పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా గోరంట్ల రవికుమార్ నియామకంపై ఆగ్రహం
సామూహిక రాజీనామాలకు సిద్ధమని అధిష్టానానికి అల్టిమేటం
టీడీపీ సమావేశం రసాభాస
దర్శి: టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి గోరంట్ల రవికుమార్‌కు తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులు, వివిధ హోదాల్లోని నాయకులతో ఆ పార్టీ కార్యాలయంలో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. దర్శి మండల టీడీపీ కన్వీనర్ వెంకటేశ్వర్లు, పార్టీ పట్టణ అధ్యక్షుడు వాసు, ముండ్లమూరు మాజీ ఎంపీపీ వెంకట్రావు, కురిచేడు మండల మాజీ అధ్యక్షుడు నాగరాజు, దొనకొండ మండల అధ్యక్షుడు శివకోటేశ్వరరావు, తాళ్లూరు మండల అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. ఎవరినడిగి రవికుమార్‌ను ఇన్‌చార్జిగా రవికుమార్‌కు ఇచ్చారంటూ అధిష్టానంపై మండిపడ్డారు.
అధిష్టానానికి అనుకూలంగా ఉండే రియల్టర్లు, డబ్బున్న వాళ్లను తెచ్చుకుంటున్నారని, వాళ్లు ఇక్కడ ఓడిపోగానే వెళ్లిపోతున్నారని, దీంతో ఇక్కడ పార్టీకి దిక్కు లేకుండాపోతోందన్నారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్లందరికీ దర్శి కనబడుతుందని, బయట నుంచి వచ్ఛిన మన్నెం వెంకటరమణ, కదిరి బాబూరావు, శిద్ధా రాఘవరావు, పమిడి రమేష్, వేమా సుబ్బారావు వంటివారు ఎన్నికలప్పుడు వచ్చి తర్వాత వెళ్లిపోయారని, అలాంటి నాయకులకు టికెట్లు ఇవ్వవద్దని కోరారు. స్థానికులు కాకపోవడం వల్ల ఓడిన వెంటనే వెళ్లిపోయి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సామూహిక రాజీనామాలకు సిద్ధం
దర్శి సీటును జనసేనకు ఇచ్చినా తమకు ఇబ్బంది లేదని.. ఇక్కడ నివాసం ఉండే వారికే టికెట్ వ్వాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. స్థానికులకు టికెట్ ఇవ్వకపోతే నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, మండల టీడీపీ అధ్యక్షులు, అన్ని హోదాల్లో ఉన్న నాయకులు రాజీనామాలకు సైతం సిద్ధమని ప్రకటించారు. ఇప్పటివరకు దర్శిలో టీడీపీ ఇన్‌చార్జ్ లేకపోయినా పార్టీ ఆదేశానుసారం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను తాము నిర్వహిస్తున్నామన్నారు.
ఇప్పటికిప్పుడు టీడీపీ ఇన్‌చార్జిని ప్రకటించడం బాధాకరమన్నారు. మూడేళ్లుగా టీడీపీకి నియోజకవర్గ ఇన్‌చార్జి లేకపోవడం, స్థానిక నాయకులతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా టీడీపీ ఇన్‌చార్జిని ప్రకటించడం చాలా బాధాకరమన్నారు. దీంతో సమావేశం ఆద్యంతం రసాభాసగా మారింది. గతంలో ఇన్‌చార్జిలను ప్రకటించినప్పుడు ఏం చేశారని రవికుమార్‌కు మద్దతుగా కొందరు మాట్లాడారు. దీంతో పారీ్టలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment