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. ఈక్రమంలో రెండు రోజులుగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి శుక్రవారం వివిధ ప్రాంతాలలో ఆరా తీశారు. వ్యక్తిగత వివాదాల కారణంగా స్థానికులే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారనే కోణంలో విచారణ చేస్తున్న పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. బాబు దొరికాడనే వదంతులతో కలకలం శుక్రవారం రాత్రి ఆరూష్‌రెడ్డి ఏలూరు ఇందిరానగర్‌లో దొరికినట్లు జరిగిన ప్రచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో బాలుడి బంధువులు ఉత్కంఠతో ఎదురు చేశారు. తమ బాబు దొరికాడంటూ ఆనందపడ్డారు. అవన్నీ వదంతులేనంటూ తేలటంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఏలూరులోని ఒక ఇంట్లో బాలుడు ఉన్నాడని సమాచారంతో అక్కడి పోలీసులు వెళ్లారని, కానీ ఎవరూ లేకపోవడంతో బాలుడి జాడ తెలియలేదని దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు వివరించారు. అన్ని కోణాలలో విచారణ వేగవంతం చేశామన్నారు. -
ఐదేళ్ల పాలనకు ఓ నమస్కారం!
సాక్షి, దర్శి (ప్రకాశం): టీడీపీ ప్రభుత్వ పాలనలోఐదేళ్లు వెనక్కు చూస్తే ప్రతి ఒక్కరికీ నష్టాలు తప్ప ఏం ఒరిగిందనే విమర్శలు మెండుగా ఉన్నాయి. 2014–15వ సంవత్సరంలో అక్రమ కేసులతో నియోజకవర్గం అట్టుడికింది. మంత్రి శిద్దారాఘవరావు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ నేతల పై దాడులు చేసి అక్రమ కేసుల పేరుతో నియోజకవర్గంలో భయభ్రాంతులు సృష్టించారు. ఆతరువాత రైతులకు సాగర్ జలాలు విడుదల చేశారు. రైతులు వరి నాటుకున్న తరువాత సాగర్ జలాలు పూర్తి స్థాయిలో అందజేయలేదు. దీంతో వరి పంట పూర్తి గా ఎండి పోయింది. కానీ మంత్రిగా ఉన్న శిద్దారాఘవరావు పట్టించుకోకుండా వదిలేశారు. అప్పట్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సాగర్ కాలువలపై పర్యటన జరిపి కొంతమేర రైతులకు సాగర్ జలాలు అందించేందుకు కృషి చేశారు. మిరప రేట్లు బాగా ఉన్నా తెగుళ్లు రావడంతో రైతులు భారీగా నష్ట పోయారు. కంది వేసిన రైతులకు కనిస మద్దతు ధర కూడా రాలేదు. 2015–16లో సాగర్ జలాలు విడుదల చేయలేదు. రైతులు కంది, మిరప వంటి పంటలు వేసుకున్నారు. కందికి కొంత గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు అనుకూలించలేదు. 2016–17లో సాగర్ జలాలు విడుదల కాలేదు. వర్షాలు కురవక వేసిన పంటలు బాగా దెబ్బతిన్నాయి. మిరప మొదట్లో మంచి గిట్టుబాటు ధరలు ఉండటంతో రైతులు ఆపంటలే అధికంగా వేశారు. దీంతో రేటు పడిపోయి నానా ఇబ్బందులు పడ్డారు. 2017–18 సాగర్ జలాలు విడుదల కాలేదు. సంవత్సరం నియోజకవర్గంలో మరణ మృదంగంలా విషజ్వరాలు విజృంభించాయి. ప్రతి రోజూ ఒకటీ రెండు మరణాలు సంభవించడం జరిగింది. సుమారు 80 మందికి పైగా మరణించారు. ఈ ఏడాది సాగర్ జలాలు రాక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వర్షాలు పూర్తి స్థాయిలో కురవక కురువు మేఘాలు కమ్ముకున్నాయి. కందులకు గిట్టు బాటు ధరలు రాలేదు. ఇతర రాష్ట్రాల్లో కందులు తక్కువ ధరలకు దిగుమతి చేసుకుని ఇక్కడి రైతుల పేరిట మార్క్ ఫెడ్, నాపెడ్ ద్వారా రైతులకు చెందాల్సిన గిట్టు బాటు ధరలను మంత్రి బినామీలే మింగేశారు. మిరప పంటలు వేసిన రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. కరువు దెబ్బకు రైతులు కూడా కూలి పనులకు పోవడం మొదలు పెట్టారు. 2018 –19 సంవత్సరంలో ప్రభుత్వం సాగర్ జలాలు ఇస్తామని చెప్పడంతో వేసిన కందిని చెడగొట్టి వరి నాటుకున్నారు. వరి కంకి దశలోకి వచ్చేసరికి సాగర్ జలాలు నిలిపివేశారు. దీంతో కంది పంటకు ఎకరాకు రూ.5 వేలు, వరి పంటలో రూ.25 వేలు రైతులు నష్ట పోయారు. ఈ తరుణంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ వరి రైతుల పరిస్థితి చూసి చలించి పోయారు. వరి పొలాలు సందర్శించి రైతులకు సాగర్ జలాలు విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. అయినప్పటికీ మంత్రి శిద్దారాఘవరావు కాని , జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ సాగర్ జలాలు తీసుకు రావడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో వేలాదిఎకరాలు ఎండి రైతులు నష్ట పోయారు. ఐదేళ్లుగా గొంతెండుతోంది.. ఎన్ఏపీ రిజర్వాయర్ ద్వారా ప్రతిరోజు దిగు నీరు అందిస్తున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై బిల్లులు చేసుకుని ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు బొక్కుతున్నారు. ఇలా ప్రజలకు అందించాల్సిన తాగునీటిలో కూడా అవినీతిని పారించారు. నీరు చెట్టు పేరుతో భారీగా దోచుకున్నారు. ప్రతి పథకానికి జన్మభూమి కమిటీలు పెట్టి సామాన్యులకు పింఛన్లు , కార్పొరేషన్ లోన్లు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాల పంపిణీ పేరుతో అనాదీనం భూములను సాగు దారులనుంచి అతి తక్కువ ధరలకు కొనుగోనుగోలు చేసి ప్లాట్లుగా వేసి వాటిని అధిక లాభాలకు అమ్మకాలు చేసి వారికి ప్రభుత్వ పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఈ ముసుగులో ఈ పట్టాలన్నీ మంత్రి శిద్దా రాఘవరావు ఉచితంగా ఇచ్చినట్లు ప్రచారం చేసి పట్టాల ముసుగులో పక్కా దోపిడీకి పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం నియోజకవర్గంలో 12 విద్యుత్ సబ్స్టేషన్లలో 48 మంది నూతన సిబ్బందిని తీసుకున్నారు. వారిలో ఎస్సీల కోటాలో 15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్.. రోష్టర్ పాటించాలి. అయితే కేటాయించాల్సిన ఉద్యోగావకాశాలను కూడా ఇతర కులాలకు ఒక్కో ఉద్యోగానికి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకుని ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేశారు. ఈ తతంగంలో మంత్రి శిద్దా హస్తం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులు ఆయనకు దూరమయ్యారు. ఈకారణంతోనే టీడీపీకి చెందిన ప్రధాన ఎస్సీ, ఎస్టీ నాయకుతు గాలిమూటి దేవప్రసాద్, ఉప్పల పాటి కిరణ్ ప్రసాద్, జి. వరప్రసాద్, కవలకుంట్ల గోవింద్ ప్రసాద్, కే సన్నీబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర వంటి మంత్రికి ముఖ్య అనుచరులుగా ఉన్న ప్రధాన ఎస్సీ , ఎస్టీ నాయకులు మంత్రికి దూరమయ్యారు. హామీలు గాలికొదిలారు దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్, విమానాశ్రయం అభివృద్ధి, హెలికాప్టర్ల కంపెనీ, కార్ల విడిభాగాల కంపెనీలంటూ మంత్ర చెప్పారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే పిచ్చిచెట్లు దర్శిన మిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న హామీ నెరవేరక పోవడంతో వారంతా నిరాశలో ఉన్నారు. దర్శిలో డిగ్రీకళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, మినీ స్టేడియం, జీప్లస్ త్రీ కాంప్లెక్స్‌లు, శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. దర్శిలో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి కనీసం ఆ ఊసే ఎత్తలేదు. చందవరం సమీపంలోని గుండ్లకమ్మపై ఏర్పాటు చేసిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండానే ఇదే నా.. అభివృద్ది అంటూ మంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం ఆబ్రిడ్జిపై కనీసం ఆపార్టీ గుర్తు అయిన సైకిల్ కూడా తిరగడం లేదు. ఈసారి ఓటర్లు చూపు ఎటువైపు ఉంటుందో వేచి చూడాల్సిందే. -
అమాత్యుడి పాలన.. అవినీతి లాలన..
సాక్షి, దర్శి (ప్రకాశం): అలివికాని అబద్దపు హామీలిచ్చి ఓట్లేయించుకుని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన శిద్దా రాఘవరావు ఈ అయిదేళ్లలో దర్శి నియోజకవర్గాన్ని అంధకారంలోకి నెట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేశారు. రూ. మూడు వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్న మంత్రిని శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ, వైఎస్సార్ సీపీ నాయకులు సవాల్ విసిరితే మాత్రం తేలుకుట్టిన దొంగలా నోరు మెదపక పోవడమే అందుకు నిదర్శనమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ముండ్లమూరు మండలంలో ప్రధానంగా ఇసుక దోపిడీపై దృష్టి పెట్టారు. బినామీగా అక్కడి మండల పదవి అనుభవిస్తున్న వ్యక్తిని అడ్డుపెట్టుకుని చిలకలేరు, పోలవరంలలో ఇసుకను ఇష్టారాజ్యంగా ఇప్పటికీ ఇతర జిల్లాలకు తరలించడం గమనార్హం. ప్రతి రోజు సుమారు వంద టర్బోలు, రెండు వందల ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. దీంతో భూగర్భజలాలు పూర్తిస్థాయిలో అడుగంటి అక్కడి రైతులు లబోదిబో మంటున్నారు. గత ఐదేళ్లలో మంత్రి గారి ఇలాకాలో ఆయన బినామీలు సుమారు రూ. 50 కోట్లకు మేర దోచుకున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ దోపిడీలో పోలీసులు సైతం ప్రధాన పాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. సాగర్ జలాల సరఫరాలో ఘోర వైఫల్యం టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014వ సంవత్సరం సాగర్ జలాలు విడుదల చేశారు. పూర్తి స్థాయిలో కాలువలకు నీరందించపోగా, రైతుల వరి పొలాలు ఎండిపోతుంటే కనీసం అటు వైపు మంత్రి కన్నెత్తి చూడలేదు. అప్పట్లో ఒక్కో రైతు ఎకరాకు రూ. 15 వేల వరకు నష్ట పోయారు. ఆతరువాత చంద్రబాబు అడుగు పెట్టిన పుణ్యమా అని మూడేళ్లు కరువు కరాళ నృత్యం చేసింది. 2018లో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడి సాగర్ డ్యాం పూర్తి స్థాయిలో నిండింది. రైతులందరూ కంది వేసుకున్న నెల తరువాత వరికి సాగర్ జలాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతుల ఆశలు చిగురించాయి. రూ. 5 వేలు కర్చు చేసి వేసిన కందిని దున్నేసి తిండి గింజల కోసం సుమారు ఆయకట్టు పరిధిలో 80 వేల ఎకరాల్లో వరి నాటారు. నాటిన వెంటనే ప్రధాన కాలువకు వారబందీ పెట్టి రైతులకు వెన్నుపోటు పొడిచారు. దీంతో ఒక్కోక్క రైతు వరికి రూ. 25 వేలు, కందికి రూ. 5 వేలు వెరసి రూ. 30 వేల వరకు నష్టపోయిన విషయం ఆయనకు తెలియందేమీ కాదు. మినుముల్లో కూడా భారీ దోపిడీ 2017వ సంవత్సరంలో దర్శి నియోజకవర్గంలో 168 క్వింటాళ్లు మినుములు పండించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి మినుములు కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్ ద్వారా 29 వేల క్వింటాళ్ల మినుములు ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మి ప్రజాదనాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ఈ తతంగం మొత్తం మంత్రి కుమారుడు, మార్క్‌ఫెడ్‌కు చెందిన రాష్ట్ర అధికారి కనుసన్నల్లోనే జరిగినట్లు సమాచారం. ఈ విధంగా కందులు, మినుముల్లో రూ. 120 కోట్ల వరకు మంత్రి బినామీల ద్వారా దోచుకున్నట్లు సమాచారం. నీరు–చెట్టు కాసుల పట్టు నీరు–చెట్టు పథకం ద్వారా నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు అడ్డగోలుగా దోచుకున్నారు. పాతగుంటలను చదరం చేసి నూతనంగా పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించి ఇష్టారీతిన దోచుకున్నారు. కార్పొరేషన్ రుణాల్లో కమీషన్లే పలు కుల సంఘాలకు కార్పొరేషన్ ద్వారా కల్పించిన సబ్సిడీ రుణాల్లో కూడా 15 శాతం కమీషన్ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వారు ఇచ్చిన రుణాలకు షాపులు, సంబంధిత వ్యాపారాలు లేకున్నప్పటికీ ఇతర దుకాణాలు, వ్యాపారాలు చూపించి మరి పేదలకు చెందాల్సిన కార్పొరేషన్ రుణాలను కమీషన్ల కోసం అనర్హుల జేబులు నింపిన సంఘటనలు విచారిస్తే వెలుగుచూస్తాయి. ఆర్ అండ్ బీలో భారీ అవినీతి రోడ్డు, భవనాలు శాఖలో మంత్రిగా ఉన్న హయాంలో నియోజకవర్గంలో ప్రధాన నాయకుల్ని బినామీలుగా పెట్టుకుని జిల్లాలో వేసిన రోడ్లలో బారీగా కమీషన్లు పుచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. దర్శి నుంచి బొట్లపాలెం వెళ్లే రోడ్డులో ప్రస్తుతం డబుల్ రోడ్డు ఉంది. గతంలో ఉన్న సింగిల్ రోడ్డుకు రూ. 70 లక్షలు నిధులు మంజూరు చేసి రోడ్డు వేసినట్లు బిల్లులు చేసుకున్నారు. అయితే ఆ రోడ్డుకు రెండు మూడు సార్లు మరమ్మతులు మాత్రమే చేశారు. తూర్పువీరాయపాలెంలో టీడీపీ కార్యకర్తకు గ్రామంలోని ప్రధాన రోడ్డుపై నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కోర్డు ఆర్డర్లను దిక్కరించి మంత్రి అండదండలతో భారీ భవనాన్ని ఏర్పాటు చేశారు. ఉల్లగల్లు నుంచి మొహిద్దినాపురంనకు రోడ్డు మంజూరు కాగా దానిని మంజూరైన ప్రాంతంలో కాకుండా తక్కువ మొత్తానికి పూర్తి చేయాలనే దురుద్దేశ్యంతో దారులు తప్పించి వీరాయపాలెం గ్రామంలోకి వేశారు. నిర్మించాల్సిన చోట బ్రిడ్జి నిర్మాణం చేయకుండా వైఎస్సార్ సీపీ మద్దతు దారుల పట్టా భూముల్లో నుంచి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో ఆ రైతులు కోర్డును ఆశ్రయించారు. అయినప్పటికి వారికి మాత్రం కోట్లాది రూపాయలు బిల్లులు మంజూరు చేశారు. ఈ తతంగాన్ని మంత్రి శిద్దా రాఘవరావు ఒత్తిళ్ల మేరకే చేశారని ఆ పొలం యజమాని ఆరోపిస్తున్నారు. శిద్దా మంత్రి అయ్యాక గత నాలుగేళ్లుగా వర్షాలు లేక నియోజకవర్గంలో తీవ్ర కరువు ఏర్పడింది. రైతులు కూలీలుగా మారిపోయినా.. దర్శి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోవడం అమాత్యుడి అసమర్ధతేనని రైతులు మండిపడుతున్నారు. తాగునీటికి దిక్కులేదు గ్రామాల్లో ఐదేళ్లుగా తాగునీరు లేక గొంతెండిపోయింది. ఇంటింటికి తాగునీరు అందిస్తామని చెప్పిన మంత్రి తమ స్వార్థం కోసం ఎన్ఏపీ ప్రాజెక్టును శిథిలావస్థకు చేర్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు బిల్లులు చేసుకుని అడ్డగోలుగా దోచుకున్నారే గాని తాగునీరు అందించిన పాపాన పోలేదని స్థానికులు మండిపడుతున్నారు. భూ మాయలో శిద్దహస్తులే తన బినామీల చేత అసైన్డు భూములను ఆక్రమింపజేసి వాటిని ప్లాట్లుగా మార్చి అధికారాన్ని అడ్డుపెట్టి పేదల ముసుగులో దనవంతులకు ఆ ప్లాట్లను అమ్ముకుని వారికి ప్రభుత్వ పట్టాలు ఉచితంగా ఇప్పించినట్లు ప్రచారం చేసుకున్న ఘనత ఒక్క మంత్రి శిద్దా రాఘవరావుకే దక్కిందని చెప్పవచ్చు. ఈ విధంగా కురిచేడు రోడ్డు, అద్దంకి రోడ్లలో మంత్రి అండదండలతో వందల సంఖ్యలో ప్లాట్లు వేసి ప్రభుత్వ భూములను అమ్ముకుని అడ్డగోలుగా దోచుకున్నారు. ఇంత దోపిడీకి అలవాటైన తెలుగుతమ్ముళ్లు మంత్రిని వదిలి పెట్టలేక పోతున్నారని నియోజకవర్గంలో చర్చనియాంశమైంది. కందులు, మినుములు కొనుగోలులో రూ. 60 కోట్ల దోపిడీ జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన కందుల్లో రూ. 60 కోట్లకు పైగా దోపిడీ జరిగినట్లు స్పష్టమవుతుంది. 2017–18 సంవత్సరంలో జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా 34576.600 మెట్రిక్ టన్నులు, నాఫెడ్ ద్వారా 17684.600 మెట్రిక్ టన్నులు కందులు కొనుగోలు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 5450 లెక్కన రూ. 284,82,35,400 రైతులకు చెల్లించింది. అయితే ఆ సొమ్ము బ్యాంకు ఖాతాలకు చేరిందే గాని రైతులకు మాత్రం చెందలేదు. రైతుల ఖాతాలను ఉపయోగించుకుని ఇతర రాష్ట్రాల నుంచి కందులు కొనుగోలు చేసి ఆ కందులను రైతులు పండించినట్లు కాగితాల్లో సృష్టించి వాటిని మార్క్‌ఫెడ్‌కు తరలించి రైతులకు చెందాల్సిన సబ్సిడీని అడ్డదారిలో అడ్డగోలుగా దోచుకున్నారు. -
మరోసారి చంద్రబాబుని నమ్మెదు.. ఐదేళ్లు దోచుకున్నారు
-
మరోసారి ఓటేస్తే సర్వం దోచేస్తారు: వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం: మరోసారి చంద్రబాబు నాయుడికి ఓటువేస్తే సర్వం దోచేస్తారని వైఎస్సార్ కాంగ్సెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన అధివృద్ధి శూన్యమని, ఏం చేశారని మరోసారి ఓటువేయ్యాలని ప్రశ్నించారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండవని, పంటలకు గిట్టుబాటు ధర ఉండదని, మహిళలకు డ్వాక్రా రుణాలు ఉండవని వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 1994లో మద్యపాన నిషేధం హామీతో ఎన్టీఆర్ టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారని.. 1995లో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి మద్యపాన నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలను ఎత్తివేశారని గుర్తుచేశారు. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీలతో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా వైస్ జగన్ మాట్లాడుతూ... దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాల్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్క్షప్తి చేశారు. తన సుధీర్ఘ పాదయాత్రలో అనేక మంది బాధలను విన్నానని, వారందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుని నమ్మతే నరరూప రాక్షసున్ని నమ్మినట్టే. అన్ని వర్గాల ప్రజలను ఆయన మోసం చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీలేదు. దివంగత వైఎస్సార్ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా సాగాయి. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పనులను చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరను కల్పించలేదు. మరోసారి టీడీపీకి ఓటువేస్తే.. హత్యలు తప్ప ఏమీ ఉండవు. కేసులు కూడా పెట్టనివ్వరు. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వరు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసం, అన్యాయం, అవినీతి, అధర్మం తప్ప మరేమీలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. ప్రభుత్వం పాఠశాలను కూడా పూర్తిగా మూసి వేసి ప్రతి గ్రామంలో నారాయణ స్కూల్స్‌ను ప్రారంభిస్తారు. పాదయాత్రలో చాలామంది నన్ను కలిసి వారి బాధలను నాతో పంచుకున్నారు. వారికిచ్చిన హామీ మేరకు అన్ని నెరవేరుస్తా. కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తా. వారికి సరైన జీతాలు కల్పిస్తాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. కార్మికులను ఆదుకుంటాం. పాదయాత్రలో జూనియర్ న్యాయవాదులు నన్ను కలిసి వారి బాధలను పంచుకున్నారు. మొదటి మూడేళ్ల వరకు నెలకు ఐదువేలు భృతిగా ఇస్తాం. సంఘమిత్రలకు జీతాలు పెంచుతాం. అంగన్వాడీ, ఆశ, హోంగార్డుల జీతాలను పెంచుతాం. డ్వాక్రా రుణాలను మాఫీ చేసి.. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. రైతులకు గిట్టుబాట ధర కల్పించి ఆదుకుంటాం. సున్నా వడ్డీకే రుణాలు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ సమస్యకు ఒక మంచి పరిష్కారం లభిస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. ఆ మోసాలకు మీరు మోసపోవద్దు. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని ప్రతి ఒక్కరికి చెప్పండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏటా రూ.15 వేల రూపాయలు ఇస్తాం. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పెద్దపెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాం. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాం. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయి. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకువస్తాం. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దు. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కిరికి మేలు జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు. -
దర్శిలో ఫ్యాన్ గాలి
సాక్షి, దర్శి టౌన్ (ప్రకాశం): దర్శి నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి వీస్తోందా..? వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే అధికంగా ఓట్లు పోలై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందా..? నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే అదే ఖాయమనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో కేవలం 1,374 ఓట్ల తేడాతో వైఎస్సార్ సీపీ చేజారిన దర్శి నియోజకవర్గం.. ఈసారి భారీ మెజార్టీతో ఆ పార్టీ ఖాతాలో చేరబోతోందని నియోజకవర్గంలోని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో దర్శి నుంచి టీడీపీ తరఫున పోటీచేసి గెలిచి మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు హయాంలో నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. శిద్దా అండదండలతో ఐదేళ్లపాటు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. అభివృద్ధి అనేది ఆచూకీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఓటమి భయంతో ప్రస్తుత ఎన్నికల్లో శిద్దా కుటుంబం దర్శి నుంచి పోటీకి దూరం కాగా, స్థానిక టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన కదిరి బాబూరావు పరిస్థితి అయోమయంగా ఉంది. కనిగిరి టికెట్ కోసం ఆయన పోటీపడగా దక్కకపోవడంతో దర్శి నుంచి పోటీ చేసేందుకు ఆయన విముఖత చూపుతున్నారు. కదిరి బాబూరావు పోటీకి విముఖత చూపడంతో.. శిద్దా కుటుంబం కూడా దూరమై ఇప్పటికే నిరుత్సాహంగా ఉన్న దర్శి నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు మరింత నీరుగారిపోయారు. దర్శి నుంచి గెలవలేనన్న కదిరి వ్యాఖ్యలు, పోటీకి శిద్దా దూరం కావడమే నియోజకవర్గంలో ఆ పార్టీ దుస్థితికి నిదర్శనంగా ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటితో పాటు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ బలంగా అవతరించడంతో ఫ్యాన్ జోరు మరింత పెరిగింది. తద్వారా నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. అందులో ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్న నారపుశెట్టి శ్రీరాములు మృతి చెందగా జరిగిన ఉప ఎన్నిక కాగా, మిగిలిన 13 సార్లు సాధారణ ఎన్నికలే. ఈ ఎన్నికల్లో రెండుసార్లు ఇరుపక్షాలను సమానంగా ఆదరించగా, మరో రెండుసార్లు ఇండిపెండెంట్ అభ్యుర్థులను నియోజకవర్గ ఓటర్లు గెలిపించారు. ప్రస్తుతం వచ్చే నెలలో 15వ సారి నిర్వహించనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. 1952లో జిల్లాలోనే పెద్ద నియోజకవర్గంగా ఏర్పాటు... 1952లో దర్శి నియోజకవర్గం ఏర్పడింది. దర్శి, కురిచేడు, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు, మర్రిపూడి, కొనకనమిట్ల, పుల్లలచెరువు, త్రిపురాంతకం కలిపి మొత్తం 9 మండలాల్లోని ప్రాంతాలతో జిల్లాలోనే పెద్ద నియోజకర్గంగా ఏర్పడింది. 2009లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పునర్విభజనలో దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలతో ప్రస్తుతం దర్శి నియోజకవర్గం కొనసాగుతోంది. ఐదేళ్లుగా సాగర్ జలాలు అందక కుంటుపడిన అభివృద్ధి... దర్శి నియోజకవర్గంలో సాగర్ ఆయకట్టు 1.60 లక్షల ఎకరాలు ఉంది. గడిచిన ఐదేళ్ల టీడీపీ పాలనలో సాగర్ నీరు అందకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. నియోజకవర్గానికి అసలు సాగర్ జలాలే రాకముందు దర్శి పట్టణం చిన్నపాటి పల్లెగా ఉండేది. అనంతరం సాగర్ జలాల రాకతో ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. కనిగిరి ప్రాంతంలోని రైతులంతా ఈ ప్రాంతానికి వలసలు రావడంతో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందింది. 18 పాల శీతలీకరణ కేంద్రాల ద్వారా 1.30 లక్షల లీటర్ల పాలను దర్శి నియోజకవర్గంలో సేకరిస్తుంటారు. కానీ, గత ఐదేళ్లుగా టీడీపీ పాలనలో సాగర్ నీరు అందక వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. కొన్నేళ్లుగా రైతుల ఆందోళనలతో దర్శి పట్టణం దద్దరిల్లుతోంది. మంత్రి శిద్దా సొంత నియోజకవర్గం అయినప్పటికీ ఏమాత్రం అభివృద్ధి చెందకపోగా, కనీసం రైతులకు సాగర్ నీరు కూడా అందకపోవడంపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసహనంగా ఉన్నారు. 2,11,506 మంది ఓటర్లు... 2009లో నియోజకవర్గంలో 1,78,564 మంది ఓటర్లు ఉండగా, 2014లో ఆ సంఖ్య 1,94,640కు చేరింది. 2019లో ఇప్పటి వరకు 2,11,506 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 1,06,698 మంది, మహిళలు 1,04,798 మంది ఉన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి... ఎన్నికల సంవత్సరం గెలిచిన అభ్యర్థి, పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి, పార్టీ పోలైన ఓట్లు 1955 దిరిశాల వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ 14,980 శింగరాజు రామకృష్ణయ్య, సీపీఐ 12,775 1962 దిరిశాల వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ 14,411 నుసుం కాశిరెడ్డి, సీపీఐ 13,533 1967 ఎం.రావిపాటి, స్వరాజ్‌పార్టీ 32,931 దిరిశాల వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ 24,885 1972 దిరిశాల రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ 31,125 ఎం.రావిపాటి, ఇండిపెండెంట్ 26,407 1978 బి.జ్ఞానప్రకాష్, ఇందిరా కాంగ్రెస్ 24,225 మువ్వల శ్రీహరి, జేఎన్పీ 22,767 1983 కాటూరి నారాయణస్వామి, ఇండిపెండెంట్ 43,730 డి.రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ 27,272 1985 నారపుశెట్టి శ్రీరాములు, టీడీపీ 42,471 సానికొమ్ము పిచ్చిరెడ్డి, కాంగ్రెస్ 42,193 1989 సానికొమ్ము పిచ్చిరెడ్డి, కాంగ్రెస్ 56,165 వేగినాటి కోటయ్య, టీడీపీ 54,879 1994 నారపుశెట్టి శ్రీరాములు, టీడీపీ 50,769 మహ్మద్ గౌస్ షేక్, కాంగ్రెస్ 34,071 1997 నారపుశెట్టి పాపారావు, టీడీపీ 63,432 సానికొమ్ము పిచ్చిరెడ్డి, కాంగ్రెస్ 55,031 1999 సానికొమ్ము పిచ్చిరెడ్డి, కాంగ్రెస్ 70,387 వేమా వెంకటసుబ్బారావు, టీడీపీ 57,209 2004 బూచేపల్లి సుబ్బారెడ్డి, ఇండిపెండెంట్ 50,431 కదిరి బాబూరావు, టీడీపీ 48,021 2009 బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్ 66,418 మన్నం వెంకటరమణ, టీడీపీ 53,028 2014 శిద్దా రాఘవరావు, టీడీపీ 88,821 బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ 87,447 -
సీట్ల యవ్వారం..సీఎం దగ్గర బేరం!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీలో సీట్ల పోట్లాట అమరావతికి చేరింది. మంత్రి శిద్దా రాఘవరావును దర్శి నుంచే పోటీ చేయించాలంటూ శిద్దా అనుచరులు గురువారం సీఎం నివాసం వద్ద ఆందోళనకు దిగారు. శిద్దాకు ఎంపీ సీటు వద్దని, ఎమ్మెల్యే సీటు కావాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే తాము పార్టీని వదిలేందుకు సైతం సిద్ధమంటూ హెచ్చరించారు. ఈ ఆందోళనలో పెద్ద ఎద్దున శిద్దా అనుచరులు పాల్గొన్నారు. శిద్దా అనుచరులు ఏకంగా సీఎం ఇంటి ముందే ఆందోళనకు దిగడంతో విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శిద్దాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి హుటాహుటిన సీఎం ఇంటివద్ద ఉన్న అనుచరులను అక్కడి నుంచి పంపించారు. మంత్రి శిద్దాతో పాటు ఆయన కుటుంబం ఒంగోలు పార్లమెంట్ సీట్ కంటే దర్శి నుంచి పోటీకే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ సీఎం ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని ఆదేశించడంతో ఆయనకు ఎదురు చెప్పలేక శిద్దా మౌనంగా ఉండిపోయారు. సీఎం ఆదేశం మేరకు శిద్దా ఒంగోలులో పోటీ చేసేందుకు సిద్ధపడినా దర్శి నుంచి పోటీచేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థి కరువయ్యారు. సామాజిక సమీకరణాల పరంగా తొలుత కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శికి పంపాలని సీఎం నిర్ణయించారు. అయితే ఇందుకు కదిరి బాబూరావు ససేమిరా అన్నట్లు సమాచారం. పైగా తనకు సన్నిహితుడైన చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ద్వారా కనిగిరి సీటు కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. మరోవైపు కనిగిరి సీటును ఉగ్రనరసింహారెడ్డికి ఇస్తానని తొలుత సీఎం మాట ఇచ్చారు. అయితే కదిరి బాబూరావు అంగీకరించకపోవడంతో అది వీలుకాలేదు. దీంతో దర్శికి వెళ్లాలని సుజనా చౌదరి, ముఖ్యమంత్రి.. ఉగ్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తొలుత ఎక్కడికైనా వెళ్తానని చెప్పిన ఉగ్ర అంతలోనే వెనక్కు తగ్గి కనిగిరి సీటు ఇస్తేనే పోటీ చేస్తానని సీఎంకు స్పష్టం చేశారు. దీంతో సీట్ల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. ఈ పరిణామం శిద్దాకు అనుకూలాంశంగా మారింది. ఇదే అదనుగా శిద్దా అనుచరగణం సీఎంపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలో భాగంగానే గురువారం సీఎం ఇంటి వద్ద ఆందోళన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శి సీటు శిద్దా రాఘవరావు తనయుడు శిద్దా సుధీర్‌కు ఇస్తే ఎలా ఉంటుందన్న విషయమై ముఖ్యమంత్రి గురువారం జిల్లా టీడీపీ నేతలతో చర్చించినట్లు సమాచారం. అయితే ఒంగోలు పార్లమెంట్‌తో పాటు దర్శి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం ఇబ్బందిగా ఉంటుందని శిద్దా చెప్పినట్లు తెలుస్తోంది. ఉగ్రకు బంపరాఫర్ దర్శి నుంచి పోటీ చేస్తే మొత్తం తానే చూసుకుంటానని ముఖ్యమంత్రి ఉగ్రనరసింహారెడ్డికి బంపరాఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కనిగిరికైతే తానే డబ్బులు పెట్టుకోగలనని దర్శికి డబ్బులు పెట్టడం ఇబ్బంది అని ఉగ్ర సీఎంకు స్పష్టం చేసినట్లు సమాచారం. దర్శికి వెళ్లేవారు కనిపించకపోవడంతో అన్నీ తానే చూస్తానని ఉగ్రకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉగ్ర దర్శికి వెల్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు కనిగిరి సీటు ఎవరికివ్వాలన్నదానిపై స్పష్టత కరువైంది. బాలకృష్ణ ఒత్తిడి మేరకు కనిగిరి సీటు కదిరి బాబూరావుకు ఇస్తారని ప్రచారం జరుగుతున్నా ఉగ్రనరసింహారెడ్డి సైతం పోటీ పడుతుండటంతో చివరకు ఏం జరుగుతుందన్నది తెలియరావడం లేదు. -
రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోంది
సాక్షి, దొనకొండ: రాష్ట్రంలో అభివృద్ధి కంటే అవినీతే అధికంగా తాండవిస్తోందని వైఎస్సార్సీపీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త మద్దిశెట్టి వేణుగోపాల్ విమర్శించారు. మండలంలోని సంగాపురం, వీరేపల్లి గ్రామాల్లో పార్టీ మండల కన్వీనర్ కాకర్ల క్రిష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గొంగటి శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మంగళవారం రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో ఆయనకు ఆడపడుచులు అడుగడుగునా పూలమాలలతో స్వాగతం పలుకుతూ విజయ తిలకం దిద్దారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని, దానిలో భాగంగా నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మద్దిశెట్టి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి ఎక్కువైందని, టీడీపీ పాలకులు అభివృద్ధి మరిచి గొప్పలు చెప్పుకునేందుకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాలను కలుపుకునిపోతామని స్పష్టం చేశారు. తాగునీరు కరువైంది : మహిళల ఆవేదన తమ గ్రామానికి తాగునీరు కరువైందని, గుక్కెడు నీరు అందక అల్లాడుతున్నామని సంగాపురం మహిళలు మద్దిశెట్టి ముందు గగ్గోలు పెట్టారు. స్పందించిన మద్దిశెట్టి.. నీటి సమస్య పరిష్కరించేందుకు ట్యాంకర్‌తో నీటి సరఫరా చేయిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే, సమస్యను శాశ్వితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో భూ సమస్య ఎక్కువగా ఉంది... సంగాపురం గ్రామంలో భూ సమస్య ఎక్కువ ఉందని, టీడీపీ ప్రభుత్వంలో తమను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నోస్లారు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే గ్రామంలో భూ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని మద్దిశెట్టి హామీ ఇచ్చారు. 15 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరిక... వీరేపల్లి గ్రామంలో టీడీపీ నుంచి 15 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. మద్దిశెట్టి వేణుగోపాల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో తమకు అన్యాయం జరగడంతో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వల్లపునేని వీరయ్యచౌదరి, ఎంపీటీసీ సభ్యులు షేక్ గఫార్, విప్పర్ల సుబ్బయ్య, మాజీ సర్పంచులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పాతకోట కోటిరెడ్డి, దేవేండ్ల వెంకట సుబ్బయ్య, మాచనూరి బాబు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గుంటు పోలయ్య, జిల్లా ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చీరాల ఇశ్రాయేలు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ జొన్నకూటి సుబ్బారెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి నూనె వెంకటరెడ్డి, వి.కోటేశ్వరరావు, భద్రయ్య, చిన్న వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బత్తుల వెంకట సుబ్బయ్య, జిల్లా పబ్లిసిటీ ప్రధాన కార్యదర్శి పత్తికొండ వెంకటసుబ్బయ్య, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి గుండాల నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి కొంగలేటి మోషె, వెన్నపూస చెంచిరెడ్డి, గుడిపాటి నాసరయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ యూనుస్, తమ్మనేని యోగిరెడ్డి, ప్రచార విభాగం మండల అధ్యక్షుడు గొంగటి పోలిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అమాత్యుని..అభివృద్ధి చూతము రారండి!
దర్శి: జిల్లాకు చెందిన ఏకైక మంత్రి శిద్దా రాఘవరావు తన నియోజకవర్గం దర్శిలో అభివృద్ధి చేశామని శిలాఫలకాలు వేసుకోవడం తప్ప ఎక్కడా ఆ జాడ కనిపించడం లేదు. వీధికో శిలాఫలకం వేయడం లక్షలాది రూపాలయలు నిధులు కేటాయించడం.. తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి తిలా పాపం తలా పిడికెడు అన్న సామెతగా అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై దోచుకున్నారనేందుకు బసిరెడ్డిపల్లె గ్రామమే ఒక ఉదాహరణ. బసిరెడ్డిపల్లెలో గురువారం రాత్రి చిన్నపాటి వర్షం కురిసింది. చిన్న వర్షానికి గతంలో వేసిన సిమెంట్ రోడ్లలో నీరు అలాగే నిలబడిపోయింది. మంత్రి శిద్దా రాఘవరావు అధికారంలోకి వచ్చిన తర్వాత వీధి కాలువలు నిర్మించారు. నిర్మాణాలు లోపభూయిష్టంగా ఉండటంతో కాలువల్లో మురుగు బయటకు వెళ్లే అవకాశమే లేదు. ఇదీ మంత్రి శిద్దా రాఘవరావు అభివృద్ధి పేరుతో ప్రజాధనం ఖర్చు చేసి.. చేస్తున్న అభివృద్ధి తీరు. ప్రజాధనం దుర్వినియోగం చేయడమేగాక గతంలో వేసిన సిమెంట్ రోడ్లు కూడా బుదరమయం చేయడం టీడీపీ ప్రభుత్వానికే చెల్లిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలో వీధి కాలువలు రోడ్డుకంటే ఎత్తులో నిర్మించారు. వీధి కాలువల్లో నీరు బయటకు వెళ్లే వీల్లేకుండా గ్రామంలోకి పల్లం..గ్రామం బయటకు మెరక పెట్టి నిర్మించారు. దీంతో రోడ్డుపై పడిన వాననీరు కూడా వీధి కాలువల్లోకి వెళ్లే అవకాశమే లేకుండాపోయింది. చిన్న వర్షం కురిసినా నీరు రోడ్డుపైనే చిన్నపాటి వర్షం కురినినా నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. దీనికి తోడు గ్రామంలో వీధి కాలువలు నిర్మాణాలు జరిగిన సమయంలో నివాసాల ముందు పెద్ద పెద్ద గుంతలు చేసి పూడ్చకుండా వెళ్లిపోయారని గ్రామస్తులు వాపోయారు. దీంతో ఒక్కో ఇంటికి రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేసి మెరకలు పోసుకుని కాలువలపై బండలు వేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు చేస్తున్న సమయంలో రోడ్డు కంటే కాలువలు ఎత్తు పెడుతున్నారని, గ్రామంలోకి పల్లం..ఊరి చివర మెరక పెట్టి కాలువలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాలువల్లో నీరు బయటకు వెళ్లక ఎక్కడి మురుగు అక్కడే ఆగిపోతోందని వాపోతున్నారు. దోమలు ప్రబలి విషజ్వరాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో టీడీపీ నాయకులు అభివృద్ధి చేందుతున్నారేగానీ గ్రామానికి మాత్రం అభివృద్ధి చేయక పోగా సమస్యలు తెచ్చి పెట్టారని గ్రామస్తులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి గ్రామంలో అన్నీ వీధుల్లో సిమెంట్ రోడ్లు వేయించారు. వీధి కాలువలు నిర్మించే సమయానికి ఎన్నికలు వచ్చాయి. మళ్లీ కాలువుల నిర్మాణాలు చేపట్టి గ్రామంలో మురుగు బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆదుకుంటేనే...ఆడుకుంటాను
ప్రకాశం ,దర్శి: బడి ఈడు పిల్లలతో ఆడుకునే బాలుడు ఆటలకు దూరమయ్యాడు.. ఆనందంగా గంతులేస్తూ ఆడుకునే తోటి స్నేహితులను చూసి తానెప్పుడు అలా ఆడుకోగలనా లేదా అని ఎదురు చూస్తున్నాడు. తనకు వచ్చిన కాన్సర్ బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరైనా దాతలు సహకారం అందిస్తారనే ఆశతో వేయికళ్లతో ఎదురు చూస్తున్నాడు. దర్శి పంచాయతీ పరిధిలోని శివరాజనగర్ గ్రామానికి చెందిన షేక్ జిలానీ కుమారుడు వాహిద్ అనే ఏడేళ్ల వయస్సున్న బాలునికి బ్లడ్‌క్యాన్సర్ వచ్చింది. ఒక సంవత్సరం క్రితం బాలుడు తరచూ జ్వరంతో బాధపడటం, ఆస్పత్రిలో చూపించగానే తగ్గి మళ్లీ వస్తోంది. గుంటూరు ఆస్పత్రిలో చూపించగా ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ టెస్ట్‌లలో బాలునికి బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించారు. వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న వైద్యులు చెన్నైలోని అడయార్ ఆసుపత్రిలో చూపించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో ఆరునెలలు అక్కడే ఉండి ఓ చికెన్ షాపులో పనిచేస్తూ బాలుడికి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఎనిమిది నెలల క్రితం వరకు వాహిద్ అడయార్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఇంటికి తీసుకొచ్చిన తరువాత కూడా వారు చెప్పిన సమయంలో చెన్నై తీసుకువెళ్లి టెస్టులు చేయించి తీసుకు వస్తున్నారు. అయితే మళ్లీ ఆరోగ్యం క్షీణించింది. బాలుడు నీరసించాడు. మళ్లీ అడయార్ ఆస్పత్రిలో చూపించగా బ్లడ్ క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టిందని.. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని రూ.25 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో బాలుని తండ్రి జిలానీ గుండె జారినంత పనైంది. తన పరిస్థితి ఆసుపత్రిలో చెప్పగా ఆసుపత్రి తరఫున రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఏపీ ప్రభుత్వం ద్వారా మరో రూ.10 లక్షలు మంజూరు చేయించుకుని వస్తే ట్రీట్మెంట్ చేస్తామని అన్నారు. జిలానీ సచివాలయం చుట్టూ రెండు నెలలు తిరిగి రెండు దఫాలుగా రూ.8 లక్షలు మంజూరు చేయించుకున్నాడు. ఆస్పత్రికి కట్టాల్సిన మరో రూ.2 లక్షలు, అక్కడ అయ్యే ఇతర ఖర్చులు మరో లక్ష రూపాయలు సహృదయం కలిగిన దాతలు సాయం చేస్తారని ఎదురు చూస్తున్నాడు. ఈనెల 14వ తేదీన బాలుడుని ఆసుపత్రికి తీసుకు రావాలని వైద్యులు సూచించారు. అప్పటిలోగా బాలుని వైద్యఖర్చులకు డబ్బులు ఎలా తేవాలని తలమునకలవుతున్నాడు. జిలానీకి ఇల్లు లేదు, పొలం లేదు..పని చేసుకుంటే తినాలి..లేకుంటే పస్తులుండాలి. ప్రస్తుతం రాజంపల్లిలో చికెన్ షాపులో పని చేస్తూ అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబం పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాను సంపాదించి వైద్యం చేయించే పరిస్థితి లేదు. దాతలు వచ్చి సాయం చేస్తే తన కుమారుడుని బతికించుకుంటానని వేడుకుంటున్నారు. సాయం చేయవలసిన దాతలు ఎస్బీఐ దర్శి శాఖ ఖాతా నంబర్:34224821839కు నగదు జమ చేయవచ్చు. పూర్తి వివరాలకు బాలుని తండ్రి జిలానీ సెల్ నంబర్ 8465043500 నంబరును సంప్రదించవచ్చు. -
పూనకంతో ఊగిపోతూ హల్ చల్ చేసిన యువకుడు
-
నెత్తిపై రాయి.. నాగిని డాన్స్
సాక్షి, ప్రకాశం: మూఢనమ్మకాలను రూపుమాపేందుకు జన విజ్ఞాన వేదికలు కృషి చేస్తుంటే.. కొందరు మాత్రం ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ కుర్రాడు పూనకంతో ఊగిపోతూ హల్ చల్ చేశాడు. స్వయంభూ శివలింగం వెలిసిందంటూ దర్శి మండలం శివరాజ్ నగర్లో హడావుడి చేసాడు. శ్రీను అనే యువకుడు స్థానికంగా కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ, హఠాత్తుగా ఓ రాయిని శివలింగంగా చెబుతూ నెత్తిన పెట్టుకొని పూనకంతో ఊగిపోయాడు. తనను ముట్టుకోవద్దంటూ ఊగిపోతూ ప్రజల మధ్యలోకి వచ్చి ఆ రాయికి పూజలు చేశాడు. ఊరిపోలిమేరలో వెలసిన శివలింగానికి వెంటనే గుడికట్టాలని, లేదంటే ఊరికే అరిష్టం అంటూ నాగిని డాన్స్‌తో ఊగిపోయాడు. అతన్ని చూసిన గ్రామస్థులు స్వామి.. స్వామి అంటూ అతని చుట్టూ చేరటం విశేషం. ప్రస్తుతం వాట్సాప్‌లో అందుకు సంబంధించిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. -
ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం
తాళ్లూరు: దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలంలో శని, ఆదివారాల్లో జరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర విజయవంతమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి బాదం మాధవరెడ్డి పేర్కొన్నారు. తాళ్లూరులో ఆదివారం మాజీ ఎంపీపీ ఇడమకంటి గురువారెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాళ్లూరులో బహిరంగ సభతో సహా ప్రజా సంకల్ప యాత్ర విజయవంతానికి కృషి చేసిన దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు బాదం కృతజ్ఞతలు తెలిపారు. తాళ్లూరు వెల్లంపల్లి బస్టాండ్‌లో జరిగిన బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు హాజరై అభిమానాన్ని చాటడం ఎప్పటికీ మరువలేనన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ఏర్పాట్లను వారం నుంచి పర్యవేక్షించిన కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తాళ్లూరు, కుంకుపాడు రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉన్న సమయంలో పాదయాత్ర కోసం చక్కగా రోడ్డు వేసిన వైస్ ఎంపీపీ రమావెంకటేశ్వరరెడ్డికి అభినందనలు తెలిపారు. సంకల్ప యాత్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఎండను సైతం లెక్కచేయకుండా బహిరంగ సభను విజయవంతం చేసిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు... 2019 సార్వత్రిక ఎన్నికల్లో తనను వైఎస్సార్ సీపీ దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసి బహిరంగ సభలో ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణ పడి ఉంటానని బాదం మాధవరెడ్డి పేర్కొన్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ప్రజల మద్దతుతో ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ తాళ్లూరు, దర్శి, దొనకొండ మండలాల అధ్యక్షులు ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల క్రిష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, ఎంపీపీ గోళ్లపాటి మోషే, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, ముండ్లమూరు మాజీ అధ్యక్షుడు సుంకర బ్రహ్మానందరెడ్డి, వైస్ ఎంపీపీ ఐ.రమావెంకటేశ్వరరెడ్డి, కోఆప్షన్ మెంబర్ వలి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎల్జీ వెంకటేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు, ఉప సర్పంచి బెల్లంకొండ శ్రీనివాసరావు, వల్లభనేని వీరయ్య చౌదరి, నారిపెద్ది రామ్మూర్తి, మాజీ సర్పంచి చింతా శ్రీనివాసరెడ్డి, మేడగం శ్రీనివాసరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు రామకోటిరెడ్డి, అంజిరెడ్డి, బీసీ ప్రధాన కార్యదర్శి బొల్లా వెంకటనర్సయ్య, తిరుపతయ్య, చెన్నారెడ్డి, బాదం రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాదంకు పలువురి అభినందనలు... 2019 సాధారణ ఎన్నికలలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బాదం మాధవరెడ్డిని ఆ పార్టీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సందర్భంగా అధిక సంఖ్యలో నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. మాధవరం ఉప సర్పంచి బెల్లంకొండ శ్రీనివాసరావు, కార్యకర్తలు ఎదురు చంద్రశేఖర్‌రెడ్డి, ఎదురు శ్రీనివాసరెడ్డి, యార్తల యలమందారెడ్డి, తూము వెంకటేశ్వరరెడ్డి, మున్నేల్లి రఘనాథరెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ మహ్మద్ జానిలు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. రజానగరం వైఎస్సార్ సీపీ సేవాదళం ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను బాదంకు వివరించారు. సేవా దళం సభ్యులు శాలువా కప్పి బాదంను సన్మానించారు. -
వెల్లువెత్తిన అభిమానం
తాళ్లూరు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు దర్శి నియోజకవర్గంలో ఆదివారం రెండోరోజు విశేష స్పందన లభించింది. తాళ్లూరు మండలం మల్కాపురం పంచాయతీ పరిధిలో రెండోరోజు జననేత జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. రజానగరం మేజర్ వద్ద నుంచి ప్రారంభమైన యాత్ర.. మల్కాపురం పంచాయతీ పరిధిలోని ఎస్టీకాలనీ మీదుగా 3 కిలోమీటర్ల మేర నియోజకవర్గంలో సాగింది. చిలకలేరు బ్రిడ్జి మీదుగా అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి మండలంలోకి ప్రవేశించింది. అడుగడుకునా జన నీరాజనం... వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు దర్శి నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాదం మాధవరెడ్డి ఆధ్వర్యంలో అడుగడుగునా జనం నీరాజనం పలికారు. నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు, మహిళలు, రైతులు దారిపొడవునా జగన్‌ను కలిసేందుకు ఆసక్తి కనబరిచారు. కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మల్కాపురం కాలనీ వద్ద కో ఆప్షన్ మెంబర్ వలి ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా స్వాగతం పలికి చేనేత సంచిని బహుమతిగా ఇచ్చారు. వెలుగువారిపాలెంలో ఎంపీటీసీ సభ్యులు కోటేశ్వరమ్మ నాగళి బహూకరించారు. సమస్యల నివేదన... అంగన్వాడీ వర్కర్లు తమకు తెలంగాణ ప్రభుత్వంలో పెంచినట్లు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏపీ కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ చెయ్యాలని, ఒకేషనల్ పార్ట్ టైం లెక్చరర్లు ఉద్యోగ భద్రత కల్పించాలని, వికలాంగులు, ఎంఆర్పీఎస్ నేతలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగన్‌కు వినతిపత్రాలు అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి బాదం మాధవరెడ్డి దర్శి నియోజకవర్గం నుంచి అద్దంకి నియోజకవర్గంలోని యాత్ర ప్రవేశించే వరకు జననేత జగన్‌తో కలిసి నడిచారు. అనంతరం అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి బాచిన చెంచుగరటయ్య జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో తాళ్లూరు, దర్శి మండలాల పార్టీ అధ్యక్షులు ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, వెన్నపూస వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, ఎంపీపీ గోళ్లపాటి మోషే, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, ఐవీ రెడ్డి, వైస్ ఎంపీపీ రమావెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదనరెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు సుంకర బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ఎల్జీ వెంకటేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు, సర్పంచ్ టీవీఆర్ సుబ్బారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఎం.బ్రహ్మారెడ్డి, ఉప సర్పంచిలు శ్రీనివాసరావు, హనుమంతరావు, మాజీ సర్పంచిలు మేడగం శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు రామకోటిరెడ్డి, యూత్ అధ్యక్షుడు శరత్, ధర్మేంద్ర, కోటయ్య, తిరుపతయ్య, నాయకులు లింగారెడ్డి, తిరుపతిరెడ్డి, సుబ్బారెడ్డి, ఎదురు చంద్రశేఖర్‌రెడ్డి, ఎదురు శ్రీనివాసరెడ్డి, యార్తల యలమందారెడ్డి, తూము వెంకటేశ్వరరెడ్డి, మున్నేల్లి రఘనాథరెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ మహ్మద్‌జాని పాల్గొన్నారు.