పట్టణంలో గురువారం దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్థానికంగా బాలాజీ నగర్‌లో నివాసముండే లక్ష్మీ (50) అనే మహిళను గొంతుకోసి హతమార్చారు. మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న బంగారు నగలను చోరీకి యత్నించారు. అయితే మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లే క్రమంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గొంతు కోసి ఈ అఘయిత్యానికి పాల్పడ్డారు. రక్తపు మడుగులో పడివున్న లక్ష్మీని కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించగా దారిలోనే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు మాట్లాడుతూ.. తమకు ఎవరిపై అనుమానం లేదని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదంటూ విలపిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
దోపిడీ దొంగలు రెచ్చిపోయారు
Published Thu, Apr 5 2018 3:49 PM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement