
ICC Women World Cup 2022 Final Aus Vs Eng- క్రైస్ట్‌చర్చ్‌లో ఆదివారం జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు భారత్‌కు చెందిన జీఎస్ లక్ష్మి మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మి గతంలోనూ ఇలాంటి పాత్ర పోషించారు. 2020లో యూఏఈలో జరిగిన పురుషుల ప్రపంచకప్ లీగ్–2 మ్యాచ్‌లకు ఆమె మ్యాచ్ రిఫరీగా సేవలందించారు ఇక ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగే టైటిల్ పోరుకు రిఫరీగా సేవలు అందించనున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రపంచకప్-2022 ఫైనల్‌కు ఫీల్డ్ అంపైర్లుగా లారెన్ (దక్షిణాఫ్రికా), కిమ్ కాటన్ (న్యూజిలాండ్), థర్డ్ అంపైర్ (టీవీ)గా జాక్వెలిన్ (వెస్టిండీస్) వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో నలుగురు మహిళలు ఒకేసారి భిన్న బాధ్యతలు నిర్వర్తిస్తూ భాగం కావడం చరిత్రలో ఇదే తొలిసారి.
చదవండి: IPL 2022: రసెల్ విధ్వంసం